బ్రో..! డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారా!పోలీసులు మీ బైక్ తీసుకెళ్లారా!!
YouSay Short News App
మీరెప్పుడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారా? పోలీసులకు దొరికిపోయారా? మొదటి ప్రశ్నకు మీ సమాధానం నో అయితే చాలా మంచిది. కానీ యెస్ అయితే మాత్రం జాగ్రత్త బ్రో!
శని, ఆది వారాలు వచ్చాయంటే చాలు హైదరాబాద్‌లో మందుబాబులను కట్టడి చేయడం పోలీసులకు కోతితో సయ్యాటలా ఉంటుంది. ప్రత్యేక డ్రైవ్‌లలో దొరికే తాగుబోతులతో తంటాలు అంతా ఇంతా కాదు
తాగినపుడు మెదడు పనితీరు సరిగా ఉండదు. గాల్లో తేలినట్టుందే అన్నట్టుంటారు.. దీని వల్ల నియంత్రణ కోల్పోయి అనేక ప్రమాదాలకు కారణమవుతుంటారు
మోటారు వాహన చట్టం ప్రకారం తాగి వాహనం నడిపితో తొలిసారి దొరికిన వారికి 6 నెలల జైలు శిక్ష లేదా రూ. 2వేల జరిమానా లేదా ఒక్కోసారి రెండూ శిక్షగా అనుభవించాల్సి రావొచ్చు
రెండోసారి తాగి దొరికితే రూ.3 వేల ఫైన్, అలాగే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఆ తర్వాత కూడా తీరు మారకపోతే లైసెన్స్ రద్దు చేసే అవకాశముంటుంది.
హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే పోలీసులు చలాన్ ఇచ్చి బైక్ తీసుకెళ్లి, స్టేషన్‌కు రమ్మని చెబుతారు. మరి అప్పుడు ఏం చేయాలో తెలుసా!
బైక్ ఎక్కడికి తీసుకెళ్లినా మీరు చలాన్‌తో పాటు వెంట మరొకరిని తీసుకుని బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలి. అక్కడ మీకు కౌన్సెలింగ్ ఇస్తారు. ఇది సుమారు ఒక గంట ఉంటుంది
ఆ తర్వాత వారు మీకు ఓ రశీదు ఇస్తారు. అది తీసుకుని మీ బైక్ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేశారో అక్కడికి వెళ్లాలి. వారు కొన్ని పత్రాలు తీసుకుని, నాంపల్లి సివిల్ కోర్టుకు పంపుతారు
మీరు మీకు కేటాయించిన సమయంలో నాంపల్లి సివిల్ కోర్టుకు వెళ్లి, అక్కడ చలాన్ డబ్బులు చెల్లించి, స్టేషన్‌కు వెళ్లి మీ బైక్ తీసుకోవచ్చు