కృష్ణ, మహేశ్ బాబు కలిసి నటించిన

సినిమాలేంటో తెలుసా..?

YouSay Short News App

సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబు కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. వీటిలో మహేశ్ బాలనటుడిగా తెరపై కనిపించిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. దాదాపు వీరిద్దరూ కలిసి 10సినిమాల్లో నటించారు.

7 సినిమాల్లో బాలనటుడిగా, 3 సినిమాల్లో హీరోగా మహేశ్ బాబు నటించారు. వీటిల్లో కొన్నింటికి కృష్ణ దర్శకత్వం వహించారు.

మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబుతో కలిసి మరికొన్ని సినిమాల్లో మెరిశారు. వీటిలో కూడా కృష్ణ నటించారు. బాలనటుడిగా ‘నీడ’ సినిమాతో మహేశ్ బాబు తెరంగేట్రం చేశారు.

మహేశ్ బాబు, కృష్ణ కలిసి నటించిన చిత్రమిది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో వీరిద్దరూ అన్నదమ్ములుగా నటించారు.

పోరాటం..

Arrow

సూపర్ స్టార్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. అప్పట్లో బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇందులో తండ్రీకొడుకులుగా తెరపై మెరిశారు.

శంఖారావం..

Arrow

ఈ సినిమాలో కృష్ణ అతిథి పాత్రలో నటించారు. ఇందులో మహేశ్ బాబుతో పాటు రమేశ్ బాబు కూడా నటించారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ అభిమానిగా మహేశ్ బాబు నటించడం విశేషం.

బజారు రౌడీ..

Arrow

కృష్ణ స్వీయ దర్శకత్వంలో మహేశ్ బాబు, రమేశ్ బాబు నటించిన చిత్రమిది. ఇందులో కృష్ణ, రమేశ్ బాబు, మహేశ్ బాబు సోదరులుగా నటించారు.

ముగ్గురు కొడుకులు..

Arrow

మహేశ్ బాబు ఐదోసారి తండ్రి కృష్ణతో కలిసి నటించిన చిత్రమిది. కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

గూఢచారి 117..

Arrow

ఇందులో కృష్ణ, మహేశ్ బాబు.. తమ నిజ జీవిత పాత్రల్లో నటించారు. మహేశ్ బాబు డ్యుయల్ రోల్‌లో అలరించాడు.సూపర్‌స్టార్‌ దీనికి దర్శకత్వం వహించారు.

కొడుకు దిద్దిన కాపురం..

Arrow

కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మరో సినిమా ఇది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది.

అన్నతమ్ముడు..

Arrow

రాఘవేంద్రరావు దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటించిన చిత్రమిది. ఇందులో కృష్ణ అతిథి పాత్రలో నటించారు.

రాజకుమారుడు..

Arrow

మహేశ్ బాబుతో పాటు నమ్రతతో కలిసి కృష్ణ నటించిన సినిమా ఇది. కొడుకు, కోడలితో కృష్ణ తెర పంచుకున్న ఈ చిత్రాన్ని బి.గోపాల్ డైరెక్ట్ చేశారు.

వంశీ..

Arrow

తెలుగు తెరకు కౌబాయ్‌ సినిమాను పరిచయం చేసిన తండ్రి కృష్ణతో మహేశ్‌ కౌబాయ్‌గా చేసిన సినిమా ఇది.. ఈ సినిమా క్లైమాక్స్‌లో కృష్ణ కౌబాయ్ గెటప్‌లో కాసేపు అలరిస్తారు.

టక్కరి దొంగ..

Arrow

ఇందులో కృష్ణ ప్రత్యక్షంగా నటించలేదు. కానీ, ‘అల్లూరి సీతారామరాజు’ సన్నివేశాలను ఈ చిత్రంలో ప్రదర్శించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది.

సరిలేరు నీకెవ్వరు..

Arrow