విరాట్ చేసింది ఫేక్ ఫీల్డింగేనా..!

ఐసీసీ ఏం చెబుతోంది?

ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచులో విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడన్న ఆరోపణలపై ఒకటే చర్చ నడుస్తోంది.

ఇంతకు ఫేక్ ఫీల్డింగ్ అంటే ఏంటి? చేస్తే ఏమవుతుంది? ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం

బ్యాట్స్‌మన్ ఏకాగ్రతకు భంగం కలిగించినా, పరుగులకు ఆటంకం కలిగించినా, మోసపూరితంగా వ్యవహరించినా అది ‘ఫేక్ ఫీల్డింగ్’ అవుతుందని ఐసీసీ నియమావళి చెబుతోంది.

ఫేక్ ఫీల్డింగ్

సెక్షన్ 41.5 ప్రకారం.. ఉద్దేశపూర్వకంగా బ్యాట్స్‌మన్‌ని తప్పుదారి పట్టించడం, బ్యాటర్‌కు అడ్డుతగలడం శిక్షార్హం.

నిబంధనలేంటి?

బాల్‌ని ఆన్ స్ట్రైక్ బ్యాటర్ ఆడిన తర్వాత.. మాట ద్వారా లేదా చేతల ద్వారా బ్యాట్స్‌మెన్ ఏకాగ్రతను ఫీల్డింగ్ జట్టు దెబ్బతీయొద్దు.

41.5.1

ఫేక్ ఫీల్డింగ్ అని నిర్ధారించాక సెక్షన్ 41.5.6 ప్రకారం బ్యాటింగ్ జట్టుకు అంపైర్ అదనపు పరుగులివ్వొచ్చు. ఆ బాల్‌ని వైడ్ లేదా నో బాల్‌గా ప్రకటించొచ్చు.

చర్యలేంటి..?

అవసరమైతే పెనాల్టీ కింద 5 పరుగులు ఇవ్వొచ్చు. ఈ విషయాన్ని ఇరు జట్ల కెప్టెన్లకు అంపైర్ తెలియజేయాల్సి ఉంటుంది.

సెక్షన్ 41.5.7 ఈ బంతిని డెడ్ బాల్‌గా పరిగణిస్తారు. ఓవర్‌లో ఈ బంతిని కౌంట్ చేయరు.

41.5.7

దీని ప్రకారం ఫేక్ ఫీల్డింగ్‌‌ని ధ్రువీకరించే ముందు బ్యాటర్లు రాబట్టిన పరుగులను స్కోరు బోర్డుకు కలుపుతారు. ఒకవేళ క్రీజు మధ్యలో ఉంటే అది పూర్తయినట్లుగానే భావించి అదనంగా రన్ యాడ్ చేస్తారు.

41.5.8

ఓవర్లో తదుపరి బంతిని ఎవరు ఎదుర్కోవాలనేది బ్యాటర్ల ఇష్టం. నాన్ స్ట్రైకింగులో ఉన్న వారు కూడా స్ట్రైక్ తీసుకోవచ్చు.

41.5.9

మ్యాచ్ తర్వాత ఈ ఘటనపై అంపైర్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. తదనుగుణంగా ఫేక్ ఫీల్డింగుకి పాల్పడిన ప్లేయర్/ కెప్టెన్ లేదా పూర్తి జట్టుపై చర్యలు తీసుకోవాలని అంపైర్లు కోరాలి.

41.5.10

డీప్ పాయింట్‌‌లో ఫీల్డింగ్ చేస్తున్న అర్షదీప్.. బంతిని అందుకుని వికెట్ల వైపు విసిరాడు. ఈ క్రమంలో పాయింట్‌లో ఉన్న విరాట్ బాల్‌ని అందుకుని నాన్ స్ట్రైకర్ వైపు విసురుతున్నట్లు నటించాడు.

విరాట్ చేసిందేంటి?

విరాట్ యాక్షన్‌పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, పరిగెత్తేటప్పుడు బ్యాటర్లు విరాట్‌ని చూడలేదు. వారి దృష్టి పరుగు తీయడంపైనే ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అంటే వారి ఏకాగ్రతకు భంగం కలిగించలేదన్నట్లు తెలుస్తోంది.

తప్పేనంటారా..

అయితే దీనిని ఎవరూ గుర్తించకపోవడం వల్ల ఏం చేయలేమని మాజీలు చెబుతున్నారు. ఆకాశ్ చోప్రా, వ్యాఖ్యాత హర్ష భోగ్లే దీనిపై స్పందించారు.

మాజీల మాట..

విరాట్ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని బంగ్లా వైస్ కెప్టెన్ హసన్ ఆరోపించాడు. అందువల్లే తాము ఓడిపోయామని చెప్పాడు. 5 పెనాల్టీ పరుగులు ఇచ్చి ఉంటే విజయం తమదేనన్నాడు. బంగ్లా ఫ్యాన్స్ కూడా హసన్‌ని వెనకేసుకొచ్చారు.

హసన్ ఎవరు?

దీనిపై అధికారికంగా ఐసీసీ స్పందించలేదు. బ్యాటర్లు అంపైర్ల దృష్టికి తీసుకెళ్లారు. కానీ దాన్ని అంపైర్లు తిరస్కరించారు. యాదృచ్ఛికంగా, ఈ మ్యాచులో బంగ్లా 5 పరుగుల తేడాతో ఓడిపోవడం గమనార్హం.

ఐసీసీ ఏమంటోంది?