‘అవతార్ 2’ VFX సృష్టికర్త ఎవరో తెలుసా?

YouSay Short News App

హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ నిర్మించిన ‘అవతార్ 2’ మూవీ విజువల్ ఎఫెక్ట్స్‌కు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.. VFXకు ఈ సినిమా ఒక బెంచ్‌మార్క్‌గా మారింది. మరి ఈ రేంజ్‌ VFX ఎవరో చేశారో తెలుసా?

Lined Circle

‘వెటా ఎఫ్ఎక్స్’

‘అవతార్ 2’ సినిమా వీఎఫ్ఎక్స్ కోసం న్యూజిలాండ్‌కు చెందిన ‘వెటా ఎఫ్ఎక్స్’ కంపెనీ పని చేసింది. ఈ విజువల్ వండర్‌ను ఈ కంపెనీయే తీర్చిదిద్దింది.

Lined Circle

డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ‘‘అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్’’ రిలీజై భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం థియేటర్లకి తరలివెళ్తున్నారు.

అవతార్; ది విజువల్ వండర్

Lined Circle

ఇది ఒక జీవిత కాల అనుభవం అంటూ ఈ చిత్రంపై యూత్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Lined Circle

మీకు తెలుసా?

వెటా ఎఫ్ఎక్స్ అనేది ప్రపంచలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన గ్రాఫిక్స్ సంస్థ. గత రెండున్నర దశాబ్దాలుగా హాలీవుడ్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ రూపొందించి పేరు ప్రఖ్యాతలు గడించింది.

Lined Circle

21వ శతాబ్ధంలోనే అత్యంత ప్రభావవంతమైన కంపెనీగా వెటా ఎఫ్ఎక్స్ నిలిచింది. ఈ సంస్థ ప్రపంచానికి అత్యాధునిక వీఎఫ్ఎక్స్ సాంకేతికతను పరిచయం చేస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్‌ సృష్టించడంలో  వెటా ఎఫ్ఎక్స్‌ను మించింది మరోటి లేదు.

Lined Circle

1994లో ఈ కంపెనీ ‘హెవెన్లీ క్రియేచర్స్’ అనే సినిమాకు తొలిసారిగా వీఎఫ్ఎక్స్ సేవలు అందించింది. ఆ తర్వాత క్రమక్రమంగా విస్తరిస్తూ హాలీవుడ్ మూవీలకు కూడా విజువల్ ఎఫెక్ట్స్ అందించే స్థాయికి ఎదిగింది.

Lined Circle

1993లో పీటర్ జాక్సన్, రిచర్డ్ టేలర్, జేమీ సీల్‌కిర్క్‌లు కలసి వెటా ఎఫ్ఎక్స్ సంస్థను స్థాపించారు. న్యూజిలాండ్‌లోని మిరామర్‌లో ఈ సంస్థ హెడ్‌క్వార్టర్స్ ఉంది.

Lined Circle

వెటా ఎఫ్ఎక్స్ రూపొందించిన కొన్ని పాపులర్ మూవీస్

Lined Circle

అవార్డులు

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో వెటా ఎఫ్ఎక్స్ సంస్థ 6 అకాడమీ అవార్డులు కొల్లగొట్టింది. 12 అకాడమీ సైన్స్ & టెక్నాలజీ అవార్డులు కైవసం చేసుకుంది.

Lined Circle

బెస్ట్ స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో 6 బాఫ్టా అవార్డ్స్ గెలుచుకుంది. ఫొటో రియల్ ఫీచర్‌లో భాగంగా ఔట్‌స్టాండింగ్ విజువల్ ఎఫెక్ట్స్‌కు గానూ 7 వీఈఎస్ పురస్కారాలు దక్కించుకుంది. ఔట్‌స్టాండింగ్ స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్‌‌లో 2 ఎమ్మీ అవార్డులు దక్కాయి.