డిసెంబర్‌ 22,23 థియేటర్లు, ఓటీటీలో వచ్చే తెలుగు సినిమాలు

YouSay Short News App

టాలీవుడ్‌లో ఈ ఏడాది రెండో భాగం భారీ హిట్లు వరించాయి. ఇక ముగింపులోనూ మంచి హిట్లు అందుకోవాలని చిత్రపరిశ్రమ ఎదురుచూస్తోంది.

ఈ క్రమంలో మాస్ మహారాజా రవితేజ, నిఖిల్ సిద్ధార్థ్ ప్రేక్షకులను పలకరిస్తున్నారు. మరికొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అవెంటో ఓ సారి చూద్దాం.

నయనతార లీడ్ రోల్‌లో వస్తున్న ”కనెక్ట్‌” చిత్రం ఈ గురువారం విడుదలవుతుంది. హర్రర్‌ నేపథ్యంలో అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన సినిమాను నయన్ భర్త విజ్ఞేశ్ శివన్ నిర్మించారు.

కనెక్ట్- డిసెంబర్ 22

తెలుగులో అదే టైటిల్‌తో సినిమాను యూవీ క్రియేషన్స్‌ రిలీజ్ చేస్తుంది.

విశాల్ పోలీస్ పాత్రలో నటిస్తున్న మరో చిత్రం లాఠీ. ఈ వారం విడుదలకు సిద్ధమైన చిత్రాల్లో లాఠీపై భారీ అంచనాలు ఉన్నాయి. విశాల్ సరసన సునైనా అలరించనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

లాఠీ- డిసెంబర్ 22

ఈ ఏడాది కార్తీకేయ 2 సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్, అనుపమ మరోసారి అలరిస్తామంటున్నారు. వీరిద్దరూ జంటగా నటించిన “18 పేజేస్” సినిమా డిసెంబర్ 23న రిలీజ్ అవుతుంది.

18 పేజేస్- డిసెంబర్ 23

చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ తెరకెక్కించాడు. దిల్ రాజు నిర్మాత. సినిమా కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.

ధమాకా- డిసెంబర్ 23

తెలుగు చిత్ర పరిశ్రమలో చివర్లో విడుదలవుతున్న భారీ బడ్జెట్ సినిమా ధమాకా. మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల నటించారు.

త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన పాటలు మార్మోగుతుండగా ట్రైలర్ ఆకట్టుకుంటుంది.

సర్కస్ - డిసెంబర్ 23

రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రన్‌వీర్‌ సింగ్ నటించిన సర్కస్‌ ఈ ఏడాది ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి.

సామాజిక మాధ్యమాల్లో ట్రైలర్, పాటలకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, పూజ హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మసూద  - తెలుగు - డిసెంబర్ 21 కదైపోమా - తమిళ్ - డిసెంబర్ 23

ఆహా

OTT

నెట్‌ఫ్లిక్స్

ఎలైస్‌ ఇన్ బోర్డర్ ల్యాండ్  - ఇంగ్లీష్  - డిసెంబర్ 22 గ్లాస్ ఆనియన్ - ఇంగ్లీష్ - డిసెంబర్ 23 ది ఫ్యాబులస్ - ఇంగ్లీష్ - డిసెంబర్ 23 తారా VS బిలాల్  - హిందీ - డిసెంబర్ 23 ది టీచర్ - మళయాలం - డిసెంబర్ 23 ది విట్చర్: బ్లడ్ ఆరిజిన్ - ఇంగ్లీష్ - డిసెంబర్ 23

హాట్‌ స్టార్‌

బిగ్ బెట్  - ఇంగ్లీష్ - డిసెంబర్ 21 జయ జయ జయ జయ జయహే - మళయాలం - డిసెంబర్ 22 స్ట్రేంజ్ వరల్డ్ - ఇంగ్లీష్ - డిసెంబర్ 23

జీ 5

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం - తెలుగు - డిసెంబర్ 23 కారీ - తెలుగు - డిసెంబర్ 23 పిట్చర్ S2 - హిందీ - డిసెంబర్ 23

ప్రైమ్ వీడియో

టాప్ గన్: మావెరిక్ - ఇంగ్లీష్ - డిసెంబర్ 26

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.