“సీతారామం” మీకు నచ్చిందా?

అలాంటి  ఈ ఫీల్‌గుడ్‌ మూవీస్‌ కూడా మీకు నచ్చుతాయి

మణిరత్నం క్లాసిక్‌ లవ్‌స్టోరీస్‌లో “రోజా” ఒకటి. మిలిటంట్ల చెరలో ఉన్న భర్త కోసం భార్య పడే వేదనను కళ్లకు కట్టాడు. AR రెహ్మాన్‌ సంగీతం సినిమాలో మనల్ని లీనం చేస్తుంది.

రోజా (1992) : prime video

పూరిజగనాధ్ తీసిన ఒక మంచి ప్రేమ కథ ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’.రవితేజ ఎంతో అద్భుతంగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఆకర్షించింది.ఈ సినిమా కి చక్రి సంగీతం ఒక ప్లస్ అని చెప్పాలి.

ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం(2001) : YouTube

సిద్ధార్థ్, జెనీలియా జంటగా వచ్చిన ‘బొమ్మరిల్లు’ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించిన సినిమా. తండ్రీ కొడుకుల అనుబంధం, ప్రేమ మధ్య సంక్లిష్టతతో వచ్చిన ఈ సినిమా దర్శకుడు భాస్కర్‌ను బొమ్మరిల్లు భాస్కర్‌గా మార్చేసింది.

బొమ్మరిల్లు (2006) : Voot

నాగచైతన్య, సమంతల మధ్య ప్రేమను చిగురింపజేసిన సినిమా. లవ్‌స్టోరీస్‌ని భిన్నంగా చూపించడంలో గౌతమ్‌ మీనన్‌ తనకు తానే సాటి అని మరోసారి నిరూపించిన సినిమా.

ఏమాయ చేశావే (2010) : prime video

‘సీతారామం’ దర్శకుడు హను రాఘవపూడి తొలి సినిమా ఇది. ఈ సినిమాతోనే హను రాఘవపూడి ప్రేమ కథలు అందంగా రాయగలడనే పేరు వచ్చింది. సంగీతం, సినిమాటోగ్రఫీ ఇలా ఈ సినిమాలో అన్నీ చక్కగా కుదిరాయి.

అందాల రాక్షసి(2012) : prime video

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ ప్రధాన పాత్రల్లో ‘మిథునం’ చిత్రం రూపొందించారు. భార్యభర్తల అనుబంధం, మనోభావాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. తనికెళ్ల భరణి ఈ చిత్రానికి దర్శకత్వం చేపట్టారు.

మిథునం (2012) : prime video

ప్రేమ, స్నేహం, లవ్‌ ఫెయిల్యూర్‌ ఇలాంటి అంశాలతో ఒక ఎమోషనల్‌ రోలర్‌ కోస్టర్‌లా ఉంటుంది. నయనతార, నజ్రియా, ఆర్య, సంతానం తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

రాజారాణి(2013) : Hotstar

ఇద్దరి మనసులు గుసగుసలాడుకున్నట్లు ఉంటుంది ఈ సినిమా. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చినా మంచి హిట్‌గా నిలిచింది. నాగశౌర్య, రాశి నటకు అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వం చక్కగా కుదిరింది.

ఊహలు గుసగుసలాడే (2014): YouTube

శర్వానంద్, నిత్యామీనన్ జంటగా ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రం రూపొందింది. ఓ అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని మలిచారు. ఈ ఫీల్‌గుడ్ మూవీకి కె.క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు.

మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (2015): Hotstar

చిన్నప్పటి చిలిపి ప్రేమ దగ్గర్నుంచి మన జీవితంలో వివిధ దశల్లో ప్రేమ అనుభూతి ఎలా ఉంటుందో ఓ కాల చక్రంలా చూపెడుతూనే అందమైన సన్నివేశాలతో భావోద్వేగాన్ని కలిగిస్తుంది. నాగచైతన్య, శృతి హాసన్, అనుపమ, మడోన్నా ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారు

ప్రేమమ్‌( 2016) : JioCinema

అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రల్లో ‘ఊపిరి’ చిత్రం తెరకెక్కింది. ఎమోషనల్ జర్నీకి కామెడీ, లవ్‌ జోడించి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేశారు.

ఊపిరి (2016) : JioCinema