టాలీవుడ్‌ తారల్లా తళుక్కున  మెరవండి

దీపావళికి

ఈ 

Floral Separator

డిజైనర్‌ బ్లౌజ్‌తో కృతి శెట్టి ధరించింన ఈ హాఫ్‌ శారీ ఈ దీపావళిలో యువతులను మెరిసేలా చేయగలదు

కృతి శెట్టి

అదితిలా మీరూ ఆకర్షణీయ ఆభరణాలు, జుమ్కాలతో మీ లెహంగా సొగసులను మరింత పెంచుకోండి

అదితి రావు హైదరీ

సింప్లిసిటీకి మించిన సొగసేముంది! చక్కటి చుడిదార్‌ చందమామలా మెరిసిన సంయుక్త మీనన్‌లా మీరూ ట్రై చేయొచ్చు

సంయుక్త మీనన్‌

ధగధమనే బంగారు వర్ణపు రవికకు, పారదర్శకంగా నడుము సొగసులను చూపించే చీర, దానికి నగలు తోడైతే ఇంకేముంది! మీరూ సమంతలా మెరిసిపోవచ్చు

సమంత

మెడలో నెక్లేస్‌తో పాలబుగ్గల సుందరి తమన్నా ధరించిన ఈ శ్వేత వర్ణ చుడిదార్‌..టీనేజ్‌ అమ్మాయిలకు చూడముచ్చటగా ఉంటుంది.

తమన్నా

పట్టుచీరను మెచ్చని మగువ ఉండునా!! మీరూ ఆ కోవకే చెందినవారైతే ప్రగ్యా ఎంచుకున్న ఈ చీరను ట్రై చేయండి.

ప్రగ్యా జైస్వాల్‌

అటు సంప్రదాయంగా, ఇటు పార్టీ వేర్‌లా పనికొచ్చే సహారా స్టైల్‌ డ్రెస్‌లో పూజా హెగ్డేలా మీరు ఈ దీపావళి పూజల్లో మెరవొచ్చు

పూజా హెగ్డే

ప్రకృతికి పచ్చని చీర చుట్టినట్టు హరితవర్ణపు చీరలో రీతూ వర్మ తన అందాన్ని అందలమెక్కించింది. మీరెందుకు ఇలా తళుక్కుమనకూడదు!

రీతూ వర్మ

పట్టు చీరలు, పట్టనన్ని ఆభరణాలు!! ఇదే కదా అసలైన దక్షిణ భారత సొగసుల ట్రేడ్‌మార్క్‌. అందులోని అందాన్ని తనలో ఆవిష్కరించింది మన రకుల్‌

రకుల్‌ ప్రీత్‌ సింగ్

చేతికి రెండు గాజులు, జుమ్కాలు, లెహంగా వినడానికి సింపుల్‌ వస్త్రధారణలా అనిపించినా..ధరిస్తే మీరూ మాళవిక మోహనన్‌లా సమ్మోహనపరచొచ్చు.

మాళవిక మోహనన్‌

పూజలో పాల్గొనేందుకు పక్కా అలంకరణ అంటే ఇదేనేమో అనేలా ఆకర్షించింది శ్రీ లీల. అమ్మవారిని కొలిచేందుకు పద్ధతైన వస్త్రాలంకరణ.

శ్రీ లీల

అమ్మ కాబోతున్న వారికి ఆ గర్భమే అసలైన అలంకరణ. అయినా మహిళలు అలంకార ప్రియులు కదా..గర్భవతులు ఇలా కాజల్‌లా సింపుల్‌గా చీర ట్రై చేయండి.

కాజల్‌ అగర్వాల్‌

ఈ దీపావళికి కొంచెం కొత్తగా కనిపించాలనుకునేవారు, కర్ణాటక తులు సంప్రదాయ వస్త్రాలంకరణలో మెరిసిన రష్మికను స్ఫూర్తిగా తీసుకోవచ్చు

రష్మిక మంధాన

కాస్త పొడవైన యువతులు శ్రుతి హాసన్ ధరించిన ఈ డ్రెస్‌తో మతి పోగొట్టగలరనడం అతిశయోక్తి కాదేమో!

శ్రుతి హాసన్‌

పూదోటలో బంతిపూవులా మెరిసేందుకు ఇలా ఓ చక్కటి పసువు వర్ణపు చీర చాలు కదా!

అనుపమ పరమేశ్వరన్‌

నీలాకాశంలో రంగు రంగుల ఇంద్రధనుస్సులా కనిపించేందుకు ఈ ప్రింటెడ్ డ్రెస్ పక్కాగా ఉపయోగపడుతుంది.

వర్ష బొల్లమ్మ

చిరకాల సుందరి ఐశ్వర్య రాయ్‌ తెల్లటి చుడిదార్‌కు బంగారు తళుకులు అద్ది అందంగా మెరిసింది.

ఐశ్వర్య రాయ్‌

“అచ్చం తెలుగందం కనులకు దొరికెను ఈ వేళ” అని మిమ్మల్ని చూసి ఎవరైనా మైమరచిపోవాలంటే సాయి పల్లవిలా ట్రై చేయండి.

సాయి పల్లవి

నలుపు చీరను బంగారు వర్ణంతో కమ్మేస్తూ దీపావళికి అసలైన నిర్వచనాన్నిచ్చే చీరలో మెరిసింది మన ఈషా రెబ్బా.

ఈషా రెబ్బా