సంధ్య దేవనాథన్‌

YouSay Short News App

మెటా ఇండియా నూతన హెడ్‌ 

గురించి తెలుసా

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాంల మాతృ సంస్థ మెటా ఇండియా హెడ్‌గా సంధ్య దేవనాథన్‌ నియమితులయ్యారు. 2023 జనవరి 1న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆంధ్రా యూనివర్సిటీలోనే బీ టెక్‌ చేసిన ఈమె గురించి తెలుసుకుందాం

మెటా తమ సంస్థలో దాదాపు 13 శాతం అంటే 11వేలకు పైగా ఉద్యోగులను తొలగించిన కఠిన సమయంలో ఆమె బాధ్యతలు చేపడుతున్నారు. మెటాను వదిలి ‘స్నాప్‌’లో చేరిన అజిత్‌ మోహన్‌ స్థానంలో ఆమె రానున్నారు.

కఠిన సమయంలో

సంధ్య దేవనాథన్‌ ఆంధ్రా యూనివర్సిటీలో 1994-98 మధ్య కెమికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేశారు. ఆ తర్వాత దిల్లీ యూనివర్సిటీ నుంచి MBA చేశారు. 2014లో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో  లీడర్‌షిప్‌లో కోర్సు చేశారు.

విద్యాభ్యాసం

ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్‌ చేసిన సంధ్య, తెలుగులో అనర్గళంగా మాట్లాడగలరు. తమిళ, హిందీ, ఇంగ్లీష్‌ భాషలు ఆమెకు కొట్టినపిండి.

తెలుగులో అనర్గళంగా..

సంధ్య దేవనాథన్‌కు బ్యాంకింగ్‌, టెక్నాలజీ, పేమెంట్స్‌లో 22 ఏళ్ల అంతర్జాతీయ అనుభవం ఉంది.  కెరీర్‌ తొలినాళ్లలో అమె సిటి బ్యాంక్‌, స్టాండర్డ్‌ చార్టర్‌డ్‌ తదితర సంస్థల్లో పనిచేశారు.

కెరీర్‌

సంధ్య దేవనాథన్‌ అనేక సంస్థల్లో బోర్డ్‌ మెంబర్‌గా ఉన్నారు. వుమెన్స్‌ ఫోరమ్‌ ఫర్‌ ది ఎకానమీ అండ్‌ సొసైటీ, నేషనల్‌ లైబ్రరీ బోర్డ్‌ ఆఫ్‌ సింగపూర్‌, పెప్పర్‌ ఫినాన్షియల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌, ది సింగపూర్‌ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీ, సింగపూర్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌లో ఆమె సభ్యురాలిగా ఉన్నారు.

అనేక బోర్డుల్లో సభ్యురాలు

సంధ్య 2016లో మెటాలో చేరారు. సింగపూర్‌, వియత్నాంలో టీమ్స్‌, బిజినెస్‌ బిల్డింగ్‌లో ఆమె సంస్థకు సాయపడ్డారు. సౌత్‌ఈస్ట్ ఆసియాలో మెటా ఈ-కామర్స్‌ కార్యకలపాల విస్తరణకూ పనిచేశారు.

2016లో మెటాలో అడుగు

మెటా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే గేమింగ్‌లో ఆసియా పసిఫిక్‌ రీజియన్‌ హెడ్‌గా 2020లో సంధ్య దేవనాథన్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈమె ఇదే పదవిలో కొనసాగుతున్నారు.

2020లో గేమింగ్ హెడ్‌

సంధ్య దేవనాథన్ పుట్టినతేదీపై స్పష్టత లేదు. కానీ ఆమెకు 46 ఏళ్లు ఉండొచ్చని అంచనా. ఆమె భర్త బిజినెస్‌మ్యాన్‌ అమిత్‌ రే.

ఆమె వయసెంత?

భారత్‌లో మెటాను మరింత బలంగా తీసుకెళ్లడం, ప్రముఖ బ్రాండ్లు, అడ్వర్టైజర్లతో సంబంధాలు మెరుగుపరచి మెటా రెవెన్యూ పెంచడం ఆమె విధులు

మెటాలో ఆమె రోల్‌

“ఇండియాలో మా నూతన సారథిని సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. బిజినెస్‌ స్కేలింగ్‌, బలమైన సంబంధాలు నిర్మించడంలో ఆమెకు అద్భుతమైన ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. మెటా ఇండియాను ఆమె లీడ్‌ చేయడం పట్ల సంతోషంగా ఉంది” అని మెటా చీఫ్ బిజినెస్‌ ఆఫీసర్‌ మార్నీ లైవైన్‌ అన్నారు.

సంస్థ ఏమందంటే

ప్రపంచం ఆర్థిక మాంద్యం భయాలు మోస్తున్న వేళ, సంస్థలు వేలమంది ఉద్యోగులను తొలగిస్తున్న క్లిష్ట పరిస్థితుల్లో సంధ్య దేవనాథన్‌ కెరీర్‌ మంచి విజయాలు సాధించాలని కోరుకుంటూ YouSay తరఫున ఆమెకు శుభాకాంక్షలు.