2022లో టాలీవుడ్‌లో  రచ్చలేపిన వివాదాలు

YouSay Short News App

2022లో టాలీవుడ్‌ను కొన్ని వివాదాలు ఊపేశాయి. హీరోయిన్ నయనతార పెళ్లితో ఎంతగా వార్తల్లో నిలిచిందో అంతకన్నా ఎక్కువ కాంట్రవర్సీలు మూటగట్టుకుంది.

అర్జున్-విశ్వక్ సేన్, పవిత్ర లోకేశ్- నరేశ్, నిర్మాతల మధ్య విబేధాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే న్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

సంక్రాంతికి ఈ ఏడాది చిరు, బాలయ్య సహా పెద్ద సినిమాలు లైన్‌లో ఉన్నాయి. తమిళ్ హీరో విజయ్ చిత్రం కూడా వస్తుండటంతో పాటు దిల్ రాజు నిర్మాత కావటంతో డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఇవ్వకూడదనే వివాదం మెుదలయ్యింది.

డబ్బింగ్‌ చిత్రాల చిచ్చు

వారిసు సినిమాకు థియేటర్లు ఇవ్వొద్దని కొందరు నిర్మాతలు పట్టుబట్టగా..అందరికన్నా ముందే ప్రకటించామని దిల్ రాజు అన్నారు. కొంతమంది నిర్మాతలతో కలిసి వేరు కుంపటి పెట్టారు. సి కల్యాణ్ లాంటి వాళ్లు విమర్శలు గుప్పించగా..బడా నిర్మాతలు చూసి చూడనట్లు వదిలేశారు.

చిలికి చిలికి గాలివాన

విశ్వక్‌ సేన్‌ హీరోగా అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించారు. ఇందులో అర్జున్ కుమార్తె హీరోయిన్‌గా చేస్తున్నారు. కానీ, విశ్వక్‌ తనను ముప్పు తిప్పలు పెడుతున్నాడంటూ అర్జున్‌ మీడియా ముందుకు వచ్చారు. కనీస విలువలు లేవంటూ విశ్వక్‌పై విమర్శలు చేశారు.

అర్జున్ - విశ్వక్‌ సేన్

సినిమా కథలో సందేహాలు ఉన్నాయని ఎన్నిసార్లు చెప్పినా నన్ను నమ్ము అంటూ అర్జున్ చెప్పేవారని విశ్వక్ వెల్లడించారు. కళ్లు మూసుకొని కాపురం చేయలేను కనుకే తప్పుకున్నానని స్పష్టం చేశారు.

కళ్లు మూసుకొని కాపురం చేయను

నయనతార కాంట్రవర్సీలతోనే ఈ ఏడాది వార్తల్లో ఎక్కువగా నిలిచింది. విజ్ఞేశ్‌తో పెళ్లికి ముందు తిరుమల స్వామివారిని దర్శించుకున్న ఆమె గుడి పరిసరాల్లో చెప్పులు వేసుకొని తిరగటం వివాదాస్పదమయ్యింది. తీవ్ర విమర్శలు రావటంతో తర్వాత క్షమాపణ చెప్పారు.

నయనతార తిరుమల

నయన్ పెళ్లైన 4 నెలలకే కవలలు జన్మించారని ప్రకటించింది. సరోగసి ద్వారా పిల్లల్ని కన్నామని చెప్పింది. భారత్‌లో సరోగసిపై నిషేధం ఉండటంతో వివాదం చెలరేగింది. కానీ, వారు నిబంధనల ప్రకారమే నడుచుకున్నట్లు అఫిడవిట్ దాఖలు చేయటంతో సద్దుమణిగింది.

నయనతార సరోగసి

హీరోయిన్ సమంత, నాగచైతన్య విడిపోయిన తర్వాత సామ్ గురించి చైతూ ఎక్కడా నెగటివ్‌గా మాట్లడలేదు. కానీ, కరణ్ జోహార్‌ షోలో మీ హస్బెండ్‌ అని వ్యాఖ్యానించగా, సామ్ ఎక్స్‌ హస్బెండ్‌ అంటూ  బదులిచ్చింది. దీంతో సామ్ విమర్శలు ఎదుర్కొంది.

