ఫిఫా ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకుంది. 16 జట్లు ఇప్పటికే ఇంటి బాట పట్టగా..మరో 16 టీంలు విజయాలు సాధించి నాకౌట్ స్టేజీకి వచ్చాయి.
మూడు ఆసియా జట్లు నాకౌట్ కు చేరుకున్నాయి. 1994 నుంచి ఇప్పటివరకు మూడు గ్రూప్ దశ మ్యాచ్ లను ఏ జట్టు గెలవలేకపోయింది. మరి ఈ పోరులో ఎవరెవరు తలపడనున్నారో తెలుసుకుందాం.
బెల్జియం గతేడాది వరల్డ్ కప్ లో మూడో స్థానంలో నిలిచింది. దీంతో ఈ సారి ఫేవరేట్ జట్లలో ఒకటిగా ఉన్న బెల్జియంకు ఎదురుదెబ్బ తగిలింది. క్రొయోషితో మ్యాచ్ డ్రా కావటంతో పాటు మెర్రాకోపై ఊహించని పరాజయంతో ఇంటి బాట పట్టింది.
బెల్జియం
ఫిఫా ప్రపంచకప్ లో నిరాశ పరిచిన జట్లు
2014లో విజేతలుగా నిలిచిన జర్మనీ రెండుసార్లు నాకౌట్ దశను చేరుకోలేకపోయింది. జపాన్ మీద 2-1 తేడాతో ఓడిపోవటంతో ఆ జట్టు ఆశలు అడియాశలయ్యాయి.
జర్మనీ
ఫుట్ బాల్ లో మంచి పేరున్న ఉరుగ్వే సౌత్ కొరియాపై మెుదటి మ్యాచ్ ను డ్రాగా ముగించింది. గనాపై 2-0 తేడాతో ఓటమి పాలవ్వటంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఉరుగ్వే
గ్రూప్ సీ టాప్ గా నిలిచిన అర్జెంటీనా, గ్రూప్ డీ రన్నరప్ ఆస్ట్రేలియాతో నాకౌట్ లో తలపడనుంది. మెస్సీ సారథ్యం వహిస్తున్న అర్జెంటీనా హాట్ ఫేవరేట్ గా బరిలో నిలుస్తుంది. ఆస్ట్రేలియా కూడా బలంగానే కనిపిస్తుంది.
అర్జెంటీనా V ఆస్ట్రేలియా
నాకౌట్ తప్పక చూడాల్సిన మ్యాచ్ లు
గ్రూప్ జీ మెుదటిస్థానంలోని బ్రెజిల్ ఫేవరేట్ జట్లలో ఒకటి. ఈ టీం గ్రూప్ హెచ్ లోని సౌత్ కొరియాతో పోరుకు సిద్ధమయ్యింది. పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఇచ్చిన షాక్ తో 2-1 తేడాతో ఓడిపోయి ఆ గ్రూప్ లో దక్షిణ కొరియా రన్నరప్ గా నిలిచింది.
బ్రెజిల్ v సౌత్ కొరియా
కెప్టెన్సీ ఆశలు పదిలంగా ఉంచుకోవాలంటే రొనాల్డో తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఇది. పోర్చుగల్ సెమీస్ వెళ్లేందుకు ఎంతవరకైనా పోరాడటానికి సిద్ధంగా ఉంది. కానీ, స్విట్జర్లాండ్ జట్టును ఎదుర్కోక తప్పదు.