‘మలైకా ఆరోరా’ ‘yes’ చెప్పింది

YouSay Short News App

అర్జున్‌ కపూర్‌కు కాదా? మరెవరికి!

ఒక్క ఇన్‌స్టాగ్రాం పోస్టుతో నెట్టింటిని షేక్ చేసిన హీరోయిన్ ‘మలైకా ఆరోరా’.

‘మలైకా ఆరోరా’

గత కొద్ది కాలంగా హీరో అర్జున్ కపూర్‌తో ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రేమాయణం నడుపుతోంది. వీరిద్దరూ చెట్టపట్టాలేసుకుని తిరగుతుండటం మరింత బలాన్ని చేకూర్చింది.

అర్జున్‌తో ప్రేమాయణం..

ఈ క్రమంలోనే ‘నేను యస్ చెప్పా’ అని మలైకా ఇన్‌స్టాగ్రాంలో పోస్టు పెట్టింది. అర్జున్ కపూర్‌తో పెళ్లికి ఒకే చెప్పినట్లు అంతా ఊహించారు.

ఆ పోస్టు..

సెలబ్రిటీలు కూడా వీరికి శుభాకాంక్షలు చెబుతుండటంతో నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ మలైకా ట్రెండింగులోకి వచ్చేసింది.

ట్రెండింగులోకి..

తన పోస్టుపై ఊహాగానాలు రావడంతో మలైకా క్లారిటీ ఇచ్చింది. వేరే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన పోస్టు అని స్పష్టతనిచ్చింది.

నటి క్లారిటీ..

నేను ఒకే చెప్పింది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు. ‘మూవింగ్ విత్ మలైకా’ అనే రియాలిటీ షోకి హోస్ట్‌గా చేయబోతున్నానని వివరణ ఇచ్చింది. డిసెంబరు 5నుంచి స్ట్రీమింగ్ అవుతుందట.

రియాలిటీ షో..

మలైకా ఆరోరా మహారాష్ట్రలో 1973లో జన్మించింది. తండ్రిది పంజాబ్. తల్లిది కేరళ. అయితే, మలైకా 11ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడిపోయారు.

మహారాష్ట్రలో..

ఎంటీవీలో వీజేగా కెరీర్‌ని ఆరంభించింది ఈ భామ. ఆ తర్వాత మోడల్‌గా ఎదిగింది. కొన్ని ప్రకటనల్లో నటించింది.

వీజేగా..

కాఫీ యాడ్ చేస్తున్న సయమంలో దర్శకనిర్మాత అర్బాజ్ ఖాన్‌తో పరిచయం ఏర్పడింది. అది పెళ్లికి దారితీసింది.

అర్బాజ్‌తో పరిచయం..

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరుడే అర్బాజ్ ఖాన్. మలైకా సల్మాన్‌కి మరదలు అవుతుంది.

సల్మాన్ సోదరుడే..

1998లో వీరిద్దరికి పెళ్లయింది. 2003లో కుమారుడు అర్హన్ పుట్టాడు. 2017లో అర్బాజ్, మలైకా విడిపోయారు.

2007లో విడాకులు..

అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్‌ని నెలకొల్పింది. దబాంగ్ మూవీ సిరీస్ ఈ నిర్మాణ సంస్థ నేతృత్వంలోనే విడుదలైంది.

అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్..

మలైకా వయసు 49 ఏళ్లు. అయినా ఇప్పటికీ యవ్వనంగానే కనిపిస్తుంటుంది. ఫిట్‌గా ఉండటానికి కారణం యోగా, జిమ్ బ్యాలెన్స్ చేయడమే అంటోందీ భామ.

వయసు 49..

మోడల్‌గా ఎదుగుతూనే నటిగా కొన్ని సినిమాల్లో చేసింది. అనంతరం పలు టీవీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించింది.

షోలకు జడ్జిగా..

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్‌ని షేర్ చేస్తుంటుందీ భామ. హాట్ హాట్ ఫొటోలను పంచుకుంటుంది.

హాట్ హాట్‌గా..