ఏ అవార్డు విజేత ఎవరంటే!

FIFA WORLD CUP 2022

YouSay Short News App

ఫిఫా ప్రపంచకప్‌ 2023 విజేతగా అర్జెంటినా గెలిచింది. 36 ఏళ్ల తరువాత మరోసారి విశ్వవిజేతగా అవతరించింది.

ప్రపంచకప్ ఫైనల్ మ్యాచులో అర్జెంటినా అవార్డుల పంట పండించింది. ఫిఫా అందించే నాలుగింటిలో మూడు అర్జెంటినా ఆటగాళ్లే సొంతం చేసుకున్నారు.

ఈ ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా ఫ్రాన్స్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాపె నిలిచాడు. 8 గోల్స్ చేసి ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు.

గోల్డెన్ బూట్..

కీలక ఫైనల్ మ్యాచులో హ్యాట్రిక్ గోల్స్ చేసి ఫ్రాన్స్‌ని టైటిల్ రేసులో నిలిపాడు. రెండు అసిస్టులు కూడా ఎంబాపె ఖాతాలో ఉన్నాయి.

గోల్డెన్ గ్లవ్..

ఈ ప్రపంచకప్‌లో అత్యద్భుత ప్రదర్శన చేసిన గోల్ కీపర్‌గా ఇమిలియానో మార్టినేజ్ నిలిచాడు. ఈ అర్జెంటినా ఆటగాడిని గోల్డెన్ గ్లోవ్ అవార్డు వరించింది.

క్వార్టర్‌ఫైనల్లో నెదర్లాండ్స్‌తో, ఫైనల్లో ఫ్రాన్స్‌తో పెనాల్టీ షూటౌట్లో రెండు అద్భుత సేవ్స్‌తో జట్టును విజేతగా నిలిపాడు.

అర్జెంటినా కెప్టెన్ లియోనల్ మెస్సీ రెండోసారి గోల్డెన్ బాల్ అవార్డును అందుకుని రికార్డు సృష్టించాడు. 2014లో అర్జెంటినా ఫైనల్ ఓడినప్పటికీ గోల్డెన్ బాల్ అవార్డు మెస్సీకి దక్కింది.

గోల్డెన్ బాల్..

ప్రపంచకప్ చరిత్రలో ఏ ఆటగాడికీ రెండు గోల్డెన్ బాల్ అవార్డులు రాలేదు

గోల్డెన్ బూట్ అవార్డు రేసులోనూ మెస్సీ నిలిచాడు. కేవలం ఒక గోల్ వెనకబడి ఉండటంతో గోల్డెన్ బూట్ అవార్డును కోల్పోయాడు. ఈ ప్రపంచకప్‌లో మెస్సీ 7 గోల్స్ చేయగా.. 3 గోల్స్‌కి నేరుగా సాయపడ్డాడు.

యంగ్ ప్లేయర్..

అర్జెంటినా మిడ్ ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెజ్‌.. ఫిఫా యంగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు గెలుచుకున్నాడు.

21ఏళ్ల ఈ కుర్రాడు కీలక సమయాల్లో అర్జెంటినాకు గోల్స్ చేయడమే కాక.. ప్రత్యర్థికి కళ్లెం వేశాడు.

డబ్బులే డబ్బులు..

అర్జెంటినా ఛాంపియన్‌గా నిలవడంతో ఆ జట్టుకు భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ దక్కనుంది. సుమారు రూ.347 కోట్లు అర్జెంటినా ఖాతాలో పడనున్నాయి.

రన్నరప్‌గా నిలిచిన ఫ్రాన్స్‌కు రూ.248 కోట్లు, మూడో స్థానంలో నిలిచిన క్రొయేషియాకు రూ.220 కోట్లు, నాలుగులో నిలిచిన మొరాకోకు రూ.204కోట్లు దక్కనున్నాయి.

క్వార్టర్ ఫైనలిస్టులు బ్రెజిల్, నెదర్లాండ్స్, పోర్చుగల్, ఇంగ్లండ్‌లకు రూ.138 కోట్లు రానున్నాయి. రౌండ్ ఆఫ్ 16కు చేరిన జట్లకు రూ.106 కోట్లు, గ్రూప్ దశలో వెనుదిరిగిన జట్లకు రూ.74 కోట్లు ఖాతాలో పడనున్నాయి.