తెలుగు, తమిళ్ చిత్ర పరిశ్రమలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం సినిమాటిక్ యూనివర్స్. హనుమాన్ చిత్ర టీజర్ నుంచి హిట్-2 విడుదల వరకు ఎవ్వరి నోట విన్న ఇదే మాట.
దర్శకులు శైలేష్ కొలను, ప్రశాంత్ వర్మ తమ చిత్రాలను సినిమాటిక్ యూనివర్స్‌లో తీయబోతున్నామని ప్రకటించారు. అటు తమిళ్‌లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న లోకేశ్ కనగరాజ్ ఇదే బాటలో ఉన్నారు.
ఒకే ప్రపంచంలో వేర్వేరు కథలు నడుస్తాయి. ఒక్కో హీరోతో ఒక్కో సినిమా వస్తుంది. ఒక్కోసారి ఒక సినిమాలోకి మరో సినిమాలోని హీరో వస్తాడు. చివరికి అందరూ కలిసి ఒక కథ కూడా నడుస్తుంది.
సినిమాటిక్ యూనివర్స్ అంటే ?
మార్వెల్, అవెంజర్స్ వంటి హాలీవుడ్ చిత్రాలతో ఈ సినిమాటిక్ యూనివర్స్ తెలుగు, తమిళ పరిశ్రమలకు వచ్చింది. వాటి స్ఫూర్తితోనే దర్శకులు కథలు రాసుకొని సినిమాలు తెరకెక్కిస్తున్నారు.
హాలీవుడ్ నుంచి అరువు
ఖైదీ చిత్రంతో హిట్ కొట్టిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తన తదుపరి చిత్రాలకు కథను లింక్ చేస్తూ వచ్చాడు. విజయ్ మాస్టర్‌తో పాటు ఇటీవల వచ్చిన కమల్ విక్రమ్ వరకు అదే కోవలో తీశాడు. తన సినిమాటిక్ యూనివర్స్‌లో మరోచిత్రం కూడా ప్రకటించాడు ఈ దర్శకుడు.
ఎక్కడ ప్రారంభం?
తేజ సజ్జ హీరోగా హనుమాన్ చిత్రం తీస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఓ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నట్లు చెప్పాడు. అధీరా అనే మరో సినిమా కూడా ప్రకటించాడు.
తెలుగులో ఎవరు
దర్శకుడు శైలేష్ కొలను హిట్ ఫ్రాంఛైజీలో రెండు చిత్రాలు వచ్చాయి. ఇందులో మెుదటి భాగంలో విశ్వక్ సేన్ నటించి రెండో పార్ట్‌ను అతడితో తీయాలనుకున్నారు. కానీ, ఓ యూనివర్స్‌ను తీయాలని అడివి శేష్‌ను పెట్టారు.
హిట్ ఫ్రాంచైజీ
పి. వాసు దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. రజినీకాంత్ హీరోగా చేశారు. తర్వాత వెంకటేశ్ హీరోగా నాగవల్లి తెరకెక్కించారు. ఇప్పుడు చంద్రముఖి-3ని లారెన్స్ తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రానికి 9 కథలున్నాయని అప్పట్లోనే దర్శకుడు చెప్పాడు.
చంద్రముఖి
పాన్ ఇండియా దర్శకుడిగా మారిన సుకుమార్ కూడా ఆర్య చిత్రానికి సీక్వేల్ కథలున్నాయని ఎప్పుడో చెప్పాడు. ఇది కూడా తెరకెక్కిస్తే సూపర్ సినిమాటిక్ యూనివర్స్ అవుద్ది.
ఆర్య
సినిమాల్లో హీరోయిజంను చూపించే దర్శకుడు పూరి జగన్నాథ్ పోకిరి, బిజినెస్ మ్యాన్ తీశాడు. ఇందులో ఉండే ఓ పోలీస్, రౌడీలు ఎదురుపడితే ఎలా ఉంటుందనే ఆలోచన ఉందని చెప్పాడు. మరి పూరి అనుకుంటే ఇంకా చాలానే తెరకెక్కించవచ్చు.
పోకిరి-బిజినెస్ మ్యాన్
మూసధోరణి సినిమాలకు ఇప్పుడు జనాలు జై కొట్టడం లేదు. ట్రెండ్ మారింది. సినీ ప్రేమికులతో పాటు చాలామంది కొత్తదనాన్ని ఇష్టపడుతున్నారు. ఈ కారణంగా దర్శకుల సినిమాటిక్ యూనివర్స్‌కు మంచి క్రేజ్ ఉంటుందని చెప్పవచ్చు.