కైకాల సత్యనారాయణకు సినీలోకం నివాళి

YouSay Short News App

నవరస నటనా సార్వభౌముడి అస్తమయంతో సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరైన కైకాల మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటని ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.

చలనచిత్ర రంగంలో విభిన్న పాత్రలు పోషించారు. తన వైవిధ్యమైన నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్నిచూరగొన్నారు. కైకాల మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు

తెలంగాణ సీఎం కేసీఆర్

సత్యనారాయణ గొప్ప వ్యక్తిత్వం కలవారు. నటుడిగా తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఎంపీగా సేవలు అందించి ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.

ఏపీ సీఎం వైఎస్ జగన్

టీడీపీ మాజీ ఎంపీ కైకాల విభిన్న పాత్రల్లో నటించి నవరస నటనా సార్వభౌమ అనిపించుకున్న మేటి నటుడు. ఆయన మరణం విచారకరం. ఆయన మరణం సినీ రంగానికి తీరని లోటు.

నారా చంద్రబాబు, టీడీపీ అధినేత

కైకాల మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. నా చిత్రాల్లో ఆయన మంచి పాత్రలు పోషించారు. నాన్నగారితో కలసి ఎన్నో సినిమాల్లో నటించారు. తన వైవిధ్యమైన నటనతో ప్రజలను అలరించారు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి

నందమూరి బాలకృష్ణ

నటన అన్నా, రుచికరమైన భోజనం అన్నా ఆయనకు ఇష్టం. నా భార్య సురేఖ చేతి వంట అంటే కైకాలకు మహాఇష్టం. కైకాల మృతి నన్ను కలచివేస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి

కైకాల అకాల మరణం నన్ను కలచివేసింది.  ఆయన సేవలు సినీ పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన మన మధ్య లేకపోవడం విచారకరం.

రామ్‌చరణ్

కైకాల మృతి వార్త నన్ను ఎంతగానో బాధించింది. ఘటోత్కచుడులో ఆయనను చూసి ఆయనతో ప్రేమలో పడిపోయా. ఆయన సేవలను తెలుగు సినీ పరిశ్రమ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఓంశాంతి.

యాంకర్ అనసూయ

వీరితో పాటు హీరో కళ్యాణ్ రామ్, నిర్మాత బండ్ల గణేష్, దర్శకుడు బాబీ, నటుడు గిరిబాబు తదితరులు కైకాల మృతి పట్ల సంతాపం తెలిపారు.

బ్రహ్మానందం, చిరంజీవి సహా అనేక మంది ప్రముఖులు కైకాల పార్థీవదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు.