Chetan Sharma:   కోహ్లీని కెప్టెన్‌గా కావాలనే పీకేశాం,  రోహిత్, కోహ్లీల మధ్య ఇగో..

YouSay Short News App

భారత క్రికెట్లో పెను దుమారం చెలరేగింది. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ విస్తుపోయే నిజాలు వెల్లడించాడు. ఓ టీవీ ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో పలు షాకింగ్ కామెంట్స్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు.

విరాట్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం, ప్లేయర్లు ఉత్ప్రేరకాలు తీసుకుంటారని, జట్టులో విరాట్‌, రోహిత్‌ల మధ్య ఈగో, టీ20ల నుంచి రోహిత్, విరాట్‌లను తప్పించడం వంటి విషయాలపై చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. చేతన్ శర్మ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే చూద్దాం.

విస్తుపోయే విషయాలు

భారత ఆటగాళ్లు పూర్తి ఫిట్‌గా లేకుంటే ఇంజెక్షన్లు ఇచ్చి మ్యాచ్ ఆడించేవారు. 80శాతం ఫిట్‌నెస్ ఉంటే డోపింగ్ టెస్టుకు పట్టుబడని విధంగా ఉండే ఉత్ప్రేరకాల మందులను వాడి 100శాతం ఫిట్‌నెస్ సాధించేవారు. బుమ్రాని కూడా ఇలాగే ఆడించారు. ఇప్పటికీ బుమ్రా పూర్తి ఫిట్‌గా లేడు.

ఇంజెక్షన్లు

వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్‌ను కావలనే తొలగించాం. రోహిత్ శర్మపై మక్కువతో కెప్టెన్‌ని చేయలేదు. కోహ్లీతో పడకపోవడంతోనే కెప్టెన్సీ నుంచి పీకేశాం. ఇది ఉమ్మడి నిర్ణయం. ఇందుకు విరాట్ ఫామ్ లేమి కూడా కలిసివచ్చింది.

విరాట్ కెప్టెన్సీ

టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగడంపై మరోసారి ఆలోచించాలని గంగూలీ విరాట్‌కు చెప్పాడు. ఆ సమయంలో మేం కూడా ఉన్నాం. కానీ, విరాట్ వినిపించుకోలేనట్లు ఉన్నాడు. మీడియాతో మాత్రం కోహ్లీ అబద్ధం చెప్పాడు. తనను కెప్టెన్‌గా కొనసాగాలని గంగూలీ కోరలేదని విరాట్ చెప్పాడు. ఇది కరెక్టు కాదు.

అబద్ధం

రోహిత్, కోహ్లీల మధ్య ఈగో ఉంది. జట్టులో రెండు వర్గాలు ఉన్నాయి. రోహిత్ వర్గం, కోహ్లీ వర్గం. అయితే, రోహిత్, కోహ్లీల మధ్య మాత్రం మంచి సంబంధాలే ఉన్నాయి. కోహ్లీ ఫామ్‌లో లేనప్పుడు రోహిత్ అండగా నిలిచాడు.

రోహిత్, కోహ్లీ మధ్య ఈగో

భవిష్యత్తు క్రికెట్‌లో రోహిత్ శర్మ ఇక టీ20ల్లో ఉండబోడు. దీర్ఘకాల కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యానే కొనసాగుతాడు.

టీ20ల్లో నో రోహిత్

టీ20ల్లో శుభ్‌మన్ గిల్‌కి అవకాశం కల్పించడానికి రోహిత్, విరాట్‌లకు విశ్రాంతినిచ్చాం. గిల్ మంచి ఫామ్‌లో ఉండటంతో ఇతరుల అవకాశాలు సన్నగిల్లాయి.

గిల్ కోసం

సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా.. ఇలా 15-20 మందిని జట్టులోకి తీసుకొచ్చింది నేనే.

తెచ్చింది నేనే

గిల్, ఇషాన్ కిషన్ ఫామ్‌లో ఉండటంతో ధావన్, సంజు శ్యాంసన్, కేఎల్ రాహుల్‌ల ఫ్యూచర్‌ రిస్క్‌లో పడింది.

వీరికి రిస్క్

రవిశాస్త్రి భారత కోచ్ కావడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు కుంబ్లేతో విభేదాలు ఏర్పడిన సంగతి తెలిసిందే.

రవిశాస్త్రి వెనుక కోహ్లీ

రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలు నన్నెంతో విశ్వసిస్తారు. గుడ్డిగా నమ్మేస్తారు. ఇక హార్దిక్ అయితే తరచూ నన్ను కలుస్తుంటాడు.

నాపై విశ్వాసం

ఇలా ఇంటిగుట్టు బయటపెట్టిన చేతన్ శర్మపై బీసీసీఐ వేటు వేస్తుందని అంతా భావిస్తున్నారు. ఇప్పటివరకు బీసీసీఐ అధికారికంగా స్పందించలేదు. అయితే, చీఫ్ సెలక్టర్ పదవి నుంచి చేతన్ శర్మను తొలగిస్తారని టాక్.

వేటు తప్పదా?