YouSay short News App

మెస్సీ భార్య 'రొకూజో' మోడల్‌ అని మీకు తెలుసా?

ఫుట్‌బాల్‌ చరిత్రలో తనకంటూ ఓ పేజీ లిఖించుకున్న అర్జెంటీనా సారథి లియోనల్ మెస్సీ. అతడి విజయం వెనకాల అతడి భార్య ఆంటోనెల్లా రొకూజో ఉంటుందనడం అతిశయోక్తి కాదు.

ప్రపంచకప్ సహా దాదాపు అన్ని మ్యాచులకు ఆమె వెళ్లింది. మరి ఇంతలా భర్తను వెన్నుతట్టిన ఆమె గురించి తెలుసుకోకపోతే ఎలా ?

ఆంటోనెల్లా రొకూజో

ఆంటోనెల్లా రొకూజో మెస్సీకి  ఐదేళ్ల వయసు ఉన్నప్పట్నుంచి పరిచయం. 

తన చిన్ననాటి స్నేహితురాలు. వీరిది ప్రేమ వివాహం. చాలాకాలం పాటు కలిసున్న తర్వాత ఒక్కటయ్యారు.

వివాహం, పిల్లలు

వీరిద్దరూ 2017లో వివాహం చేసుకున్నారు. దీనిని అర్జెంటీనా వివాహ శతాబ్దం అంటారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

మోడల్ / ఫ్యాషన్ డిజైనర్

రొకూజో మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గానూ ఉంది.

స్వతాహగా ఆమె ఫ్యాషన్ డిజైనర్ కూడా. మోడల్‌గా ఆమె ఫొటోలు చూసినవారెవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.

ఫాలోవర్స్‌

ఈ అమ్మడికి సామాజిక మాధ్యమాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. ఆమె ఇన్‌స్టా ఫాలోవర్స్ 22 మిలియన్‌ అంటే నమ్ముతారా?

డెంటిస్ట్ కావాల్సింది కానీ

రొకూజో డెంటిస్ట్ కోర్సును చదివింది. కానీ, మెస్సీతో కలిసి ఉండేందుకు నిర్ణయించుకొని దాన్ని మధ్యలోనే వదేలిసిందట. ఆ తర్వాత మోడల్‌గా ఎదిగింది.

వ్యాపారం

మోడల్‌గా కొనసాగుతూనే ఫ్యాషన్ రంగంలో కొంతమంది పార్ట్‌నర్స్‌తో కలిసి స్టార్టప్‌లను ప్రారంభించింది.

సంపాదన

మెస్సీ 600 మిలియన్ డాలర్లు సంపాదిస్తుంటే తనవంతుగా రొకూజో 20 మిలియన్ డాలర్లు ఆర్జిస్తుంది.

మెస్సీకి మద్దతు

రొకూజో మెస్సీ ఆడిన ప్రతి ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు వెళుతుంది. ఫిఫా ప్రపంచకప్‌లో ప్రతి మ్యాచ్‌ను తన ముగ్గురు పిల్లలతో కలిసి చూసింది.