YouSay Short News App

చార్జింగ్ పెట్టే ఫిఫా ఫుట్‌బాల్‌  ‘అల్ రిహ్లా’ గురించి తెలుసా?

 Ⓒ adidas.com

ఫిఫా ప్రపంచకప్‌ సంచలనాలతో సాగుతోంది. ఇలాంటి దశలో అందరినీ ఓ విషయం ఆకర్షిస్తోంది. అదే ‘అల్‌ రిహ్లా’. ఇది మ్యాచ్‌లో వినియోగిస్తున్న ఫుట్‌ బాల్‌ పేరు.

 Ⓒ adidas.com

మెుట్టమెుదటిసారి సూపర్‌ టెక్నాలజీతో బాల్‌ తయారు చేశారు. బంతి ఎటువెళ్తోంది. ఎంత వేగంతో వెళ్తోంది. ఇలాంటి సమాచారం అంతా తనకు తానే అందిస్తుంది.  బంతి గురించి మరింత తెలుసుకుందాం

 Ⓒ adidas.com

ఖతర్‌  వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో వాడుతున్న ఫుట్‌బాల్‌ పేరు. అరబిక్‌లో ‘ప్రయాణం’ అని అర్థం. మెుట్టమెుదటిసారి బాల్‌ సమాచారాన్ని ఇస్తుంది.

అల్‌ రిహ్ల

 Ⓒ adidas.com

ప్రస్తుతం వినియోగిస్తున్న ఈ బాల్‌లో సరికొత్త సాంకేతికత ఉపయోగించారు. వీడియో అసిస్టెన్స్‌ రిఫరీకి విలువైన బాల్‌ డేటాను ఇస్తుంది. దీనివల్ల కొన్ని సమయాల్లో కచ్చితమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది.

సాంకేతికత

 Ⓒ adidas.com

ఆటగాళ్లు బాల్‌ను పాస్‌ చేస్తున్నప్పుడు అందుకు సంబంధించిన డేటాను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా ఎప్పటికప్పుడు స్టోర్‌ చేస్తుంది.ప్లేయర్‌ స్థానాన్ని కూడా చూపిస్తుంది. దీనివల్ల కొన్ని సమయాల్లో VAR సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.

ఏం చేస్తోంది

 Ⓒ adidas.com

ఈ ఫుట్‌బాల్‌లో 500HZ IMU సెన్సార్‌ను పొందుపరిచారు. దీనివల్ల బాల్‌ ప్రతి కదలికను గమనించవచ్చు. ఇది ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలిగించదు. సెన్సార్‌ ఉన్నట్లు కనీసం వారికి తెలీయదు.

సెన్సార్‌

 Ⓒ adidas.com

ఈ సెన్సార్‌ను బ్యాటరీతో ఛార్జ్‌ చేసి మళ్లీ ఉపయోగించవచ్చు. ఇటీవల మైదానంలో ఫుట్‌బాల్స్‌ను ఛార్జ్‌ చేస్తున్నట్లు కనిపించింది. యాక్టివ్‌గా ఉంటే 6 గంటలు, లేదా 18 గంటలు పనిచేస్తుంది.

REUSE

 Ⓒ adidas.com

పోర్చుగల్-ఉరుగ్వే మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది వెలుగులోకి వచ్చింది. అందులో ఉరుగ్వే ఆటగాడు బ్రూనో ఫెర్నాండేజ్‌ గోల్‌ కొట్టగా..దానికి క్రిస్టియానో రొనాల్డో అభ్యంతరం చెప్పాడు.  ఆ సమయంలో బాల్‌ డేటా సాంకేతికత వినియోగించారు.

బయటకు ఎలా

 Ⓒ adidas.com

ఫిఫాలో వినియోగించేకన్నా ముందు దీనిని పరీక్షించారు. ఫిఫా అరబ్‌ కప్‌, అబుదాబిలో ఆడిన క్లబ్‌ వరల్డ్‌ కప్‌లో ఉపయోగించారు.

ప్రపంచకప్‌కు ముందు పరీక్ష

 Ⓒ adidas.com

ఈ సెన్సార్‌ను అడిడాస్‌(Adidas) ఫిఫాతో పాటు కైనెక్సాన్‌ అనే కంపెనీ సహకారంతో రూపొందించింది. ఆటగాడు బంతిని తాకినప్పుడు సెకనుకు 500 సార్లు కచ్చితమైన సమాచారాన్ని అందించేలా తయారు చేశారు.

రూపకల్పన

 Ⓒ adidas.com

ఈ సెన్సార్‌ను అడిడాస్‌(Adidas) ఫిఫాతో పాటు కైనెక్సాన్‌ అనే కంపెనీ సహకారంతో రూపొందించింది. ఆటగాడు బంతిని తాకినప్పుడు సెకనుకు 500 సార్లు కచ్చితమైన సమాచారాన్ని అందించేలా తయారు చేశారు.

రూపకల్పన

 Ⓒ adidas.com

ఫిఫా ప్రపంచకప్‌కు అడిడాస్‌ ఫుట్‌బాల్‌ను సరఫరా చేస్తోంది. గత 50 ఏళ్లుగా ఫిఫాకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.

అడిడాస్‌

 Ⓒ adidas.com

ఫిఫా ప్రపంచకప్‌కు అడిడాస్‌ ఫుట్‌బాల్‌ను సరఫరా చేస్తోంది. గత 50 ఏళ్లుగా ఫిఫాకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.

అడిడాస్‌

 Ⓒ adidas.com

ఈ ఫుట్‌బాల్‌ను తయారు చేసేందుకు దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది. పాకిస్థాన్‌లోని సేల్‌కోట్‌లో 70 శాతం బాల్స్‌ను తయారు చేస్తున్నారు.

తయారీ

 Ⓒ adidas.com