Cyber Delusions:  డిజిటల్ యూజర్లలో కొత్త రుగ్మత.. వింత ప్రవర్తనతో సతమతం

YouSay Short News App

ఫోన్‌ను ఎవరో ట్యాప్‌ చేస్తున్నారని..ల్యాప్‌టాప్‌ను ఎవరో హ్యాక్ చేసినట్లుగా, డివైజ్‌లను ఇంకెవరో కంట్రోల్ చేస్తున్నారని ఈ మధ్య కేసులు పెరుగుతున్నాయి. కానీ, వాస్తవంలో అది జరగడం లేదు. ఈ మానసిక పరిస్థితినే ‘సైబర్ డెల్యూషన్’ అంటాం.

సాధారణంగా కొన్ని సమయాల్లో భ్రమ చెందడం మామూలే. లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటాం. దీనినే హెల్యూజినేషన్ అంటుంటాం. వాస్తవ పరిస్థితుల్లో నిజం కాని దానిని సత్యమని నమ్మటమే డెల్యూజన్.

డిజిటల్ హెల్యూజినేషన్..

టెక్నాలజీ వాడకం మితిమీరడంతో రోజులో అధిక సమయం వీటితోనే గడిపేస్తున్నాం. చాలామంది డిజిటల్ తెరలకు అతుక్కుపోతుంటారు. అలాంటి వారిలో ఈ ‘సైబర్ డెల్యూషన్’ ఏర్పడే ప్రమాదం ఉంది.

వీరికి ముప్పు..

సైబర్ డెల్యూషన్స్‌తో బాధపడే వారు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ల్యాప్‌టాప్ హ్యాక్ అయిందని, ఫోన్‌ని ఎవరో ట్యాప్ చేస్తున్నారని, ఇంట్లోని సీసీ కెమెరాలను కంట్రోల్ చేస్తున్నారని భ్రమపడుతుంటారు.

భిన్న ప్రవర్తన..

మన కంప్యూటర్‌ని ఎవరో వాడుతున్నారనే భావన కలగడం కూడా ఈ కోవలోకే వస్తుంది. దీనినే ‘సైబర్ పరనోయా’ అని కూడా పిలుస్తుంటారు.

సైబర్ పరనోయా..

సైబర్ డెల్యూషన్స్, సైబర్ పరనోయాల బారిన పడటం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.

వీటితో సమస్యే..

లేనిదాన్ని ఉన్నట్లుగా భావించడం వల్ల బాధితులు కుంగుబాటుకి గురయ్యే ప్రమాదం ఉంది. ప్రతికూల ఆలోచనలకు ప్రేరేపితమై విచక్షణా రహితంగా ప్రవర్తించే ముప్పు ఉంది. ఇవి ఆత్మహత్యలు, హత్యలకు కూడా దారితీయొచ్చు.

దేనికైనా దారితీయొచ్చు..

వాస్తవిక దృక్పథంతో ఆలోచించడం, ఇతరులతో చర్చించడం వల్ల భ్రాంతిని దూరం చేసుకోగలమని నిపుణులు సూచిస్తున్నారు.

ఇలా చేస్తే సరి..

మీ డిజిటల్ పరికరాలు హ్యాకింగ్‌కి గురయ్యే సంభావ్యతను నిర్ధారించుకోండి. అసలు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తారు/చేయాలి? అనే ప్రశ్నను మీకు మీరే వేసుకోండి. మీ సమాచారం అవతలి వ్యక్తికి ఎందుకు విలువైందో సమీక్షించుకోండి. అప్పుడు ‘సైబర్ డెల్యూషన్’ భావన కలగక పోవచ్చు.

మీరెవరు?

డిజిటల్ యాక్సెసిరీస్‌ల వినియోగం వీలైనంత మేర తగ్గించుకోవాలని నిపుణులు సూచన. అన్నింటికీ వీటిపై ఆధారపడటం ఆమోదయోగ్యం కాదు.

వాడకం తగ్గించాల్సిందే..

హ్యాకింగ్ ఘటనలు, సైబర్ నేరాలను చాలా చూస్తుంటాం. తరచూ గ్యాడ్జెట్స్, ఇంటర్నెట్, సోషల్ మీడియాను వినియోగించే వారికి కొంత భయం కలుగుతుంది. దీంతో మెదడును వ్యతిరేక ఆలోచనలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది.

హ్యాకింగ్ ఫోబియా

డిజిటల్ యుగంలో గ్యాడ్జెట్స్‌ని వీలైనంత మేరకు భద్రంగా ఉంచుకోవాలి. వీటిల్లోని డేటా లీక్ కాకుండా తగిన రక్షణ చర్యలను తీసుకోవాలి. ముఖ్యంగా సైబర్ దాడికి గురవుతామేమోనన్న అనుమానాన్ని వీడాలి.

డేటా లీక్ చేయొద్దు..

దైనందిన జీవితంలో డిజిటల్ యాక్సెసిరీస్‌లు భాగమైపోయాయి. అయితే, వీటిని మితంగా వాడుతూ.. ఎప్పటికప్పుడు యాక్సెసిరీస్‌ల పాస్‌వర్డ్‌లను మార్చుతుండటం చేయాలని సూచిస్తున్నారు.

పాస్‌వర్డ్ మార్చండి..

ఎవరికి పడితే వారికి గ్యాడ్జెట్లు ఇవ్వడం, ఓటీపీ, పాస్‌వర్డ్‌లను చెప్పడం వంటివి చేయొద్దు. ఫలితంగా భద్రత కొరవడి.. గ్యాడ్జెట్లపై సందేహాలు వ్యక్తమయ్యే ప్రమాదం ఉంది. రిపేర్‌లు వచ్చినా తెలిసిన వారికే చూపించండి.

గ్యాడ్జెట్‌లు ఇవ్వకండి..

అనధికార వెబ్‌సైట్లను బ్రౌజ్ చేయకపోవడమే మంచింది. వీటివల్ల అసహనానికి గురై మానసికంగా అలసిపోయే ప్రమాదం తలెత్తుతుంది. ఫలితంగా దిగ్భ్రాంతిని కలిగే అవకాశం ఉంది.

వీటి జోలికి వెళ్లొద్దు..

రాబోయే రోజుల్లో ‘సైబర్ డెల్యూషన్’ బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. రోజు రోజుకు డిజిటల్ పరికరాల వాడకం పెరిగిపోతుండటమే ఇందుకు కారణమని అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని ఎక్కువ..

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.