FIFA ఫుట్ బాల్ ప్రపంచకప్ ఫైనల్స్‌లో సెలబ్రిటీల సందడి

YouSay Short News App

ఫుట్ బాల్ ప్రపంచకప్ ఫైనల్. ఈ మ్యాచ్ కు కచ్చితంగా చరిత్రలో ఓ పేజీ ఉంటుంది. నరాలు తెగే ఉత్కంఠ, ఎన్నో మలుపులు ప్రేక్షకుల భావోద్వేగాల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ ను ఆస్వాదించేందుకు భారత్ సహా వివిధ దేశాల నుంచి ప్రముఖులు తరలివచ్చారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూయెల్ మాక్రన్, ఎలాన్ మస్క్ తో పాటు భారత్ నుంచి దీపికా పదుకొణె, నోరా ఫతేహీ, రన్ వీర్ సింగ్, రవిశాస్త్రి, మమ్ముట్టి, మోహన్ లాల్ ఇలా చాలామందే సందడి చేశారు.

రోమాలు నిక్కపొడిచేలా సాగిన మ్యాచ్ చాలా కిక్ ఇచ్చిందని వాళ్ల అభిప్రాయం. ఇలాంటి మ్యాచ్ ఎప్పుడో ఒకసారి చూస్తామని వారి ఫీలింగ్.

ఫ్రాన్స్ , అర్జెంటీనా మధ్య ఫైనల్ పోరుకు ముందు నోరా ఫతేహీ ఫిఫా వేదికపై తన డాన్స్ తో అలరించింది. అదిరిపోయే స్టెప్పులతో అందాల కనువిందు చేసింది.

నోరా ఫతేహీ

దీపికా పదుకొనె

ఫైనల్ మ్యాచ్‌కు ముందు ట్రోఫీ ఆవిష్కరించే కార్యక్రమంలో దీపిక పదుకొనె అదిరిపోయే డ్రెస్సులో తళుక్కున మెరిసింది. ట్రోఫీ ఆవిష్కరణలో పాల్గొన్న మెుదటి భారతీయురాలుగా దీపిక రికార్డులకెక్కింది.

మ్యాచ్ ఆస్వాదించిన వారిలో మరొకరు భారత మాజీ కోచ్ రవిశాస్త్రి. ఖతర్‌లో ఫుట్‌బాల్ మైదానంలో నటుడు రన్ వీర్ సింగ్ తో కలిసి సెల్ఫీ వీడియో తీసుకుని సందడి చేశారు.ఆసక్తికరంగా ఏం జరిగినా రన్‌వీర్‌ ఉంటారంటూ కామెంట్‌ చేశారు.

రణ్ వీర్ సింగ్- రవిశాస్త్రి

ఫిఫా ఫైనల్ ను మళయాలం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఆసక్తిగా తిలకించారు. అందరిలానే మ్యాచ్ కోసం వేచి చూశానంటూ ఆట ప్రారంభానికి ముందు పోస్ట్ చేశారు.

మోహన్ లాల్

మళయాలం మరో హీరో మమ్ముట్టి కూడా ఫైనల్ వీక్షేంచేందుకు ఖతర్ వెళ్లారు. అతిపెద్ద క్రీడా సమరానికి సాక్ష్యం. ఇది సూపర్ మూమెంట్ అని పోస్ట్ పెట్టడంతో పాటు ఫ్యాన్స్ కి సెల్ఫీలు ఇవ్వడం ఆకట్టుకుంది.

మమ్ముట్టి

ఇమాన్యుయెల్ మాక్రాన్

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూయెల్ మాక్రన్ ఫైనల్ మ్యాచ్ ను బాాగా ఆస్వాదించారు. వాళ్లు గోల్ చేసేందుకు సగటు ప్రేక్షకుడిలా అరుస్తూ..మద్దతిస్తూ తిలకించారు. ఫ్యాన్స్ ఓడిపోవటంతో ఆ జట్టు ఆటగాళ్లను ఓదార్చారు.

ఈ కీలక సమరాన్ని ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ తిలకించారు. అందరితో కలిసి మ్యాచ్ ఆస్వాదిస్తూ కలియ తిరిగారు.

ఎలాన్ మస్క్

డేవిడ్ బెక్ హామ్

ఇంగ్లాండ్ ఫుట్ బాల్ లెజెండ్ డేవిడ్ బెక్ హామ్ తన కుమారుడితో మ్యాచ్ కు వచ్చాడు. అక్కడ తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేశాడు.

తొలిసారి ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూసివారిని ఉర్రూతలూగించిన మ్యాచ్‌ను లైవ్‌లో చూసేందుకు ఇంకా మరికొంతమంది ఆటగాళ్లు కూడా వచ్చినట్లు తెలుస్తోంది.