ws_Snapinsta.app_1080_322051419_202765768909614_2294207933347099030_n

YouSay Short News App

బాలయ్య సినిమాలో నటించిన  హనీ రోజ్‌ గురించి తెలుసా?

ws_Snapinsta.app_1080_320490434_1279874769253197_6772099107172761578_n

మళయాలం కుట్టి హనీ రోజ్. బాలయ్య వీరసింహా రెడ్డి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తళుక్కున మెరిసిన  ఈ భామ గురించి తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా వెతుకుతున్నారు.

ws_Snapinsta.app_1080_311816719_523021386322311_7342450816126706949_n

సినీ పరిశ్రమకు 2005లో ఆరంగేట్రం చేసిన చిన్నది ఇప్పటికే తెలుగులోనూ రెండు సినిమాల్లో నటించింది.

ws_Snapinsta.app_1080_312676855_495765179127015_8670947870528558125_n

ఈమెకు సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్స్‌ కూడా ఎక్కువే. హనీ రోజ్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.

కేరళకు చెందిన హనీ రోజ్ వర్గీస్ 14వ ఏట సినిమాల్లోకి అడుగు పెట్టింది. మళయాలంలో బాయ్‌ ఫ్రెండ్‌ సినిమాతో 2005లో ఆరంగేట్రం చేసింది ఈ అమ్మడు.

ఎప్పుడో వచ్చింది

మెుదట్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ హనీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేే ప్రయత్నం చేసింది. అందం, అభినయంతో లీడ్‌రోల్స్‌ చేసే స్థాయికి చేరుకుంది.

ఫేమ్ రాలేదు

మమ్ముట్టి, మోహన్‌లాల్‌ వంటి అగ్రహీరోల సరసన ఆడిపాడింది ఈ బ్యూటీ. మెహన్‌లాల్‌ హీరోగా బ్యాక్‌ టూ బ్యాక్‌ చిత్రాలు చేయడంతో స్టార్‌ స్టేటస్ వచ్చింది.

అగ్రహీరోల సరసన

ఈ కేేరళ కుట్టికి తెలుగు సినిమాలు కొత్త కాదు. 2008లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ‘ఆలయం’ సినిమాలో నటించింది.

తెలుగులో సినిమాలు

వరుణ్ సందేశ్‌ హీరోగా వచ్చిన ‘ఈ వర్షం సాక్షిగా’ చిత్రంలోనూ తళుక్కున మెరిసింది. కానీ, పెద్దగా ఆకట్టుకోలేదు.

వరుణ్‌ సరసన

నటించిన రెండు సినిమాలు కాస్త ఆడకపోవటంతో తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. ఆమె ఎందులోనూ కనిపించలేదు.

తగ్గిన అవకాశాలు

దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగులో నటిస్తోంది హనీ. బాలకృష్ణ వీరసింహా రెడ్డిలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో ఆమె పాత్ర మలుపుతిప్పుతుందని టాక్.

10 ఏళ్ల తర్వాత

వీరసింహా రెడ్డి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆమె రెడ్‌ కలర్ డ్రెస్‌ లుక్‌ ఆకట్టుకుంది. బాలయ్య ఆమెతో మళయాలంలో మాట్లాడుతూ స్టేజిపై నవ్వులు పూయించారు.

ప్రీరిలీజ్‌లో సందడి