సంజు శ్యాంసన్, చారులతల

YouSay Short News App

ఫేస్‌బుక్‌ ప్రేమకథ తెలుసా?

తొలిప్రేమ ఇచ్చే అనుభూతే వేరు. చదువుకునే రోజుల్లోనే ప్రేమ కోసం హృదయం తపిస్తుంది. స్కూల్‌లోనో, కాలేజీలోనో వికసించే తొలిప్రేమ కలకాలం మన హృదయాల్లో నిలిచిపోతుంది. ఇలాంటి ప్రేమ, పెళ్లితో బలపడితే.. జీవితంలో ఇంతకన్నా సాధించిన విజయం ఏముంటుంది!

ప్రేమను పంచడం, ప్రేమను పొందడం గొప్ప అనుభవం. కాలేజీ రోజుల్లో ప్రేమాయణం నడిపి పెళ్లి చేసుకున్న భారతీయ క్రికెటర్లున్నారు. వీరిలో కెప్టెన్ కూల్ ఎం.ఎస్. ధోనీ ముందుంటారు. ధోనీ ప్రేమ గురించి మనందరికీ తెలిసిందే. మరి, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ప్రేమాయణం గురించి తెలుసా?.

సంజు తన చిన్ననాటి స్నేహితురాలు చారులత రమేశ్‌ని 2018లో వివాహమాడాడు.

సంజు మధురమైన ప్రేమ గురించి మనం తెలుసుకుందామా..

సంజు, చారులత కాలేజీ స్నేహితులు. వీరిద్దరు కలిసి కేరళ తిరువనంతపురంలోని మార్ ఇవానియోస్ కాలేజీలో చదువుకున్నారు.

సంజు, చారు ఎలా కలిశారు?

సంజు బీఏ స్టూడెంట్. చారులత కెమిస్ట్రీ విద్యను అభ్యసించింది.

చారులతని సంజు కాలేజీలో చూసి మురిసిపోయేవాడు. కానీ, నేరుగా మాట్లాడేందుకు ధైర్యం చాలలేదు. దీంతో ఫేస్‌బుక్‌లో ప్రేమ వేటను మొదలుపెట్టాడు. చారుకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు.

అలా మొదలైంది..

ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపినా సంజు గుండెల్లో తెలియని కంగారు. కానీ, ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయడంతో సంజు ఎగిరి గంతేశాడు. ఇంకేముంది.. ప్రేమ సందేశాలకు ఫేస్‌బుక్ వేదికైంది.

చారు ఒప్పుకుందా..?

ఫేస్‌బుక్‌లో తొలకరించిన ప్రేమ.. కాలేజీ క్యాంపస్‌కు విస్తరించింది. ఇద్దరూ తరచుగా కలుసుకునేవారు. ఒకరికొకరు సమయం కేటాయించుకునేవారు. ఇలా అనతి కాలంలోనే ఒకరిపై మరొకరికి సానుకూల దృక్పథం ఏర్పడింది.

కెరీర్ తొలినాళ్లలో సంజు ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు. ఈ గడ్డు కాలంలో చారు అండగా నిలిచింది. తననెంతో ప్రోత్సహించింది. ఈరోజు సంజు ఇలా ఉండటానికి ముఖ్య కారణం చారులతే. 2018లో వీరి పెళ్లి కాకముందు ఐదేళ్లపాటు కలిసిమెలిసి ఉన్నారు. 24 ఏళ్లకే సంజు పెళ్లి పీటలెక్కడం గమనార్హం.

సంజుని ప్రోత్సహిస్తూ..

సంజు క్రిస్టియన్. చారులత హిందువు. అయినా పెద్దలు అడ్డు చెప్పకుండా మతాంతర వివాహానికి మద్దతుగా నిలిచారు.

2018లో వీరిద్దరూ ఒక్కటయ్యాక ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. సంజు కెరీర్‌లో ఉన్నత స్థానాలు అధిరోహించాడు. ఛాంపియన్ జట్టుకు సారథిగా ఎదిగాడు. ఐపీఎల్‌లోనే అత్యంత విలువైన ఆటగాడిగా సంజు అవతరించాడు.

వెనక్కి తిరిగి చూసుకోలేదు..

బిజినెస్‌పై ఆసక్తితో చారులత వ్యాపారవేత్తగా ఎదిగింది.

మిగతా వారిలా కాకుండా.. శ్యాంసన్, చారులత సోషల్ మీడియాని కాస్త మితంగానే వినియోగిస్తారు.

ఇప్పటివరకు వీరిబంధం అపురూపంగా కొనసాగుతోంది. ఇదండీ వీరి చిన్ననాటి ఆసక్తికరమైన ఫేస్‌బుక్ ప్రేమకథ. మరిన్ని కథనాల కోసం మా వెబ్‌సైట్‌ని చూడండి.