జబర్దస్త్ కొత్త యాంకర్‌ 

YouSay Short News App

సౌమ్య రావు గురించి తెలుసా?

కామెడీ షో జబర్దస్త్‌కి కొత్త యాంకర్‌గా సౌమ్య రావ్ వచ్చింది. జబర్దస్త్ ద్వారా ఎంతో పాపులర్ అయిన అనసూయ స్థానాన్ని సౌమ్య రావ్ భర్తీ చేయనుంది.

అనసూయ స్థానంలో..

సౌమ్య రావ్ కర్ణాటకకి చెందిన అమ్మాయి. ఈటీవీలో ప్రసారమయ్యే ‘శ్రీమంతుడు’ సీరియల్‌లో సత్య పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందింది.

శ్రీమంతుడులో..

సౌమ్యకు ఇస్తున్న రెమ్యునరేషన్ రష్మి, అనసూయల కన్నా తక్కువే అని తెలుస్తోంది. ఒక ఎపిసోడ్‌కి రూ.60వేలు ఇస్తున్నట్లు సమాచారం.

రెమ్యునరేషన్..

సౌమ్య రావ్ నడిగ్ తన పూర్తి పేరు. అసలు పేరు సౌమ్య శారదా. 1990, సెప్టెంబరు 29న శివమొగ్గలో జన్మించింది.

పూర్తి పేరు..

జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌లో డబుల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. న్యూస్ ఛానల్‌లో న్యూస్ రీడర్‌గా పనిచేసింది. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

న్యూస్ రీడర్‌గా..

2017లో జీ కన్నడ ఛానల్‌లో ‘పట్టేదారి ప్రతిభ’ అనే సీరియల్‌లో అతిథి పాత్రలో నటించారు. ఈ సీరియల్ సమయంలోనే మిమిక్రీ ఆర్టిస్ట్‌గా ఎదిగారు. తమిళ టీవీ సీరియల్స్‌లోనూ నటించారు.

అతిథి పాత్రలో..

ఈటీవీ 27వ వసంతోత్సవం సందర్భంగా చేసిన ‘భలే మంచి రోజు’ ప్రత్యేక ప్రోగ్రాంలో సౌమ్య మెరిసింది. వచ్చీరాని తెలుగులో మాట్లాడుతూ హైపర్ ఆదిపైనే పంచ్‌లు వేసింది. ఈ కార్యక్రమంతో జబర్దస్త్ టీం దృష్టిలో సౌమ్య పడింది.

భలే మంచి రోజు..

సౌమ్యకు తెలుగు పూర్తిగా రాదు. శ్రీమంతుడు సీరియల్ షూటింగు సమయంలో తెలుగు అసిస్టెంటుని పెట్టుకుని డైలాగులు నేర్చుకునేదట.

తెలుగు రాదు..

శ్రీమంతుడు సీరియల్‌లోని నటీనటుల్లో సౌమ్య రావే తనకు బెస్ట్ అని ఆ సీరియల్ డైరెక్టర్ కితాబిచ్చాడు.

సౌమ్యనే బెస్ట్..

తమిళ్‌లో విక్రమ్, కన్నడలో సుదీప్ అంటే  సౌమ్యకు ఇష్టమట.

వీరంటే ఇష్టం..

సమాజ సేవకులు, సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులను ఆదర్శంగా తీసుకుంటుందట.

వీరు ఆదర్శం..

సమాజ సేవ..

తన సంపాదనలో కొంత మొత్తం సమాజ సేవకు వెచ్చిస్తానని చెబుతుంటుందీ జబర్దస్త్ యాంకర్.