RRRకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. తెలుగు చిత్రానికి అరుదైన ఘనత

YouSay Short News App

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పురస్కారంగా ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ను భావిస్తారు. తాజాగా పలు సినిమాలు ఈ అవార్డును గెల్చుకున్నాయి.

13వ ‘దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్- 2023’ అవార్డుల ప్రదానోత్సవం ముంబయిలో అట్టహాసంగా జరిగింది.

ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. తెలుగు సినిమాలకు ఈ అవార్డు రావడం చాలా అరుదు.

ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్

ఉత్తమ చిత్రంగా ‘కశ్మీర్ ఫైల్స్’ ఎంపికైంది. వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.

ఉత్తమ చిత్రం

ఉత్తమ నటుడిగా రణ్‌బీర్ కపూర్ ఎంపికయ్యాడు. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకి గాను రణ్‌బీర్‌ని ఈ అవార్డు వరించింది.

ఉత్తమ నటుడు

బెస్ట్ యాక్టర్ ఇన్ నెగెటివ్ రోల్ అవార్డుకి దుల్కర్ సల్మాన్ ఎంపికయ్యాడు. ‘చుప్- ది రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ సినిమాలో నటనకు ఈ అవార్డు వరించింది.

బెస్ట్ యాక్టర్ ఇన్ నెగెటివ్ రోల్

మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్‌ అవార్డును ‘రిషబ్ శెట్టి’ అందుకున్నాడు. ‘కాంతార’ సినిమాలో నటనకు అవార్డు లభించింది.

మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్

ఉత్తమ నటిగా అలియా భట్ అవార్డు స్వీకరించింది. ‘గంగూభాయ్ కథియావాడి’ సినిమాకు గాను అలియా ఎంపికైంది.

ఉత్తమ నటి

ఉత్తమ డైరెక్టర్‌గా ఆర్ బాల్కి ఎంపికయ్యాడు. ‘చుప్- ది రేవేంజ్ ఆఫ్ ఆర్టిస్ట్’ అనే సైకలాజికల్ త్రిల్లర్‌ని బాల్కి డైరెక్ట్ చేశాడు.

ఉత్తమ దర్శకుడు

భేడియా చిత్రానికి గాను వరుణ్ ధావన్‌కి క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది.

క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్

మోస్ట్ వర్సటైల్ యాక్టర్‌గా ‘అనుపమ్ ఖేర్’ ఎంపికయ్యాడు. కశ్మీర్ ఫైల్స్ చిత్రంలోని నటనకు ఈ అవార్డు వచ్చింది.

మోస్ట్ వర్సటైల్ యాక్టర్

క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా విద్యాబాలన్ ఎంపికైంది. ‘జల్సా’ సినిమాకి గాను ఈ అవార్డు వరించింది.

క్రిటిక్స్ ఉత్తమ నటి

‘జగ్ జగ్ జీయో’ సినిమాకి గాను ‘మనీష్ పాల్’ ఉత్తమ సహాయ నటుడు అవార్డుకి ఎంపికయ్యాడు.

ఉత్తమ సహాయ నటుడు

టెలివిజన్ విభాగంలో, వెబ్‌సిరీస్ విభాగంలోనూ పలువురికి ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ని పలువురు గెల్చుకున్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.