Deepika at 95th Oscars: భారతీయ సినిమాకు ఈ వేడుక ఎంతో ప్రత్యేకం
బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఆస్కార్ అవార్డులకు ప్రజెంటర్‌గా ఎంపికైంది. గతేడాది ఫుట్‌బాల్ ప్రపంచకప్ ట్రోఫీని దీపిక ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
మార్చి 12న(భారత కాలమానంలో 13న) ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ క్రమంలో ప్రజెంటర్ల జాబితాలో ఇండియా నుంచి దీపిక పదుకొణెకు చోటు దక్కడం దేశానికే గర్వకారణం.
ఈ ఏడాది లాస్ ఏంజెలెస్‌లో జరిగే ఆస్కార్ వేడుక భారతీయ సినిమాకు ఎంతో ప్రత్యేకం. మునపటితో పోలిస్తే ఈ అవార్డు ప్రక్రియలో భారతీయ సినిమా ప్రాతినిథ్యం పెరిగింది.
నాటు.. నాటు
ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డుకు పోటీ పడుతోంది.
పోటీలో డాక్యుమెంటరీలు..
భారతీయ డాక్యుమెంటరీలు ఆస్కార్ బరిలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. హిందీ భాషలో తెరకెక్కిన ‘ఆల్ దట్ బ్రీత్స్’(All That Breathes) ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ అవార్డుకు పోటీ పడుతోంది.
షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో..
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అవార్డుల నామినేషన్ల జాబితాలో తమిళంలో రూపొందిన ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’(The Elephant Whisperers) చోటు దక్కించుకుంది.
లైవ్ పర్ఫార్మెన్స్..
ఆస్కార్ వేడుకలో ‘నాటు నాటు’ సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్‌ని ఇవ్వాలని సింగర్స్‌కి ఆస్కార్ నిర్వహకులు ఆహ్వానం పంపించారు. ఈ మేరకు రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ అమెరికాకు పయనం కానున్నారు.
ప్రజెంటర్‌గా దీపిక పదుకుణె
ఆస్కార్ అవార్డ్ ప్రజెంటర్‌గా దీపిక పదుకొణెను ఎంపిక చేయడంతో భారతీయ సినిమా భాగస్వామ్యం మరింత పెరిగింది. అయితే, దీపిక ఏ అవార్డు ప్రదానం చేయనుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
‘నాటు నాటు’కే ఆస్కార్?
ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ సాంగ్ పాడేందుకు సింగర్స్‌ని ఆహ్వానించడం, అందులోనూ అవార్డుకు పోటీ పడుతున్న పాట కావడంతో అంచనాలు పెరిగిపోయాయి.
గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో..
ఆస్కార్ అంతటి గోల్డెన్ గ్లోబ్ అవార్డును ‘నాటు నాటు’ దక్కించుకుంది. ఇలా గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న విభాగంలోనే ఆస్కార్ అవార్డును పొందిన సందర్భాలు బోలెడున్నాయి. దీంతో ‘నాటు నాటు’కు ఆస్కార్ అవార్డ్ పక్కా అంటూ చర్చ జరుగుతోంది.
అందుకే పిలిచారా?
‘నాటు నాటు’కే ఆస్కార్ అవార్డు దక్కుతుందని చెప్పడానికి ఆస్కార్ ఆహ్వానం మరింత బలపరిచింది. సింగర్స్‌ని వేదికపై లైవ్‌గా పాడించి తమ నిర్ణయం సరైందేనని చెప్పకనే చెప్పాలని ఆస్కార్ నిర్వహకులు భావిస్తున్నట్లు టాక్.
దీపిక పదుకొణె చేతుల మీదుగా?
ఆస్కార్‌కు దీపిక ప్రజెంటర్‌గా వెళ్తుంది. ఒకవేళ ఆమె చేతుల మీదుగా ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డును అందింపజేస్తే ఆ మజానే వేరు. అందులోనూ ఈ అవార్డును ‘నాటు నాటు’ గెలుచుకుంటే అంతకన్నా గర్వకారణం ఏముంటుంది.
ఊహకే అందదు..
దీపిక పదుకొణె చేతుల మీదుగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును ఆర్ఆర్ఆర్ బృందం స్వీకరించడమనే దృశ్యాన్ని మాటల్లో వివరించలేం. భారతీయ సినిమాకు ఇంతకన్నా గొప్ప గౌరవం ఇంకేమీ ఉండదు. ఆ అపురూప క్షణాల్ని అస్సలు ఊహించలేం.
వీటికి కూడా ఛాన్స్..
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్ విభాగాల్లోనూ భారతీయ సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ విభాగాలకు దీపిక పదుకొణె ప్రజెంటర్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.
గొప్ప జ్ఞాపకంగా..
ఏదేమైనా, 95వ ఆస్కార్ అవార్డుల వేడుక భారతీయులకు మధురమైన అనుభూతిని అందించబోతోంది. అలాగే, భారతీయ సినిమాకు మరుపురాని జ్ఞాపకంగా నిలిచిపోగలదని ఘంటాపథంగా చెప్పగలం.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వెబ్‌స్టోరీల కోసం లింక్‌ని క్లిక్ చేయండి.