ఒక్క మ్యాచుతో రికార్డులు బద్దలు

FIFA FINAL:

YouSay Short News App

ప్రపంచకప్ చరిత్రలో 2022 ప్రపంచకప్ ఫైనల్ అత్యుత్తమమైనదిగా నిలిచిపోతుంది. ఫ్రాన్స్‌పై అర్జెంటినా కనీవినీ ఎరుగని విజయం సాధించి బంగారు ట్రోఫీని ముద్దాడింది.

ఈ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచుతో రికార్డుల మోత మోగింది. ఎన్నో రికార్డులు ఈ మ్యాచుకు దాసోహమయ్యాయి. ఈ సమరంలో ప్రతి మలుపు ఓ విశేషమే.. ప్రతి మూమెంట్ ఓ జ్ఞాపకమే.

36 ఏళ్ల తరువాత అర్జెంటీనా ప్రపంచకప్ సాధించింది. చివరిగా దిగ్గజ ప్లేయర్ మరడోన సారథ్యంలో 1986లో జట్టు ట్రోఫీ గెలిచింది.

36 ఏళ్ల తరువాత..

దక్షిణ అమెరికా దేశాల్లో 2002 బ్రెజిల్ తర్వాత ఫుట్‌బాల్ ప్రపంచకప్ గెలిచిన మొదటి జట్టు అర్జెంటినా.

మొదటి జట్టు..

రెండో జట్టు..

ప్రపంచకప్ ఆరంభ మ్యాచులో ఓడిపోయి.. ట్రోఫీని గెలిచిన రెండో జట్టుగా అర్జెంటీనా నిలిచింది. తొలి మ్యాచులో సౌదీ అరేబియాతో అర్జెంటీనా ఓడిపోయింది. 2010లో స్పెయిన్ కూడా ఇలాగే ఓటమితో మొదలుపెట్టి ట్రోఫీని ఎత్తుకెళ్లింది.

అర్జెంటీనాకు ఇది మూడో వరల్డ్ కప్ ట్రోఫీ. అత్యధిక టైటిళ్లు గెలిచిన మూడో జట్టు అర్జెంటీనానే. బ్రెజిల్(5) టాప్ లో ఉండగా.. 4 టైటిళ్లతో జర్మనీ, ఇటలీ ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నాయి.

మూడో జట్టు..

ప్రపంచకప్ చరిత్రలో ఓ ఫైనల్ మ్యాచులో అత్యధిక గోల్స్ నమోదు కావడం ఇదే తొలిసారి. ఇరు జట్లు కలిసి 6 గోల్స్ కొట్టాయి. చెరో మూడు గోల్స్‌తో సమవుజ్జీలుగా నిలిచాయి.

గ్రేటెస్ట్ ఫైనల్

ప్రపంచకప్ ఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేసిన రెండో ఆటగాడిగా ఫ్రాన్స్ ఫార్వార్డ్ ప్లేయర్ కిలియన్ ఎంబాపె నిలిచాడు.

హ్యాట్రిక్ రికార్డ్..

56ఏళ్ల కిందట ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ జియోఫ్ హర్‌స్ట్‌తో సమంగా నిలిచాడు.

అత్యధిక మ్యాచ్‌లు..

ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక మ్యాచులు ఆడిన ఆటగాడిగా మెస్సీ నిలిచాడు. ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో 26 మ్యాచులు ఆడిన క్రీడాకారుడిగా రికార్డు సాధించాడు. జర్మనీ ప్లేయర్స్ లోథర్ మ్యాథ్యూస్ 25 మ్యాచులు ఆడాడు.

ప్రపంచకప్ ఫైనల్ మ్యాచులో జరిగిన పెనాల్టీ షూటౌట్ రౌండులో ఓడిపోవడం ఫ్రాన్స్‌కిది రెండోసారి.

షూటౌట్ గండం..

2006లో ఇటలీ చేతిలో 5-3 తేడాతో ఓడిపోయింది. అర్జెంటినాతో 4-2 తేడాతో మరోసారి చేదు అనుభవాన్ని చవిచూసింది.

అర్జెంటినాకు పెనాల్టీ షూటౌట్ రౌండ్ కలిసొస్తుంది. ఇప్పటివరకు ఈ జట్టు ఆరు సార్లు పెనాల్టీ షూటౌట్ రౌండులో విజయం సాధించింది.

షూటౌట్ వరం..

ఫ్రాన్స్ ఫార్వార్డ్ ప్లేయర్ ఎంబాపె 8 గోల్స్ చేసి అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ గోల్స్‌తో పాటు రెండు అసిస్ట్‌లు కూడా అందించాడు.

మెస్సీ VS ఎంబాపె..

అర్జెంటినా కెప్టెన్ లియోనల్ మెస్సీ.. 7 గోల్స్, 3 అసిస్టులతో రెండో టాప్ గోల్ స్కోరర్‌గా నిలిచాడు.