టీ20 ప్రపంచకప్‌ 2022 విజేత

YouSay Short News App

ఇంగ్లాండ్‌

టీ20 ప్రపంచకప్‌ 2022 విజేతగా ఇంగ్లాండ్‌ నిలిచింది. ఫైనల్లో పాకిస్థాన్‌పై అద్వితీయ విజయం సాధించింది. రెండోసారి ట్రోఫీ గెల్చుకుని విశ్వవిజేతగా నిలిచింది.

ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ అదరగొట్టింది. తొలుత బంతితో పాక్ బ్యాటర్లను కట్టడి చేసి.. బ్యాటుతో రాణించింది.

బెన్ స్టోక్స్ మరో చిరస్మరణీయ ఇన్నింగ్సుని ఆడాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చి అర్ధశతకాన్ని నమోదు చేశాడు. పాక్ బౌలింగ్ దాడిని ఎదుర్కొని అజేయంగా నిలిచాడు.

138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తొలి ఓవర్లోనే ఫామ్‌లో ఉన్న హేల్స్‌ని కోల్పోయింది. ఆఫ్రిది హేల్స్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు.

తొలి ఓవర్లోనే..

పవర్ ప్లే ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు 49/3. జోరు మీదున్న బట్లర్‌ని కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి బ్రూక్ వచ్చి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు.

పవర్ ప్లే..

పవర్ ప్లే తర్వాత ఇంగ్లాండ్ ఆచితూచి ఆడింది. స్ట్రైక్ రొటేట్ చేస్తూనే ఓవర్‌కో బౌండరీని రాబట్టే ప్రయత్నం చేశారు. బ్రూక్స్(20)తో కలిసి స్టోక్స్ ఇన్నింగ్స్‌ని నిర్మించాడు.

ఆచితూచి..

ఇంగ్లండ్ బ్యాటర్లు మిడిల్ ఓవర్లలో(7-15) తడబడ్డారు. కానీ, వికెట్లను కాపాడుకున్నారు. కేవలం ఒక వికెట్ కోల్పోయి 48 పరుగులు చేసింది.

మిడిల్ ఓవర్స్..

16వ ఓవర్ తొలి బంతిని ఆఫ్రిది మెడిన్ చేశాడు. ఇంగ్లండ్ విజయానికి 30బంతుల్లో 41 పరుగులు చేయాలి. బ్యాట్స్‌మెన్‌ తడబడుతుండగా ఆఫ్రిది బౌలింగ్ చేయలేక మైదానాన్ని వీడాడు. ఇఫ్తికార్ ఓవర్‌ని కొనసాగించగా 13 పరుగులు రాబట్టారు.

టర్న్ చేసిన ఓవర్..

17వ ఓవర్లో ఇంగ్లండ్ జోరు చూపించింది. స్టోక్స్, మొయిన్ అలీ కలిసి ఈ ఓవర్లో ఏకంగా 16 పరుగులు రాబట్టారు. దీంతో విజయం ఇంగ్లండ్ వైపు తిరిగింది.

ఇంగ్లాండ్‌ వైపు టర్న్

2019 వరల్డ్‌కప్‌ని గుర్తు చేస్తూ స్టోక్స్ ఇన్నింగ్స్ షాట్ ఆడి అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లాండ్‌కు అద్భుత విజయం అందించాడు.

ఇన్నింగ్స్ షాట్..

టాస్ ఓడి బ్యాటింగుకి దిగిన పాకిస్థాన్‌ ఇన్నింగ్సును నెమ్మదిగానే ఆరంభించింది. ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ అజామ్ ఆచితూచి ఆడారు. తొలి వికెట్‌కు 29 పరుగులు జోడించారు. రిజ్వాన్ ఔటయ్యాడు.

పాక్ ఇన్నింగ్స్..

రిజ్వాన్ ఔటయ్యాక హ్యారిస్ క్రీజులోకి వచ్చాడు. కానీ ఎంతో సేపు నిలవలేదు. 8వ ఓవర్లో హ్యారిస్ వెనుదిరిగాడు. అప్పటికి స్కోరు 45.

45/2

మసూద్‌తో కలిసి బాబర్ ఇన్నింగ్సుని నడిపించాడు. చాకచక్యంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దుర్బేధ్యంగా సాగుతుందనగా వీరి భాగస్వామ్యాన్ని అదిల్ రషీద్ విడదీశాడు.

రషీద్ దెబ్బ..

కీలక సమయాల్లో పాక్‌కి అండగా నిలుస్తూ వచ్చిన  ఇఫ్తికార్ అహ్మద్ ఈ మ్యాచులో డకౌట్ అయ్యాడు. ఆరు బంతులాడి ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.

ఇఫ్తికార్ డకౌట్..

షాదాబ్ ఖాన్ ధాటిగా ఆడుతుండగా మరో ఎండ్‌లో వికెట్లు పేకమేడల్లా కూలిపోయాయి. 10 పరుగులు తేడాలో పాక్ 4 వికెట్లను కోల్పోయింది. ఫలితంగా భారీ టార్గెట్‌ని నిర్దేశించడంలో పాక్ విఫలమైంది.

10/4..

పాక్ పతనాన్ని బౌలర్లు సామ్ కర్రన్, అదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ శాసించారు.

ఇంగ్లాండ్ బౌలర్లదే గెలుపు..

కర్రన్ 3 వికెట్లు తీయగా.. రషీద్, జోర్డాన్ చెరో రెండు వికెట్లను ఖాతాలో వేసుకున్నారు.

ఇంగ్లాండ్ బౌలర్లదే గెలుపు..

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్ల తేడాతో పాక్‌పై చిరస్మరణీయమైన విజయం సాధించింది. విశ్వ విజేతగా నిలిచింది.

విశ్వ విజేత- ఇంగ్లాండ్