Dog Attack: శునకాల నుంచి తప్పించుకోవడం ఎలా? కుక్క కాటుకి గురైతే ఏం చేయాలి?

YouSay Short News App

వీధి కుక్కల భీకర దాడిలో హైదరాబాద్‌లో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలొదిలాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కిపడ్డారు.

వీధి కుక్కల బారి నుంచి తప్పించుకోవడం ఎలా? దాడికి ఎదురు వస్తుంటే మనమేం చేయాలి? ఒకవేళ కుక్క కాటుకు గురైతే అనుసరించాల్సిన పద్ధతులేంటో తెలుసుకుందాం.

సాధారణంగా అధిక శాతం వీధి కుక్కలు కాటు వేయవు. దాదాపు 80శాతం కాట్లు సందర్భోచితంగా జరగుతుంటాయని పరిశోధనలో తేలింది.

కాటు వేయవు..

భయం వల్లనో, ఆత్మ రక్షణ కోసమో కుక్కలు మొరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో వెంటాడి తరుముతాయి.

ఆత్మరక్షణ కోసమే..

చాలా సార్లు మొరగడంతోనే శునకాలు సరిపెట్టుకుంటాయి. కానీ, కొన్ని ఉత్కృష్ట పరిస్థితుల్లో, నియంత్రణ కోల్పోయి శునకాలు  కాటు వేస్తుంటాయి.

కొన్ని పరిస్థితుల్లో..

వీధికుక్కలు దాడి చేసేందుకు వస్తే కంగారు పడకూడదు. స్తబ్దుగా నిలబడాలి. వీలైనంత మేరకు వాటితో ‘ఐ కాంటాక్ట్’ని అవాయిడ్ చేయాలి. వాటితో సంబంధం లేదన్నట్లుగా మెలిగే ప్రయత్నం చేయాలి.

కంగారు పడొద్దు..

కొన్ని శునకాలు ఉద్దేశపూర్వకంగా దాడి చేసే ప్రమాదం ఉండొచ్చు. అలాంటి సమయాల్లో నిర్భయంగా వాటిని ఎదిరించాలి. ఏదైనా వస్తువులను అడ్డు పెట్టడం, కర్ర లాంటి వాటితో శునకాలను అడ్డుకోవాలి.

ఇలా అడ్డుకోండి..

శునకాలు దాడి చేయకుండా తమను తాము రక్షించుకుంటూనే ఇతరుల సహాయం కోసం సైగలు చేయాలి. వీలైనంత మేరకు ఒంటరిగా దొరక్కుండా చూసుకోవాలి.

ఒంటరిగా ఉండొద్దు..

పొరపాటున కుక్క కాటుకు గురైతే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ‘రేబిస్’ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు.

రేబిస్ వ్యాధి ముప్పు

కుక్క కాటు వేసిన చోట సబ్బు లేదా డెటాల్‌ వాటర్‌తో శుభ్రంగా కడగాలి. పై నుంచి నీరు పడేలా అంటే జగ్గుతో గాని, నల్లా నీటి ప్రవాహం కింద గాని పెట్టాలి. కట్టు కట్టకూడదు.

గాయాన్ని కడగండి

యాంటీ రేబిస్ టీకాలను వివిధ దశల్లో వేయించుకోవాల్సి ఉంటుంది. గాయం తీవ్రత అధికంగా ఉంటే వైద్యుల సూచన మేరకు కాటు వేసిన చోట ఇమ్యూనో గ్లోబ్యులిన్ ఇంజెక్షన్ చేయించుకోవాలి.

టీకాలు అవసరం

ముఖ్యంగా కుక్క కాటుకి గురైతే సంబంధిత విషయాన్ని మున్సిపాలిటీ సిబ్బందికి చేరవేయాలి. ఈ ఘటనపై వారు దర్యాప్తు చేపట్టి వీధి కుక్కల విషయంలో తగిన నివారణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

సామాజిక బాధ్యతగా..

వీధి కుక్కలకు తగిన ఆహారం దొరక్కపోవడం కూడా దాడికి పాల్పడటానికి ఒక కారణమవుతోంది. కొంతమంది వాటికి బహిరంగ ప్రదేశాల్లో ఆహారం పెట్టడం సమస్యలకు దారి తీస్తోంది.

అందువల్లేనా..?

హైదరాబాద్‌లో బాలుడి దాడి ఘటనలోని శునకాలు మాంసానికి అలవాటు పడ్డాయట. గత రెండు రోజులుగా ఆహారం లేకపోవడంతో ఆకలి తట్టుకోలేక దాడి చేశాయని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి చెప్పడం వివాదాస్పదమైంది.

మేయర్ వ్యాఖ్యలు..

ఈ వేసవిలో శునకాలతో మరింత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. వాటికి సరైన ఆహారం, నీరు లభించకపోవడం, వేడిమి తీవ్రత వల్ల అసహనానికి గురై స్థానికులపైకి దాడికి దిగే ప్రమాదం ఉంది.

వేసవిలో జాగ్రత్త..

వీధి కుక్కలు ఉండే ప్రాంతాల్లో పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలపై దాడి చేయడం శునకాలకు చాలా సులువు అందుకని వీలయినంత వరకు వారిని ఒంటరిగా వదలకండి.

పిల్లలు జాగ్రత్త!

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.