భారతదేశ చరిత్రలో తెలంగాణది ప్రత్యేక స్థానం. శాతావాహనుల నుంచి నిజాం వరకు ఎన్నో రాజవంశాలు పరిపాలించిన నేల. ముల్కీ, నాన్ ముల్కీ నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వరకు పోరాటాల పురిటి గడ్డ.
హైదర్ అంటే ‘సింహం’ అబాద్ అంటే ‘నగరం’ అని అర్థం. అలీ ఇబ్న్ అబీ తాలిబ్ ఇతడు యుద్ధంలో సింహ పరాక్రమం కలిగినవాడని బిరుదు ఉండేది. అందుకే అతడిని హైదర్ అని పిలిచేవారు. మహమ్మద్ ప్రవక్తకు అల్లుడు. అతడి పేరు మీదుగానే హైదరాబాద్ అని పేరు పెట్టారంట.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1959 నుంచి 62 దాకా రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా పనిచేసిన కొండా వెంకట రంగారెడ్డి పేరు మీదుగా ఈ జిల్లాకు నామకరణం చేశారు. జాగీర్దార్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో KV రంగారెడ్డి పోరాటం సాగించారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ పేరు మీదుగా జిల్లాకు నామకరణం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన సేవలకు గుర్తుగా పేరు పెట్టారు.
అష్ట దశ మహాశక్తి పీఠాల్లో ఒకటి అలంపూర్ జోగులాంబ గద్వాల ఆలయం. యోగులకు తల్లి యోగులమ్మ అనే తెలుగు పదం నుంచి జోగులాంబ వచ్చిందని చరిత్ర. ఇలా ఆ ప్రాంతం పేరును పెట్టారు.
స్థానికంగా నరసింహ స్వామి కొలువుదీరిన స్తంభాద్రి అనే కొండ కారణంగా ఖమ్మం అని పేరు వచ్చిందని చరిత్ర. ప్లహ్లాదుడిని కాపాడటానికి ఒక రాతిస్తంభాన్ని పగులగొట్టుకొని వచ్చి హిరణ్య కశ్యపుడిన చంపాడని స్థల పురాణం.
నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొండు బిడ్డ కుమ్రం భీం పేరు మీదుగా జిల్లాకు నామకరణం చేశారు. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో నిజాం అరాచకాలకు, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా భీం చేసిన పోరాటం చరిత్ర పుటల్లో నిలిచింది.
ఈ ప్రాంతాన్ని పరిపాలించిన నిమ్మ నాయుడు లేదా నిమ్మ రాయుడు అనే వ్యక్తి పేరు మీద పెట్టారని చెబుతుంటారు. ఇతను కళాకారులను ప్రోత్సహించి పట్టణంలో ఉండేలా చూశాడట. అంతేకాదు కర్ర బొమ్మలకు, చిత్రాలకు నిలయంగా మార్చారని చరిత్రలో ఉంది.
నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పేరు మీద పెట్టిన మూడో ప్రాంతం. అంతకముందు నిజామాబాద్ ను ఇందూరు అని పిలిచేవారు. 5వ శతాబ్ధంలో పరిపాలించిన ఇంద్రదత్త రాజు పేరు మీద ఇందూరు అనేవారు.
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని గతంలో రాజన్న సిరిశాల అని పిలిచేవారట. అంటే పట్టు వస్త్రాలకు నిలయం, సంపదకు కేంద్రం అని అర్థం. అందుకే మళ్లీ రాజన్న సిరిసిల్ల అనే పేరు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెట్టారు.