రాయల్ బెంగాల్ టైగర్. మన దేశంలో ఉన్న పులి జాతిలో అతి క్రూరమైనది. ఎంతదూరమైనా ప్రయాణించగలదు. దేనినైనా వేటాడగలదు.
మరో విశేషం ఏంటంటే ఈ పులులు ఈత కొడతాయి. నిజమే, అస్సాంలో ఓ పులి ఏకంగా 120 కిలోమీటర్లు ఈదుకుంటూ ఓ ద్వీపానికి వచ్చిందంటే నమ్మండి.
బ్రహ్మపుత్ర నదిలో ఇటీవల ఆశ్చర్యపోయే దృశ్యం కనిపించింది. ఓ పులి నదిలో ఈదుతుండటం కొందరు గమనించారు. ఇటీవల ఇది సంచలనం అయ్యింది.
పులి స్విమ్మింగ్
నీటిలో ఈత కొడుతూ ఏకంగా 120 కిలోమీటర్లు ప్రయాణించిందని అధికారులు అంచనా వేశారు. చాలా దూరం ప్రయాణించి ఓ ఐలాండ్‌కు చేరిందట.
120 కిలోమీటర్లు
అస్సాంలోని ఉమనంద వద్ద పులిని గుర్తించారు. ఇది అక్కడికి చేరేకంటే ముందు పీకాక్ ఐలాండ్‌లోని గుహల్లో తలదాచుకుంది.
ఎక్కడ గుర్తించారు
గౌహతిలోని ఒరంగా నేషనల్ పార్క్ నుంచి ఈ పులి వచ్చిందట. బ్రహ్మపుత్ర నదిలో నీరు తాగుతుండగా ప్రమాదవశాత్తు పడిపోయి,ప్రవాహంలో అలాగే ఈత కొట్టుకువచ్చిందని భావిస్తున్నారు.
ఎలా వచ్చింది
ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన పులుల్లో రాయల్ బెంగాల్ టైగర్ ఒకటి. ఇవి ఏర్పరుచుకున్న నివాసాల కారణంగా ఈతకొట్టడం అలవాటు చేసుకున్నాయని నానుడి.
పులులు ఈదగలవా?
రాయల్ బెంగాల్ టైగర్ సాధారణంగానే ఇతర జంతువులను వేటాడేందుకు చాలా దూరం ప్రయాణిస్తాయి. అంతేకాదు, ఇవి నీటీలోనూ వేటాడతాయి.
నీటిలోనూ వేట
పులి గురించి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, ఇతర సిబ్బంది దాన్ని చాలా కష్టపడి బంధించారు. 120 కిలోమీటర్లు ఈత కొట్టినా పులి ఆరోగ్యంగా ఉందని చెప్పారు.
ఆరోగ్య పరీక్షలు
ఆరోగ్య పరీక్షలు చేసిన అనంతరం పులిని తిరిగి మళ్లీ అడువుల్లో వదిలేశారు. ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి.