ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యాటక నౌక ( రివర్ క్రూయిజ్) ‘గంగా విలాస్’ ను ప్రధాని మోదీ జనవరి 13న ప్రారంభించబోతున్నారు. గంగా, బ్రహ్మపుత్ర నదుల మీదుగా ఇది 3,200 కి.మీ.లు ప్రయాణించనుంది.
స్పా, జిమ్ వంటి అత్యాధునిక సౌకర్యాలతో
పాటు భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ రివర్ క్రూయిజ్‌ను రూపొందించారు. 51 రోజుల్లో ఇది 50 పర్యాటక స్థలాలు ప్రయాణించబోతోంది.
యూపీ, బిహార్, బెంగాల్, అసోంతో పాటు బంగ్లాదేశ్‌లో ఈ క్రూయిజ్ షిప్ ప్రయాణిస్తుంది. గంగా, బ్రహ్మపుత్రతో పాటు భాగీరధి, హుగ్లీ, బిద్యావతి, మాట్లా, బంగ్లాదేశ్‌లతోని మేఘన, పద్మ, జమున నదుల్లో ‘గంగా విలాస్’ విహరించనుంది.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో మొదలయ్యే గంగా విలాస్ యాత్ర అసోంలోని దిబ్రుగఢ్‌లో ముగుస్తుంది. వారణాసిలోని గంగా హారతి, విక్రమశిల యూనివర్శిటీ, సుందర్బన్ డెల్టా, కజీరంగా నేషనల్ పార్కు వంటి పర్యాటక స్థలాలు చూడొచ్చు.
62 మీటర్ల పొడవు 12 మీటర్ల వెడల్పు18 సూట్లు 36 మంది ప్రయాణికులకు సౌకర్యం3 సన్‌డెక్‌లు జిమ్, స్పారివర్ వ్యూ లాంజ్ కల్చరల్ ప్రోగ్రామ్స్
లగ్జరీ వసతులు
గంగా విలాస్‌లో ప్రయాణించాలంటే ఒక్కో ప్రయాణికుడు రోజుకు దాదాపు రూ.25వేలు వెచ్చించాలి. అంటే ఈ రివర్ క్రూయిజ్‌లో యాత్ర పూర్తి చేయాలంటే రూ.12.75లక్షల ఖర్చవుతుంది. లగ్జరీ రివర్ క్రూయిజెస్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.