పవన్‌ కల్యాణ్ OGకి శ్రీకారం ఈ ఆసక్తికర అంశాలు తెలుసా?

YouSay Short News App

గబ్బర్‌ సింగ్‌ ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోలో బీభత్సంగా సందడి చేసిన ఓ అభిమాని తీయబోతున్న పవర్ స్టార్‌ పవన్‌ కల్యాణ్ సినిమా OG. సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇవాళ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో కొన్ని క్రేజీ అంశాలు కనిపించాయి. కానీ ఇటీవల సినిమా స్టోరీ గురించి వస్తున్న మాటలు మాత్రం పోస్టర్‌కు భిన్నంగా వినిపిస్తున్నాయి. అసలు పోస్టర్‌లో ఏముందో ముందు చూద్దాం.

చాలా మందికి పోస్టర్‌ చూడగానే ఇదేంటనే అనుమానం వచ్చుంటుంది. OG అంటే ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌. అంటే పాత పద్ధతుల్లోనే డీల్‌ చేసే అసాధారణ నైపుణ్యం ఉన్న గ్యాంగ్‌స్టర్‌ అన్నమాట. సో ఇది పక్కా గ్యాంగ్‌స్టర్‌ మూవీ.

#OG

‘Fire storm is coming’ అంటే నిప్పు తుపాను వస్తోంది అంటూ జపనీస్‌లో పోస్టర్‌పై రాశారు. జపాన్‌ నేపథ్యంలో సినిమా సాగే అవకాశముండొచ్చు

జపనీస్ పదాలు

పోస్టర్‌లో రెడ్‌, ఆరెంజ్‌, బ్లాక్‌ కలర్లను వాడారు. సాధారణంగా రెడ్‌,బ్లాక్ కలర్స్‌ జీవిత పరమార్థాన్ని, అంతరాత్మను చూపిస్తాయి. ఆరెంజ్ కలర్‌ ఆశావాదాన్ని చూపెడుతుంది. అంటే హీరో క్యారెక్టర్‌ ‘ జాన్ విక్’లా ఉండొచ్చు

కలర్స్‌

సాధారణంగా నీడ అంటే చెడును చూపెడుతుంది. వెలుగును దరిచేరనివ్వనిది అని కూడా అర్థం వస్తుంది. ఆ నీడలో తుపాకి అంటే హీరో జీవితంలో తుపాకీ ఓ చీకటి అధ్యాయమని అర్థం అయ్యుండొచ్చు

నీడలో తుపాకి

అస్తమిస్తున్న సూర్యుడిలోకి పయనం అంటే ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడం లేదా ఓ అధ్యాయం ముగిసింది అని చూపుతుంది. హీరో క్లైమాక్స్‌లో తుపాకీతో ఉన్న చీకటి అధ్యాయాన్ని వదిలి వెలుగులో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడని అర్థం కావొచ్చు

అస్తమిస్తున్న సూర్యుడిలోకి పయనం

పవన్‌ కల్యాణ్ కాళ్ల కింద కమలం గుర్తును చూపించారు. ఇది కూడా పునర్జన్మను సూచిస్తుంది. ఆ కమలం కూడా నలుపు రంగులో ఇచ్చారు. అంటే చెడు నుంచి పునర్జన్మ అని అర్థం కావొచ్చు

కమలం

కష్టాలు, కోరికలు, ఆశలు లేని జీవితాన్ని పొందడంపై బుద్ధుడు బోధనలు చేశాడు. అంటే సినిమా గన్స్‌, గ్యాంగ్‌స్టర్‌ నుంచి మంచి దిశగా హీరో ప్రయాణం అనిపిస్తోంది.

బుద్ధ విగ్రహం

భవనాలు గేట్‌ వే ఇండియా లాంటివి చూపించారు. ముంబయి-జపాన్‌ లింక్‌తో సాగే  గ్యాంగ్‌స్టర్‌ డ్రామా అని చెప్పేందుకు ఇచ్చి ఉండవచ్చు. పోస్టర్‌లో మీరు ఇంకేేమైనా గమనించారా?

పోస్టర్‌లో ఇన్ని విషయాలు కనిపిస్తున్నా.. సిినిమాలో పాటలు, యాక్షన్‌ సన్నివేశాలు ఉండబోవని టాక్ వినిపిస్తోంది. పోస్టర్‌లో తుపాకులు చూపించి, గ్యాంగ్‌స్టర్‌ అని చెప్పి ఫైట్లు ఉండవంటే ఎట్లా అని ఫ్యాన్స్‌ కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారు.

ఫైట్స్‌ ఉండవట?!

మరి అసలు సినిమా ఎలా ఉండొచ్చు. మీరేం అనుకుంటున్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.