CHANDRIKA RAVI: మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయన్న భామ
YouSay Short News App
బాలకృష్ణ హీరోగా రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ వీర సింహా రెడ్డి మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే అనే పాటకు రెస్పాన్స్ అదిరిపోయింది.
ఈ పాటలో ఆడిపాడిన అమ్మాయి పేరు చంద్రిక రవి. షూటింగ్‌లో వెన్నునొప్పి బాధపెట్టినా కూడా డాన్స్ చేసిందట. మరి ఆమె గురించి తెలుసుకోవాలని ఉందా?
ఆస్ట్రేలియాలోని ఓ చిన్న టౌన్‌లో చంద్రిక రవి పుట్టింది. కానీ, కుటుంబం మూలాలు దక్షిణ భారతదేశంలో ఉన్నాయంటోంది ముద్దుగుమ్మ. తెలుగు సినిమాలు చూస్తు పెరిగిందట.
దక్షిణాది కుట్టి
భారత సంతతికి చెందిన ఈమె మోడల్‌గా గుర్తింపు సంపాదించింది. 2014 మిస్ మాక్సిమ్ ఇండియాలో చంద్రిక రన్నరప్.
మోడల్
మూడేళ్లున్నప్పుడే భరతనాట్యం, కూచిపూడి, కథక్ లాంటి నృత్యరూపకాలను ఆమె తల్లిదండ్రులు చంద్రికకు నేర్పించారు. వెస్ట్రన్ కూడా అవపోసన పట్టింది.
అన్ని డాన్స్‌లు
చంద్రిక తల్లి మంచి డాన్సర్. తండ్రి తబల వాయిస్తారు. దీనివల్లే తన జీవితంలో కూడా అవి భాగమయ్యాయన చెబుతుంది.
తల్లిదండ్రులు కళాకారులే
తమిళ్ చిత్రం సేయ్, ఇరుత్తు ఆరియిల్ మురిత్తు కుత్తు అనే సినిమాల ద్వారా పరిచయం అయ్యంది. చీకటి గదిలో చితకొట్టుడులో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది.
చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ
బాలకృష్ణతో అవకాశం రావటం అదృష్టమని చెబుతోంది చిన్నది. ఎన్నో విషయాలు నేర్చుకుందట. ఆయనతో డాన్స్ చేయడం మర్చిపోలేని అనుభూతి అంటోంది.
బాలయ్యతో అవకాశం
బాలయ్యకు ఉన్న క్రేజ్‌తో పాటు మాస్ పాట పడటం. అందులో ఆమె బాలకృష్ణతో వేసిన స్పెప్పులకు విజిల్స్ పడ్డాయి. క్షణాల్లో లక్షల్లో వ్యూస్ రావటంతో ఈ భామ ఫుల్ హ్యాపీ.
గంటల్లోనే మిలియన్ల వ్యూస్
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే పాట షూటింగ్‌లో వెన్నునొప్పితోనే చంద్రిక డాన్స్ చేసింది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుందట అంతే.
వెన్ను నొప్పితోనే స్టెప్పులు
పాట చిత్రీకరణ ముగిసిన తర్వాత ఆమెను చిత్ర యూనిట్ అభినందించింది. దర్శకుడు గోపిచంద్, డాన్స్ మాస్టర్ శేఖర్ ఆమెను మెచ్చుకున్నారు.
చిత్రయూనిట్ ప్రశంసలు
చంద్రిక వరుస పెట్టి సినిమాలకు ఓకే చెబుతోంది. తమిళ్‌లో కొన్నింటికి సైన్ చేసింది. తెలుగులోనూ ఓ సినిమా చర్చల దశలో ఉన్నట్లు టాక్. యూఎస్‌లో కొన్ని షోస్ కూడా ప్లాన్ చేసుకుంది.