CHANDRAYAAN 3: ఇస్రో టార్గెట్ ఇదే... అమెరికా, చైనా, రష్యాకు గట్టి షాక్

YouSay Short News App

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది.

జులై 13న చంద్రయాన్-3 ప్రయాగానికి ముహూర్తం ఖరారు చేసింది.

చంద్రయాన్ 2కు కొనసాగింపుగా చంద్రయాన్ 3 ప్రయోగం చేపడుతున్నారు

చంద్రయాన్ 3 ప్రత్యేకతలు

జాబిల్లిపై రోవర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం కోసం ఇస్రో చేపడుతున్న ప్రయోగం ఇది

ఇప్పటి వరకు చంద్రుడిపై అమెరికా, చైనా, రష్యా మాత్రమే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి.

ఒక వ్యోమ నౌక నిర్ధిష్ట కక్ష్యలో ల్యాండర్ నుంచి విడిపోయి చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా దిడడాన్ని 'సాఫ్ట్ ల్యాండింగ్' అంటారు.

సాఫ్ట్ ల్యాండింగ్ అంటే?

1. చందమామ ఉపరితలంపై రోవర్‌ను సురక్షితంగా సాఫ్ట్‌ల్యాండింగ్ చేయడం 2. జాబిల్లిపై రోవర్‌ను తిరిగేలా చేయడం 3. రోవర్ ద్వారా చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలు నిర్వహించడం

చంద్రయాన్ 3 టార్గెట్?

భారత్ చేపడుతున్న చంద్రయాన్‌ 3 ప్రయోగంపై అంతరిక్షయానంలో చాల ముఖ్యమైంది

ఎందుకంత కీలకం

ఎందుకంటే చంద్రుడిపై ఇప్పటి వరకు ఎవరూ చేరుకుని ప్రాంతం 'చంద్రుడి ధృవణం' పైకి ల్యాండర్‌ను పంపిస్తున్నారు. భవిష్యత్ ప్రయాగాలకు ఇది మార్గ నిర్దేశం చేయనుంది.

2019లో సెప్టెంబర్ 6న చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో ప్రయత్నించింది. కానీ, విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై క్రాష్ ల్యాండ్ అయ్యింది.

చంద్రయాన్-2

ఈ ప్రయోగం నుంచి పాఠాలు నేర్చిన ఇస్రో, చంద్రయాన్ 3 డిజైన్‌లో మార్పులు చేసింది.

చంద్రయాన్ 3 ద్వారా చంద్రుడిపై రసాయనాలు, అక్కడి మట్టి, నీటి అణువులను పరిశోధించనున్నారు.

చంద్రుడి ప్రకంపనలను గుర్తించే సైస్మోమీటర్ వంటి అత్యాధునిక పరికరాలను ప్రస్తుత వ్యోమనౌకలో పంపిస్తున్నారు

వీటి ద్వారా చంద్రుడి ఉపరితల ఉష్ణోగ్రత, వాతావరణం అధ్యాయనం చేయవచ్చు

చంద్రయాన్ 3 ప్రయోగం చేపట్టేందుకు కేంద్రం రూ.615 కోట్లు ఖర్చు పెట్టింది

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran