ఆరు నెలల్లో మనిషి మెదడులో చిప్న్యూరాలింక్(Neuralink) ఎలా పనిచేస్తుందో తెలుసా?
ఆరు నెలల్లో మనిషి మెదడులో చిప్‌ను ప్రయోగిస్తామని ఎలాన్ మస్క్‌ఇటీవల ప్రకటించారు. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌పై కాలిఫోర్నియాలో జరిగిన సదస్సులో ఆయన ఈ మాట అన్నారు. ఈ ప్రయోగానికి పత్రాలను కూడా సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు
ఇదంతా ఎలా సాధ్యమవుతుందని ఆలోచిస్తున్నారా? ‘న్యూరాలింక్’ ద్వారా మనిషి తన అవయవాలు వినియోగించకుండా కేవలం మెదడు ద్వారానే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను నియంత్రించవచ్చు. మనసులో అనుకుంటే చాలు పనైపోతుంది
న్యూరాలింక్ అంటే మనిషి మెదడు, కంప్యూటర్ కు అనుసంధానం. దీనిపై ఇప్పటికే అనేక పరిశోధనలు సాగుతున్నాయి. అందులో ఎలాన్ మస్క్ ప్రోత్సాహంతో ఓ స్టార్టప్ చేపడుతున్న పరిశోధనలు ఇప్పటికే ఎంతో పురోగతి సాధించాయి
న్యూరాలింక్ అంటే
ఇంట్లో లైట్ ఆర్పడం దగ్గర్నుంచి కంప్యూటర్ కీబోర్డు, మౌస్ వాడకుండానే ఆపరేట్ చేసే వరకూ ప్రతీది మెదడుతోనే చేయవచ్చు. 2030 కల్లా ఇది సాధ్యమవుతుందని అనేక పరిశోధకులు విశ్వసిస్తున్నారు.
న్యూరాలింక్ లో ఓ చిన్న పరికరాన్ని మెదడులో ఇంప్లాంట్ చేస్తారు. దానికున్న చిన్న చిన్నపోగుల్లాంటివి మెదడులోని నాడీమండలంతో కలుస్తాయి. మెదడు ఆలోచించినపుడు ఉత్పత్తయ్యే విద్యుత్ ప్రకంపనలను ఆ పరికరం సమాచారంగా మలిచి బయటి వస్తువును నియంత్రిస్తుంది.
ఎలా పనిచేస్తుంది?
ఓ కోతి మెదడులో చిప్ అమర్చారు. ఆ కోతికి మొదట ఒక పైప్ ద్వారా పళ్లరసం ఇచ్చి చేతులతో వీడియో గేమ్ ఆడించారు. అది గేమ్ అడుతున్నపుడు దాని మెదడులోని స్పందనలను న్యూరాలింక్ రికార్డు చేసింది. ఆ తర్వాత కోతి చేతులు వినియోగించకపోయినా మెదడుతోనే గేమ్ అడగలిగింది.
మనుషుల్లో సాధ్యమవ్వడానికి దీనికి కొంతకాలం పట్టొచ్చు గానీ పక్కాగా అందుబాటులోకి వస్తుంది. నోకియా సీఈఓ పెక్కా లండ్ మార్క్ సైతం ‘2030 కల్లా 6జీ వచ్చేస్తుంది.అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు కూడా ఉండవు. అంతా మెదడు ద్వారానే కమ్యూనికేషన్ సాగుతుంది’ అన్నారు.
మరిన్ని కథనాల కోసంమా వెబ్‌సైట్ చూడండి.YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.