సంక్రాంతి వచ్చిందంటే చాలు సినిమాల సందడి మెుదలవుతుంది. కాస్త టాక్ బాగుంటే చాలు కలెక్షన్ల సునామీ సృష్టించాల్సిందే. అందుకే పెద్ద హీరోలందరూ పండగకు పోటీ పడుతుంటారు.
మెగాస్టార్ చిరంజీవి మరోసారి వాల్తేరు వీరయ్యతో ప్రేక్షకులను పండగకి పలకరిస్తున్నారు. ఇప్పటివరకు చిరు సంక్రాంతికి రిలీజ్ చేసిన చిత్రాల్లోబ్లాక్ బస్టర్స్ ఇవే.
కోదండరామి రెడ్డి దర్శకత్వంలో చిరు, భానుప్రియ, రాధిక , మాధవి నటించిన దొంగ మెుగుడు 1987 సంక్రాతి బరిలో సక్సెస్ కొట్టింది. ఇందులో చిరు ద్విపాత్రాభినయం చేసి అదరగొట్టారు.
దొంగ మెుగుడు
కే. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన
చిత్రం 1988 జనవరి 14న విడుదల అయ్యింది. సుహాసిని, విజయశాంతి మెగాస్టార్ సరసన నటించారు. ఇది కూడా సూపర్ హిట్ సాధించింది.
మంచి దొంగ
అత్తకు యముడు అమ్మాయికి మెుగుడు చిత్రంతో చిరుకి కోదండ రామిరెడ్డి మరో పండగ హిట్ ఇచ్చారు 1989లో విడుదలైన సినిమాను ఇంటిల్లిపాది చూసి ఆదరించారు. దీనిని తమిళ్‌లో డబ్ చేశారు.
అత్తకు యముడు అమ్మాయికి మెుగుడు
చిరంజీవి కెరీర్‌లో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ముఠా మేస్త్రీ ఒకటి. 1993 జనవరి 17న విడుదలై అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టింది. మెగాస్టార్ బెస్ట్ యాక్టర్ ఫిల్మ్‌ఫేర్ అందుకున్నారు.
ముఠా మేస్త్రీ
చిరంజీవి మూడు పాత్రల్లో నటించిన చిత్రం ఇది. 1994లో పండగ బరిలో నిలిచింది. చిరు యాక్టింగ్‌కు మంచి మార్కులు పడిన ఆశించిన స్థాయిలో ఆడలేదట.
ముగ్గురు మెనగాళ్లు
వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న కొణిదెల హీరోను సంక్రాంతి మళ్లీ పైకి లేపింది. ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్‌లో వచ్చిన హిట్లర్ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్. పాటలు, చిరంజీవి డాన్స్ ఓ సెన్సేషన్.
హిట్లర్
1999 జనవరిలో వచ్చిన స్నేహం కోసం చిత్రం పండగకి రిలీజ్ అయ్యి యావరేజ్‌గా నడిచింది. ఇందులో చిరంజీవి తండ్రి పాత్రలోనూ తనే నటించడం మైనస్ అయిందని టాక్.
స్నేహం కోసం
చిరంజీవి, సౌందర్య కాంబినేషన్‌లో వచ్చిన అన్నయ్య 2000 జనవరి 7న విడుదల అయ్యింది. సినిమాకు మంచి రెస్పాన్స్ రావటంతో పాటు నంది అవార్డులు కైవసం చేసుకుంది.
అన్నయ్య
చిరంజీవి రాజకీయాల్లో నుంచి గ్యాప్ తీసుకున్న తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా. వి.వి. వినాయక్ దర్శకత్వం వహించిన చిత్రం సంక్రాంతికి హిట్ కొట్టింది. భారీ వసూళ్లు వచ్చాయి.
ఖైదీ నం. 150
సంక్రాంతి బ్లాక్ బస్టర్ జోష్‌ను చిరంజీవి కొనసాగించాలని చూస్తున్నారేమో. ఈ సారి కూడా వాల్తేరు వీరయ్యతో సిద్ధం అయిపోయారు. విజయంపై మరింత ధీమాాగా ఉన్నారు.