ప్రముఖుల కామెంట్స్

ఇంగ్లాండ్ విజయం, పాక్ ఓటమిపై

YouSay Short News App

టీ20 విశ్వవిజేతగా ఇంగ్లండ్‌ అవతరించడం పట్ల అనేక మంది అనేక రకాలుగా కామెంట్లు చేశారు. ఇందులో చిన్న చిన్న సంవాదాలు కూడా తలెత్తాయి.

పాకిస్థాన్ మ్యాచ్ ఓడిపోవటంతో గుండె బద్దలయ్యిందన్నట్లుగా షోయబ్ అక్తర్ పోస్ట్ చేశాడు. దీనికి టీమిండియా బౌలర్ షమీ సారీ బ్రదర్..దీన్నే కర్మ అంటారు అని కామెంట్ పెట్టాడు. దీనికి హర్ష బోగ్లే పాక్ బౌలింగ్ అద్భుతమంటూ చేసిన ట్వీట్ ను జతపర్చి ఇది తెలివైన కామెంట్ అని రిప్లై ఇచ్చాడు.

అక్తర్ - షమీ

షోయబ్ అక్తర్ కామెంట్స్‌పై షమీ తీరు సరికాదని షాహిద్ అఫ్రిదీ అన్నాడు. రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లే ఇలాంటివి మాట్లాడకూడదని..అలాంటిది జట్టులో ఉన్న క్రికెటర్ అలా కామెంట్ చేయటం మంచిది కాదని సూచించాడు.

షాహిద్ అఫ్రిదీ

“రెండు టీ ట్వంటీ ప్రపంచకప్‌లు సాధించినందుకు ఇంగ్లాండ్‌కు సచిన్ అభినందనలు. ఫైనల్ మ్యాచ్ హోరాహారీగా సాగింది. షాహీన్ షా గాయపడకపోతే మ్యాచ్ మరింత ఆసక్తికరంగా ఉండేది”.

సచిన్ తెందూల్కర్

దూకుడుగా ఆడుతూ క్రికెట్ ప్రపంచానికి మంచి వినోదం పంచుతున్న ఇంగ్లాండ్ కు అభినందనలు. పాకిస్థాన్ చివరి వరకు పట్టుదలగా పోరాడింది.

సనత్ జయసూర్య

ఫైనల్ మ్యాచ్ లో తీవ్రమైన ఒత్తిడిలోనూ బెన్ స్టోక్స్ కీలక ఇన్నింగ్స్ ఆడి చెదిరిపోని ముద్ర వేశాడు. సోదరులకు శుభాకాంక్షలు.

యువరాజ్ సింగ్

షహీన్ షా అఫ్రిదీ గాయపడకపోయి ఉంటే మ్యాచ్ కీలక దశలో మలుపు తిప్పేవాడు. పాక్ గెలిచేది అని చెప్పట్లేదు గానీ ఏదైనా మార్పు జరిగేదన్నారు. ఫైనల్ మ్యాచ్ లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలింగ్ చూశా ..పాక్ టీం ప్రపంచంలోనే గొప్ప జట్టు.

ఇమ్రాన్ ఖాన్

“ఇంగ్లాండ్ కు ప్రపంచకప్ లోనే ఇది అద్భుతమైన విజయం. చాలా బాగా ఆడారు”

ఇర్ఫాన్ పఠాన్

“ఇంగ్లాండ్ జట్టు వైట్ బాల్ క్రికెట్ లో ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు.. జట్టులో మేటి ఆటగాళ్లు ఉన్నారు, అందుకే వైట్ బాల్‌లో  రెండు ప్రపంచ కప్‌లు సాధించారు. కీలక సమయాల్లో ఎలా ఆడి గెలవాలో బెన్ స్టోక్స్ బాగా తెలుసు”

మైఖెల్ వాన్

“పాకిస్థాన్ పై అద్భుతమైన విజయం సాధించిన ఇంగ్లాండ్ కు అభినందనలు. రెండు జట్లు వీరోచితంగా పోరాడాయి.. బెన్ స్టోక్స్ మరోసారి క్లాస్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.”

సురేశ్ రైనా

“కోల్ కతా పీడకల నుంచి బెన్ స్టోక్స్ కు విముక్తి కలిగింది”

నాసిర్ హుస్సేన్( ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌)

“ఇంగ్లాండ్ రెండు వైట్ బాల్ ట్రోఫీలు సాధించినందుకు శుభాకాంక్షలు . జట్టులో  డెప్త్ లైనప్ తో పాటు మ్యాచ్ విన్నర్లు ఉన్నారు.  పాకిస్థాన్ కూడా అద్భుతంగా ఆడింది. ఆ స్కోర్ ను ఎవరైనా రక్షించుగోలరంటే అది ఆ జట్టే కానీ షహీన్ షా కు గాయమవ్వటం దెబ్బతీసింది”

రస్సేల్( వెస్టిండీస్‌ క్రికెటర్‌)