తిరుమల తిరుపతి

 దేవాలయం ఆస్తులు మీకు తెలుసా

తిరుమల తిరుపతి దేవస్థానం పేరు మీద సెప్టెంబర్‌ నెలాఖరు వరకు బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు, బంగారం విలువలను అధికారులు వెల్లడించారు.

తిరుమల దేవాలయం నికర విలువ రూ. 2.5 లక్షల కోట్లు.ప్రముఖ ఐటీ కంపెనీ అయిన విప్రో, ఫుడ్ అండ్ బెవరేజీ కంపెనీ నెస్లే, ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు దిగ్గజాలు ఓఎన్జీసీ, ఐఓసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే ఇది ఎక్కువ.

విప్రో మార్కెట్ విలువ రూ. 2.14 లక్షల కోట్లు, నెస్లే ఇండియా  రూ. 1.96 లక్షల కోట్లు, ఎన్టీపీసీ, కోల్‌ ఇండియా ఇలా అనేక కంపెనీలు తిరుపతి కంటే వెనుకబడే ఉన్నాయి.

దేవస్థానం ఆస్తులలో బ్యాంకుల్లో 10.25 టన్నుల బంగారు డిపాజిట్లు ఉన్నాయి. 2.5 టన్నుల బంగారు ఆభరణాలు ఉన్నాయి. జాతీయ బ్యాంకుల్లో సుమారు రూ. 16వేల కోట్ల డిపాజిట్లు కలిపి దేశమంతటా 960 ఆస్తులున్నాయి.

ఏడు కొండలపై ఉన్న కాటేజీలు, అతిథి గృహాలు, పురాతన ఆభరణాలు మొదలైనవి పరిగణించకుండానే తిరుమలేశుని ఆస్తి 2.5 లక్షల కోట్లు

2022-23 సంవత్సరానికి TTD వార్షిక బడ్జెట్‌ రూ.3,100 కోట్లు.ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, హరియాణా, మహారాష్ట్ర, దిల్లీలో TTD ఆలయాలను నిర్వహిస్తోంది.

2022-23లో బ్యాంకుల్లో నగదు డిపాజిట్ల ద్వారా రూ. 668 కోట్లకు పైగా వడ్డీని TTD ఆదాయంగా అంచనా వేస్తోంది. 2.5 కోట్ల మంది భక్తుల నుంచి నగదు కానుకల రూపంలోనే రూ. 1,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా