ఇప్పటి వరకు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ఐదుగురు భారతీయలు ఎవరో తెలుసా?

YouSay Short News App

ఎటా భారతీయ సినిమాలు ఆస్కార్‌కు నామినేట్ అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క భారతీయ సినిమా కూడా  ఆస్కార్ గెలుచుకోలేదు.

కానీ, ఆస్కార్ గెల్చుకున్న భారతీయులు మాత్రం ఉన్నారు. వారెవరో ఓసారి చూద్దాం.

ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్.. ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయురాలు.1982లో చారిత్రక డ్రామా మూవీ 'గాంధీ'సినిమాకు గాను కస్ట్యూమ్ డిజైన్ విభాగంలో అవార్డు లభించింది.

1.భాను అతయా..

భారత సీనిరంగం దిగ్గజ దర్శకులు సత్యజిత్ రాయ్. భారతీయ,బెంగాలీ భాషల్లో అనేక చిత్రాలు నిర్మించారు.1992లో హానరీ ఆస్కార్  ‘లైఫ్ టైమ్ అచీవ్ మెంట్’ అవార్డును గెల్చుకున్నారు.

2. సత్యజిత్ రాయ్

భారతీయుల సినీ నైపుణ్యాన్ని చాటిచెప్పిన సినిమా స్లమ్ డాగ్ మిలియనీర్. ఈ సినిమాకు పనిచేసిన రెసూల్ బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో ఆస్కార్ గెలిచారు.

3. రెసూల్ పూకుట్టి

స్లమ్ డాగ్ మిలియనీర్  మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేసిన AR రహమాన్ ఆస్కార్ అందుకున్నారు.

4. ఎ.ఆర్ రహమాన్

బెస్ట్ ఒరిజినల్ స్కోర్, ఒరిజినల్ ట్రాక్, ఒరిజినల్ సాంగ్ వంటి మూడు క్యాటగిరీలలో ఆస్కార్ కు నామినేట్ అయ్యారు.ఇలా మూడు విభాగాల్లో నామినెట్ అయిన తొలి భారతీయుడు రహమాన్.

స్లమ్ డాగ్ మిలియనీర్‌లోని జయహో పాట ప్రపంచవ్యాప్తంగా అప్పట్లో ఊపు తెచ్చింది.  ఈ పాటకు ప్రముఖ లిరికిస్ట్ గుల్జర్ లిరిక్స్ రాశారు.

5. గుల్జర్

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ లిరిక్స్ రాసినందుకు గుల్జర్ ఆస్కార్ అవార్డును గెల్చుకున్నారు.