లియోనల్ మెస్సీ శునకం గురించి ఈ విషయాలు తెలుసా?
YouSay short News App
లియోనల్ మెస్సీ ప్రపంచకప్ కలను సాకారం చేసుకుని దిగ్గజాల సరసన చేరిన అర్జెంటినా ఆటగాడు.
36 ఏళ్ల తరువాత అర్జెంటినా ప్రపంచకప్ గెలిచింది. కెరీర్‌లోనే భీకర ఫామ్‌ని కొనసాగిస్తూ మెస్సీ..
అర్జెంటినా జట్టుకు ప్రపంచకప్‌ని అందించాడు. ఫైనల్ మ్యాచులోనూ మెస్సీ ప్రదర్శన చిరస్మరణీయం.
ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన క్రీడాకారుల్లో మెస్సీ ఒకడు. మెస్సీకి ఓ పెంపుడు శునకం ఉంది.
చూడటానికి భారీ ఆకారంలో కనిపించే ఈ శునకం పేరు సెనెర్ హల్క్.
‘డాగ్ డీ బోర్ డూ’ జాతికి చెందిన శునకం ఇది.
ఫ్రెంచి మస్టిఫ్ లేదా బోర్ డూ మస్టిఫ్ అనే పేర్లు కూడా వాడుకలో ఉన్నాయి.
ఇంటికి కాపలాగా వీటిని వినియోగిస్తారు. భారీ బరువులను లాగడంలో ఈ శునకాలు దిట్ట.
మెస్సీ శునకం సెనర్‌ని చూస్తుంటే అచ్చం సింహం లాగే అగుపిస్తుంది. బహుశా అందుకే దీనికి హల్క్ అని పేరొచ్చినట్టుంది.
2016 జనవరిలో మెస్సీ సమూహంతో చేరింది. ప్రస్తుతం హల్క్ వయసు 5ఏళ్లు.
మెస్సీ భార్య ఆంటోనెలా రొకూజో వీడి బాగోగులు చూసుకుంటోంది.
హల్క్‌తో కలిసి దిగిన ఫొటోలను మెస్సీ ఫ్యామిలీ సోషల్ మీడియాల్లో పంచుకుంటుంటుంది.
27ఇంచుల ఎత్తు, 150 పౌండ్ల బరువు ఉంటుందీ శునకం.
చిన్నారులతో ఈ జాతి శునకాలు ఎంతో స్నేహపూర్వకంగా మెలుగుతాయి.
మెస్సీ కుమారులకు హల్క్ పెద్దన్నలాగా ఉంటాడు.
హల్క్‌తో పాటే మెస్సీ ఫ్యామిలీకి మరో శునకం ఉంది. టోబీ. హల్క్ కన్నా ఆకారంలో చాలా చిన్నగా ఉంటుంది.
రెండు విభిన్న జాతులు అయినప్పటికీ.. హల్క్, టోబీల మధ్య ప్రత్యేకమైన బంధం ఏర్పడింది.