Double Centuries:  సచిన్ నుంచి గిల్ వరకు డబుల్ సెంచరీ వీరులు వీరే..

YouSay Short News App

న్యూజిలాండ్‌పై తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ బాది దిగ్గజాల సరసన చేరాడు. వన్డేల్లో ద్విశతకం చేసిన ఎనిమిదో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

అంతర్జాతీయ వన్డే ఫార్మాట్లో గిల్ చేసిన ద్విశతకం 10వది. అత్యధికంగా రోహిత్ శర్మ 3 సార్లు డబుల్ సెంచరీ చేశాడు.

10వ ద్విశతకం

వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడు గిల్. 23 ఏళ్లలోనే ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

అతి పిన్న వయస్కుడు

వన్డేల్లో డబుల్ సెంచరీలకు నాంది పలికిన ప్లేయర్ తెందుల్కరే. 2010లో సౌతాఫ్రికాపై 147 బంతుల్లో 200 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

సచిన్ తెందుల్కర్

2011లో వెస్టిండీస్‌పై 149బంతుల్లో 219 పరుగులు చేసి తన పేరిట మరో రికార్డును లిఖించుకున్నాడు డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.

వీరేంద్ర సెహ్వాగ్

డబుల్ సెంచరీ చేసిన మూడో ఆటగాడు రోహిత్ శర్మ. 2013, నవంబరులో ఆస్ట్రేలియాపై 158 బంతుల్లో 209 పరుగులు చేశాడు. ఇందులో 16 సిక్సర్లు ఉండటం విశేషం.

రోహిత్ శర్మ

తొలి ద్విశతకం బాదిన సరిగ్గా ఏడాదికి అదే నవంబరు నెలలో హిట్‌మ్మాన్ మరో డబుల్ సెంచరీ చేశాడు. శ్రీలంకపై 173 బంతుల్లో 264 పరుగులు చేశాడు.

రోహిత్ శర్మ

2015 ఫిబ్రవరిలో వెస్టిండీస్ డ్యాషింగ్ ప్లేయర్ క్రిస్ గేల్ డబుల్ సెంచరీ చేశాడు. జింబాబ్వేపై 147 బంతుల్లో 215 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్సులో 16 సిక్సర్లు ఉన్నాయి.

క్రిస్ గేల్

2015 మార్చిలో వెస్టిండీస్‌పై న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 237 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 163 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించాడు.

మార్టిన్ గప్టిల్

2017లో ముచ్చటగా మూడో ద్విశతకాన్ని అందుకుని రికార్డు నెలకొల్పాడు రోహిత్ శర్మ.  3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు రోహితే. మరోసారి శ్రీలంకపై 153బంతుల్లో 208 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

రోహిత్ శర్మ

జింబాబ్వేపై 156బంతుల్లో 210 పరుగులు చేసి పాకిస్థాన్ బ్యాటర్ ఫకర్ జమాన్ నాటౌట్‌గా నిలిచాడు.

ఫకర్ జమాన్

2022లో బంగ్లాదేశ్‌పై ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ సాధించాడు. ఓపెనర్‌గా వచ్చి 131 బంతుల్లో 210 పరుగులు చేశాడు.

ఇషాన్ కిషన్

ఓవరాల్‌గా టీమిండియా తరఫు నుంచి ఐదుగురు డబుల్ సెంచరీలు చేశారు. 149 బంతుల్లో 208 పరుగులు చేసి గిల్  ఔరా అనిపించాడు.

గిల్ 5వ వాడు