సమంత ఎక్స్‌ హస్బెండ్

రష్మిక మందన్నాను పరిచయం చేసిన దర్శకుడు రిషబ్ షెట్టి నటించిన కాంతారా గురించి ఆమెను అడిగితే చూడలేదనడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అవకాశాలు ఎక్కువై ఛాన్స్ ఇచ్చిన వారిని మర్చిపోతున్నారంటూ కామెంట్స్ రావటంపై రష్మిక ఓ పేజీన్నర మెసెజ్ పెట్టాల్సి వచ్చింది.

రష్మిక ఆవేదన

లైగర్ ప్రచారంలో భాగంగా విజయ్ దేవరకొండ వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. మా తాత తెల్వదు, నాన్న తెల్వదు అయినా మీరు నాకు సపోర్ట్ ఇచ్చారని పేర్కొన్నాడు. పెద్ద హీరోలనుద్దేశించి మాట్లాడినట్లు ప్రచారం జరిగి దుమారమయ్యింది.

రౌడీ బాయ్‌ రచ్చ

ఆకాశ్ పూరీ నటించిన చోర్‌ బజార్ సినిమా ప్రమోషన్‌కు వచ్చిన బండ్ల గణేశ్.. పూరీ జగన్నాథ్ రాకపోవటంపై కామెంట్స్ చేశాడు. కుమారుడిని వదిలేసి ఎవరితోనో వెళ్తున్నావంటూ మాట్లాడాడు. దీంతో చార్మీని ఉద్దేశించి కౌంటర్ ఇచ్చాడని పెద్ద చర్చ జరిగింది.

బండ్ల గణేశ్ - పూరీ

బండ్ల మాటలకు నేరుగా కాకపోయినా తన మ్యూజింగ్‌లో కౌంటర్ వేశాడు. అందులో  ఎక్కువగా అనవసరంగా మాట్లాడకూడదంటూ వ్యాఖ్యానించాడు.

బీమ్లా నాయక్‌ ఫంక్షన్‌కు బండ్ల గణేశ్ రాకపోవటంపై ఫ్యాన్స్ తెగ పోస్టులు పెట్టారు. ఇందుకు త్రివిక్రమే కారణమంటూ బండ్ల వాయిస్‌ ఉన్న ఆడియో లీక్‌ కలకలం రేపింది.

బండ్ల - త్రివిక్రమ్

దర్శకుడు, కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ ఓ సినిమాను రూపొందించారు. ఆ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు నితిన్‌ అతిథిగా వస్తానని చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చాడంటూ రాజశేఖర్ విమర్శలు చేశాడు. నితిన్‌కు డాన్స్‌ నేర్పిన తనకు కనీసం ఓ బైట్‌ ఇవ్వలేదని…తనకు కృతజ్ఞత లేదన్నాడు. దీనిపై నితిన్‌ స్పదించలేదు.

అమ్మ రాజశేఖర్ - నితిన్

నటుడు నరేశ్ తన భార్యని వదిలేసి పవిత్ర లోకేశ్‌తో ఉంటున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. వాటిని నిజం చేస్తూ వారిద్దరూ ఓ హాటల్‌ గదిలో ఉండగా నరేశ్ భార్య అతడి దగ్గరకు వెళ్లి గొడవ చేసింది.  ఈ వివాదం కొద్దిరోజుల పాటు దుమారం రేపింది.

పవిత్ర లోకేశ్, నరేశ్‌

సిద్దూ జొన్నల గడ్డ నటిస్తున్న డీజే టిల్లు సీక్వెల్‌లో నటించేందుకు ముగ్గురు హీరోయిన్లు మారారు. చిత్ర యూనిట్‌తో పడకనే బయటకు వచ్చినట్లు టాక్.

డీజే టిల్లు 2 హీరోయిన్స్

మెుదట అనుపమ పరమేశ్వరన్ పేరు వినిపించగా ఆమె తప్పుకోవటంతో శ్రీలల వచ్చిందన్నారు. తను కూడా చేయట్లేదని..మడోనా సెబాస్టియన్ ఫిక్స్‌ అని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఐశ్వర్య లక్ష్మి పేరు వినిపిస్తోంది.

యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్‌ తనను ఆంటీ అని పిలుస్తున్నారంటూ పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టారు. దీంతో నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్స్ చేశారు. ఆమె కూడా అంతే ఘాటుగా స్పందించటంతో వివాదం చెలరేగింది.

అనసూయ ఆంటీ వివాదం !

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.