Doppelganger: అమిగోస్ సినిమా మాదిరి తెలుగులో వచ్చిన 5 డోపుల్ గ్యాంగర్ చిత్రాలు
YouSay Short News App
నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన అమిగోస్ చిత్ర ప్రచారంలో ఎక్కువగా డోపుల్ గ్యాంగర్ అనే పదం వినిపిస్తోంది. అసలు డోపుల్ గ్యాంగర్ అంటే ఏమిటి? డోపుల్ గ్యాంగర్ నేపథ్యంలో వచ్చిన తెలుగు సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.
రక్త సంబంధం లేకుండా ఒకే పోలికలతో ఉండే వ్యక్తులను డోపుల్ గ్యాంగర్ అంటారు
డోపుల్ గ్యాంగర్ అంటే?
డోపుల్ గ్యాంగర్‌గా వస్తున్న సినిమాల్లో ప్రధానంగా ఒకే ధోరణిలో కథ ఉండటం గమనిస్తూ ఉంటుంటాం.
సినిమాల్లో డోపుల్ గ్యాంగర్లు ఒక లక్ష్యం కోసం ఒకరి ప్లేస్‌లో ఒకరు వెళ్లి నటించడం, ఒకరు చనిపోతే వారి పనిని మరొక క్యారెక్టర్ పూర్తి చేయడం వంటివి చూస్తుంటాం.
రాజకీయాలనంతరం చిరంజీవి చేసిన తొలి సినిమా ఇది. ఇందులో చిరంజీవి కత్తి శ్రీను, శంకర్ అనే రెండు పాత్రల్లో డోపుల్ గ్యాగర్‌గా నటించారు.
ఖైదీ 150
డోపుల్ గ్యాంగర్‌గా వచ్చిన సినిమాలు
ఈ రెండు పాత్రలకు ఎలాంటి బయోలాజికల్ రిలేషన్ షిప్ ఉండదు.డోపుల్ గ్యాంగర్ వచ్చిన
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
రవితేజ నటించిన తొలి డోపుల్ గ్యాంగర్ సినిమా. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్ చేశాడు. ఒక పాత్రలో చిన్న చిన్న దొంగతనాలు చేసే దొంగ అత్తిలి సత్తిబాబుగా, మరొక పాత్రలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్రలో జీవించారు.
విక్రమార్కుడు
వీరిద్దరి మధ్య కూడా ఎలాంటి రక్త సంబంధం ఉండదు. అ ఈ సినిమా రవితేజ నట విశ్వరూపాన్ని చూపించింది.
రామ్ చరణ్ తేజ, కాజల్ అగర్వాల్, అమలాపాల్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా నాయక్.
రామ్ చరణ్ రెండు పాత్రల్లో అలరించాడు.
నాయక్
సరదా కుర్రాడి పాత్రలో చెర్రీగా. కలకత్తా రౌడీల ఆటకట్టించిన సిద్ధార్థ్‌నాయక్‌గా రామ్‌చరణ్ నటించారు.
వీరిద్దరు మధ్య కూడా ఎలాంటి సంబంధం ఉండదు. కానీ ఓ లక్ష్యం కోసం ఇద్దరు కలిసి పనిచేస్తారు.
ప్రభాస్ నటించిన తొలి డోపుల్ గ్యాంగర్ చిత్రమిది. ఈ చిత్రంలో ప్రభాస్ రెండు వేరియేషన్లలో కనిపించాడు. చిల్లర దొంగ రంగా పాత్రలో, మరొక పాత్రలో మాఫియా డాన్‌గా కనిపించాడు.
ఈ రెండు పాత్రలకు పరస్పర సంబంధం లేకున్నా పోలీస్ మిషన్ కోసం చనిపోయిన బిల్లా స్థానంలో రంగా వెళ్లి ఆ మిషన్ పూర్తి చేస్తాడు.
బిల్లా
గోపిచంద్ ఈ సినిమాలో డోపుల్ గ్యాంగర్‌గా రెండు క్యారెక్టర్లలో అలరించాడు. ప్రపంచంలోని టాప్ బిలీనియర్లలో ఒకడిగా గౌతమ్ పాత్రలో నటించాడు. పేదరికం అనుభవిస్తూ ఎలాగైనా ధనవంతుడు కావాలనే ప్రయత్నాల్లో ఉండే నందు క్యారెక్టర్ చేశాడు.
గౌతమ్ నందా
సినిమాలో వీరిద్దరూ ఒకరి స్థానంలో ఒకరు వెళ్లి తమ జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటారు.
బింబిసారతో బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిన నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రాజేంద్ర రెడ్డి అనే కొత్త దర్శకుడు చేస్తున్న కొత్త ప్రయత్నమే అమిగోస్.
అమిగోస్
ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ మూడు పాత్రల మధ్య ఎలాంటి బయోలాజికల్ రిలేషన్ షిప్ ఉండదు. వేటికవే భిన్నం.
బిజినెస్ మ్యాన్ పాత్రలో సిద్ధార్థ్‌గా, డ్రగ్స్ డాన్‌గా మైఖేల్ పాత్రలో, సాప్ట్‌వేర్ ఇంజినీర్ పాత్రలో మంజునాథ్‌గా కళ్యాణ్ రామ్ నటించాడు.
మరి ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ డోపుల్ గ్యాంగర్‌గా ఏమేరకు అలరించనున్నాడో వేచి చూడాల్సి ఉంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
టీజర్ లో కథను రివీల్ చేయకుండా జాగ్రత్త పడి ఆసక్తిని పెంచిన దర్శకుడు ట్రైలర్ లో కొద్దిగా కథను రివీల్ చేశాడు.
ముగ్గురు ఒకేలా ఉండే వ్యక్తుల కలయిక ఎన్ని విధ్వంసాలను సృష్టించిందో చూపించడమే అమిగోస్ కథ అని తెలుస్తోంది.