శాలరీ లేకున్నా ఇచ్చే  ‘సెక్యూర్‌డ్‌ క్రెడిట్ కార్డ్‌’ గురించి తెలుసా?

YouSay Short News App

క్రెడిట్‌ కార్డు గురించి మీకు తెలిసిందే. శాలరీ పొందే ఉద్యోగులకు లేదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నవారికి లేదా కరెంట్‌ అకౌంట్లు ఉన్న వారికి వారి క్రెడిట్‌ స్కోర్‌ ఆధారంగా ఇస్తారు. కానీ శాలరీ రాకున్నా, FDలు లేకున్నా ఇచ్చే క్రెడిట్ కార్డ్‌ గురించి తెలుసా? అదే సెక్యూర్‌డ్‌ క్రెడిట్ కార్డ్‌.

మీ డబ్బును మీరే అప్పు తీసుకుని వాడటమే సెక్యూర్డ్‌ క్రెడిట్ కార్డ్ విధానం. అంటే మీరు కొంత డబ్బు జమ చేస్తే ఆ డబ్బుతో  క్రెడిట్‌ లిమిట్‌ నిర్ణయించి బ్యాంకులు మీకు సెక్యూర్‌డ్‌ క్రెడిట్‌ కార్డును ఇస్తాయి.

సెక్యూర్‌డ్‌ క్రెడిట్‌ కార్డ్‌ అంటే?

మాకు ప్రయోజనమేంటి అనుకుంటున్నారా? బ్యాంకుల్లో రుణాలు పొందాలన్నా? క్రెడిట్‌ కార్డులు పొందాలన్నా మంచి క్రెడిట్ స్కోర్‌ అవసరం. అది నిరంతర ట్రాన్సాక్షన్ల ఆధారంగా నిర్ణయిస్తారు. అంటే మీరు ఓ సెక్యూర్‌డ్‌ క్రెడిట్‌ కార్డు తీసుకుని ఆ ట్రాన్సాక్షన్ల ద్వారా క్రెడిట్‌ స్కోర్‌ పెంచుకోవచ్చు అన్నమాట.

మనకేం లాభం?

సాధారణంగా మీరు సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డ్‌ ఓపెన్‌ చేసిన 30-45 రోజుల్లో మీ ట్రాన్సాక్షన్‌ హిస్టరీ క్రెడిట్‌ బ్యూరోకు వెళ్తుంది. అప్పుడు మీ క్రెడిట్‌ స్కోరు మెరుగవ్వడం ప్రారంభమవుతుంది.

సెక్యూర్‌డ్‌ క్రెడిట్ కార్డ్‌ ఎలిజిబిలిటీ ఒక్కో బ్యాంకుకు ఒక్కోలా ఉంది. కొన్ని బ్యాంకులు మనిమమ్‌ డిపాజిట్‌తో ఇస్తున్నాయి. మరికొన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే ఇస్తున్నాయి.

అర్హత ఏంటి?

సాధారణ క్రెడిట్‌ కార్డుల మాదిరిగి వీటికి వెరిఫికేషన్‌ ప్రక్రియ అంత భారీగా ఉండదు. క్రెడిట్‌ కార్డుకు ఉండే అన్ని ప్రయోజనాలు ఉంటాయి. సాధారణ క్రెడిట్‌ కార్డుల మాదిరిగా అత్యధిక జాయినింగ్‌, యాన్యువల్‌ ఫీ ఉండదు.

ప్రయోజనాలు

సాధారణ కార్డులకు ఉన్నంత భారీ వడ్డీరేట్లు కూడా ఉండవు.కొన్ని బ్యాంకులు మన డిపాజిట్‌పై వడ్డీ కూడా ఇస్తున్నాయి. అంటే క్రెడిట్‌ కార్డు ఫీచర్లతో పాటు వడ్డీ కూడా పొందొచ్చు.

క్రెడిట్‌ హిస్టరీ మెరుగ్గా ఉంటే కొన్ని బ్యాంకులు మీరు అదనపు డబ్బు జమ చేయకున్నా క్రెడిట్‌ లిమిట్‌ పెంచుతాయి.

సెక్యూర్‌డ్‌ క్రెడిట్‌ కార్డును క్లోజ్‌ చేయడం మీ క్రెడిట్‌ హిస్టరీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు వాడకపోయినా కార్డు ఉంచుకోవడం మంచిది.

మీరు తెలుసుకోవాల్సినవి

సెక్యూర్‌డ్‌ క్రెడిట్‌ కార్డు మీరు ఎంత కాలమైనా ఉంచుకోవచ్చు. బ్యాంకు అధికారులను సంప్రదిస్తే మీ అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు.

డిపాజిట్‌ చేసిన డబ్బులు తిరిగిరావని గుర్తుంచుకోండి. మీరు కార్డ్‌ క్లోజ్ చేసినపుడు మాత్రమే బ్యాంకుల లెక్కలు చేసి మీకు రావాల్సింది తిరిగిస్తుంది.

క్రెడిట్‌ లిమిట్‌ పెంచుకోవాలనుకుంటే బ్యాంకును సంప్రదించాలి. అదనపు డబ్బు జమ చేయడం లేదా మంచి క్రెడిట్ స్కోర్‌ ద్వారా పెంచుకోవచ్చు

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.