డిప్రెషన్ నుంచి ప్రపంచ వేదికకు దీపిక పదుకొణె ప్రయాణం
దీపికా పదుకొణె బాలీవుడ్లో ఓ సెన్సేషన్. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొద్దిరోజుల్లోనే ఎనలేని గుర్తింపు తెచ్చుకుంది. హాలీవుడ్‌లోనూ సినిమాలు చేసే స్థాయికి ఎదిగింది.
వివాహమైనప్పటికీ వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తోంది ఈ పొడుగుకాళ్ల సుందరి. తెలుగులోనూ నటించాలనే ఆసక్తి ఉంది. దీపిక పుట్టినరోజు వేళ ఆమె గురించి కొన్ని విషయాలు.
సినిమాల్లోకి రాకముందు దీపికా బ్యాడ్మింటన్ ఆడేది. నేషనల్ ఛాంపియన్ షిప్‌లోనూ పోటీ చేసింది. తర్వాత ఆసక్తి లేక ఫ్యాషన్ రంగంవైపు మళ్లిందట.
స్పోర్ట్స్ టూ ఫ్యాషన్
మోడల్‌గా రాణిస్తున్నప్పుడే మెుదట్లోనే క్రేజీ ఆఫర్ కొట్టేసింది ముద్దుగుమ్మ. షారుఖ్ సరసన ఓం శాంతి ఓంలో ఆఫర్ కొట్టేసి ప్రేక్షకులను మెప్పించింది.
ఓం శాంతి ఓం
ఓం శాంతి ఓం చిత్రంలో దీపకా నటనకు మంచి ప్రశంసలే దక్కాయి. తొలి సినిమాకే ఫిలిం ఫేర్ అవార్డు గెలుచుకుంది. ఆమె కెరీర్లో మెుత్తం మూడు ఫిలిం ఫేర్ అవార్డులున్నాయి.
ఫిలిం ఫేర్
‘బచ్నా హై హసీనో’ సినిమా ద్వారా రణ్‌బీర్, దీపికా ప్రేమలో పడ్డారు. ఈ విషయంపై ఆమె బాహాటంగానే చెప్పారు. కానీ, సంవత్సరంలోపే వీరి ప్రేమ అటకెక్కింది.
రణ్‌బీర్‌తో ప్రేమాయణం
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీతో దీపిక పదుకొణె అప్పట్లో డేటింగ్ చేసిందని టాక్.యువరాజ్ సింగ్‌తోనూ చెట్టపట్టాలేసుకొని తిరిగిందని రూమర్స్ ఉండేవి. వాళ్లిద్దరి మధ్య విబేధాలకు దీపిక కారణమనే చర్చ జరిగింది.
క్రికెటర్లతోనా రొమాన్స్
కెరీర్ పరంగా ఇబ్బందులు లేకపోయినా వ్యక్తిగతంగా దీపికా పదుకొణె ఇబ్బందులు ఎదుర్కొందంట. ఒకానొక దశలో డిప్రెషన్‌కు వెళ్లి మానిసక వైద్యుల సలహా తీసుకుందని సమాచారం.
డిప్రెషన్
హీరో రణ్వీర్ సింగ్‌తో ఆమె కొన్నేళ్లపాటు డేటింగ్ చేసింది. రామ్ లీలా చిత్రం ద్వారా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తర్వాత వీరిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టారు.
డేటింగ్, పెళ్లి
వరుస విజయాలతో దూసుకుపోతున్న చిన్నది ఫిఫా ప్రపంచకప్ సమయంలో అరుదైన గౌరవం దక్కించుకుంది. ఫిఫా ట్రోఫీ ఆవిష్కరణలో పాల్గొన్న మెుదటి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది దీపికా.
అరుదైన గౌరవం
షారుఖ్ సరసన నటించిన పఠాన్ సినిమాలో గ్లామర్ డోస్ బాగానే పెంచింది. బేషరమ్ రంగ్ పాటలో ఎక్సపోజింగ్తో పాటు బికినీ కలర్పైనా వివాదం నడుస్తోంది.
బికినీ వివాదం
తెలుగులోనూ ఆరంగేట్రం చేస్తోంది బీ టౌన్ బ్యూటీ. ప్రభాస్ సరసన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్‌లో Kలో నటిస్తుంది.
ప్రాజెక్ట్ Kలో
తెలుగులో మరికొందరి పక్కన నటించాలని ఉందంటూ మనసులో మాట చెప్పింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో అవకాశం వస్తే వదులుకోనంటుంది.