YouSay Short News App

Dasara Movie Story:  నాని మాస్ ‌అవతారం… దసరా అసలు కథ ఇదేనా..!

పాన్ ఇండియా మూవీగా వస్తున్న దసరా చిత్రంలో నాని తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఊరమాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు

ఇప్పటివరకు లవర్ బాయ్, రోమాన్స్, పక్కింటి అబ్బాయి రోల్స్‌లో కనిపించి నాని మెప్పించాడు.

నాని కేరిర్‌లో అడపాదడపా మాస్ చిత్రాలు చేసినా మాస్ ఇమేజ్‌ను మాత్రం సాధించలేకపోయాడు

దక్కని మాస్ ఇమేజ్

తొలి మాస్‌ చిత్రం కృష్ణార్జునయుద్ధం సక్సెస్‌ కాకున్నా.. శ్యామ్‌సింగరాయ్ విజయంతో మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు

నాని, నజ్రియా జంటగా నటించిన ‘అంటే సుందరానికీ చిత్రాన్ని’ మూడు భాషల్లో విడుదల చేశారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు

పాన్ ఇండియా రేంజ్

'దసరా' చిత్రం మాత్రం ఐదు(హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం, తెలుగు) బాషల్లో దేశవ్యాప్తంగా మార్చి 30న విడుదల కానుంది.

తెలంగాణలోని గోదావరిఖని సింగరేణి కాలరీస్ నేపథ్యంగా కథ సాగనుందని సమాచారం. సింగరేణి ఓపెన్ కాస్ట్  వల్ల  బొగ్గుగనులకు చుట్టు పక్కల ఉన్న  గ్రామాల ప్రజలు తమ భూములు కోల్పోతారు.

దసరా స్టోరీ ఇదేనా?

తాము పోగొట్టుకున్న భూమికి నష్టపరిహారం చెల్లించాలంటూ  ఆయా గ్రామాల ప్రజలు పోరాటం చేస్తారు. ఇదే థీమ్‌తో కథ సాగుతుందని ఇండస్ట్రీలో టాక్.

ఓపెన్ కాస్ట్ వల్ల  భూములు పొగొట్టుకుని రోడ్డున పడ్డ ప్రజల కోసం పోరాడే ‘ధరణి’ అనే యువకుడి పాత్రలో నాని కనిపించనున్నాడు.

చిత్ర బృందం విడుదల చేసిన'స్పార్క్ ఆఫ్ దసరా' స్పెషల్ వీడియో, టీజర్‌లోనూ నాని కొంతమంది తరఫున పొరాడుతున్న విషయం స్పష్టమైంది.

ఈర్లపల్లి చుట్టూర బొగ్గు కుప్పలు.. మందంటే.. మాకు వ్యసనం కాదు.. అలవాటు పడిన సంప్రదాయం అంటూ టీజర్‌లో నాని చెప్పిన డైలాగ్స్ ఊరమాస్ పల్లేటూరు కథను తలపించింది.

తాజాగా నాని బర్త్‌డే పోస్టర్‌లోనూ స్టోరీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కనిపించాయి. సిల్క్‌బార్ పేరుతో వైన్‌ షాపు, సింగరేణి గనులు ప్రత్యేకంగా కనిపించాయి.

SLV సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ దసరా సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రం  కోసం రూ.70కోట్లు మేర ఖర్చు చేసినట్లు సమాచారం.

భారీ బడ్జెట్

ఇప్పటికే థియేట్రికల్ రైట్స్, డిజిటల్ రైట్స్‌ అమ్మడం ద్వారా దసరా చిత్రం రూ.77కోట్లు రాబట్టింది.

ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం కానున్నాడు. కీర్తి సురేష్ నాని సరసన నటిస్తోంది.

విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న దసరా చిత్రంపై నాని చాలా ఆశలు పెట్టుకున్నాడు. నాని కెరీర్ గ్రాఫ్‌తో పాటు కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కేరీర్‌ను కూడా ఈ చిత్రం ఫలితం శాసించనుంది.