Dr. Kamakshi Bhaskarla: ‘పొలిమేర 2’ భామ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?

YouSay Short News App

ws_283291989_1244524579690981_9066221597773795382_n

యంగ్‌ బ్యూటీ కామాక్షి భాస్కర్ల ‘పొలిమేర-2’ మూవీతో ప్రేక్షకులను మరోమారు అలరించింది.

ws_284492493_4956925097770598_435991097467295221_n
ws_275913845_505370224528162_3669596755402552097_n

డైరెక్షన్‌పై ఉన్న ఇష్టంతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ కామాక్షి వ్యవహరించింది.

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ భామ.. చైనాలో ఎంబీబీఎస్‌ చేసింది.

చదువు పూర్తయ్యాక అపోలో ఆసుపత్రిలో కొన్ని రోజుల పాటు డాక్టర్‌గా పని చేసింది.

నటన పైన ఆసక్తితో వైద్య వృత్తిని వదిలేసి మోడలింగ్ రంగంలోకి వచ్చింది.

ఈ క్రమంలోనే 2018లో మిస్‌ తెలంగాణగా ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆ తర్వాత 'ప్రియురాలు' సినిమాతో ఈ బ్యూటీ సినీరంగంలోకి అడుగుపెట్టింది.

విరూపాక్ష, పొలిమేర 1, మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్, రౌడీ బాయ్స్ తదితర చిత్రాల్లో అలరించింది.

విరూపాక్షలో హీరోయిన్‌ తల్లిగా చేసి నటనతో అదరగొట్టింది.

‘సైతాన్‌’, ‘ఝాన్సీ’, ‘కబూల్‌ హై’ వంటి వెబ్‌ సిరీస్‌ల్లోనూ కామాక్షి నటించింది.

ఇక ఈ బ్యూటీ హాబీల విషయానికి వస్తే పుస్తకాలు చదవడం ఆమెకు భలే ఇష్టమట.

చలం రచనలతో పాటు క్లాసికల్‌ డ్యాన్స్‌ అంటే బాగా నచ్చుతుందని ఈ భామ చెప్పుకొచ్చింది.

అలాగే చీరలో కనిపించడమంటే ఇష్టమట, హైదరాబాద్‌ బిర్యానీ అంటే ప్రాణమట.

మాన్షన్‌ హౌస్‌, మల్లేష్‌ చిత్రాల్లో ఈమె నాయికగా చేసింది.

తాజాగా ఆమె నటించిన ‘దూత’ వెబ్‌సిరీస్‌ విడుదలకు సిద్ధంగా ఉంది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran