ECONOMIC SURVEY 2023:  మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్… పూర్తిగా కోలుకున్న ఆర్థిక వ్యవస్థ

YouSay Short News App

ఆర్థిక సర్వే 2022-23ను బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు

గత ఏడాది కాలంలో దేశ ఆర్థికవ్యవస్థ పనితీరు.. వచ్చే సంవత్సరంలో ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఆర్థిక సర్వే.  ఈ ఎకనామిక్ సర్వే ఆధారంగానే ప్రతి సంవత్సరం బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది.

ఆర్థిక సర్వే అంటే?

రాబోయే ఆర్థిక సవాళ్లను ముందుగానే అంచనా వేసి.. వాటిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలను సర్వే సూచిస్తుంది.

రాబోయే ఆర్థిక సంవత్సరం(2023-24)లో దేశ జీడీపీ 6.5 వృద్ధిని నమోదు చేస్తుందని ఎకనామిక్ సర్వే అంచనా వేసింది.

వృద్ధిరేటు

ఆర్థిక సర్వే 2023 ముఖ్యాంశాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23)లో దేశ వృద్ధి రేటు 7శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ద్రవ్యోల్బణం 6.8శాతంగా ఉన్నట్లు వివరించింది.ఇది కొనుగోలు శక్తిని, ఇది విదేశీ పెట్టుబడులకు ఆటంకం కాదని పేర్కొంది.

ద్రవ్యోల్బణం

దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని RBI వడ్డీరేట్ల పెంపు నియంత్రించిందని పునరుద్ఘాటించింది.

దేశంలో నిరుద్యోగం కోవిడ్ ముందు కాలనికంటే తగ్గింది. 2019లో 8.9శాతంగా ఉన్న పట్టణ నిరుద్యోగం 2022లో 7.2శాతానికి దిగొచ్చింది.

నిరుద్యోగం

పారిశ్రామిక వృద్ధిరేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4.1శాతంగా ఉంటుందని పేర్కొంది. కొనుగోలు శక్తిపరంగా(PPP) ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఫారెన్ ఎక్స్చెంజ్ రేటును అనుసరించి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది

పారిశ్రామిక వృద్ధిరేటు

మిగతా ప్రపంచదేశాలతో పోలిస్తే కోవిడ్ నుంచి భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకుంది. నాన్-బ్యాంకింగ్, కార్పొరేట్ రంగాలు ఆరోగ్యకరమైన బ్యాలెన్స్ షీట్‌లను కలిగి ఉన్నాయి.

ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ

ఉక్రెయిన్- రష్యా యుద్ధం, యూరప్ సంక్షోభ పరిస్థితుల వల్ల దేశ వృద్ధిరేటు మందగించినా.. కోలుకుని తిరిగి పుంజుకుందని వెల్లడించింది.

పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన, పీఎం కిసాన్ వంటి పథకాలు పేదరికాన్ని గణనీయంగా తగ్గించడంలో దోహదపడ్డాయి.

పేదరికం

అమెరికా ఫెడ్ రేట్లు పెరిగే అవకాశం ఉండటంతో.. రుపాయి విలువ మరింత క్షిణించే అవకాశం ఉంది

రూపాయి విలువ

కొనుగోలు శక్తిపరంగా(PPP) ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఫారెన్ ఎక్స్చెంజ్ రేటును అనుసరించి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

కరోనా వల్ల దెబ్బతిన్న MSME పరిశ్రమలను కేంద్రం తెచ్చిన అత్యవసర రుణ హామీ పథకం ఆదుకుంది

చిన్నపరిశ్రమలు

కోవిడ్ వల్ల దేశ ఆర్థిక గమనం మందగించినా.. దేశీయ డిమాండ్, పెట్టుబడుల ప్రవాహం అధికంగా ఉండటంతో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది.

విదేశీ పెట్టుబడులు

మరిన్ని వెబ్‌స్టోరీస్‌ కోసం లింక్‌పై క్లిక్‌ చేయండి