Flipkart Black Friday Sale:

స్మార్ట్‌ ఫోన్లపై బెస్ట్‌ డీల్స్‌ ఇవే

YouSay Short News App

దీపావళి తర్వాత స్మార్ట్‌ఫోన్‌లపై అంత మంచి సేల్స్‌ ఏమీ రాలేదు. అయితే తాజాగా ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌ ఫ్రైడే పేరుతో సూపర్‌ సేల్‌ తీసుకొచ్చింది. ఐసీఐసీఐ, కోటక్‌ తదితర కార్డులపై డిస్కౌంట్లతో పాటు అద్భుతమైన ఆఫర్లు, ఎక్సేంజీలకు స్పెషల్ డిస్కౌంట్లు అందిస్తోంది.

₹ 8 వేలకే Nothing Phone1

₹37,999 రూపాయల ధర ఉన్న Nothing Phone1 27 శాతం డిస్కౌంట్‌తో ₹27,499గా ఉంది. సెలెక్టెడ్‌ బ్యాంక్ కార్డ్స్‌ ద్వారా ₹1500 డిస్కౌంట్‌ లభిస్తోంది.

దీనికి తోడు పాత ఫోన్‌ ఎక్సేంజ్‌ ద్వారా మరో ₹ 17500 రాయితీ పొందొచ్చు. అంటే కేవలం ₹7999కే నథింగ్ ఫోన్‌1 మీ సొంతం చేసుకునే అవకాశముంది

స్పెసిఫికేషన్స్‌:

*8/12Gb ర్యామ్‌ *స్నాప్‌ డ్రాగన్‌ 778 5జీ ప్రాసెసర్‌ *6.55” డిస్‌ప్లే *50mp కెమెరా *4500mAh బ్యాటరీ

కెమెరా, బ్యాటరీ బ్యాకప్‌ బాగుటుంది. డిజైన్‌ పరంగా మిగతా ఫోన్లతో పోలిస్తే ప్రత్యేకంగా ఉంటుంది. కొన్ని ఫీచర్లు అంత సులభతరంగా ఉండవు. వినియోగదారుడికి ఇబ్బంది అనిపించవచ్చు.

మోటోరోలా ఎడ్జ్‌ 30 అల్ట్రా 5జీ

200Mp కెమెరాతో వచ్చే మోటోరోలా ఎడ్జ్‌ 30 అల్ట్రా 5జీ అసలు ధర ₹59,999 కాగా  ₹5,000 డిస్కౌంట్‌తో ₹54,999గా ఉంది. కార్డ్‌ ఆఫర్‌ మరో ₹1500 వరకు వస్తుంది.

స్పెసిఫికేషన్స్‌:

*8/12Gb ర్యామ్‌ *స్నాప్‌ డ్రాగన్‌ 8+ Gen1 ప్రాసెసర్ *6.67” డిస్‌ప్లే *200mp కెమెరా *4160mAh బ్యాటరీ

డిజైన్‌, పెర్ఫార్మెన్స్‌, డిస్‌ప్లే అద్భుతంగా ఉంటాయి. 200mp కెమెరా బాగానే ఉంది గానీ, అంత  అద్భుతమైతే కాదు.  

యాపిల్‌ ఐ ఫోన్‌ 11

యాపిల్‌ ఐ ఫోన్ 11పై ₹24,000 వరకు డిస్కౌంట్‌  పొందొచ్చు. సేల్‌లో భాగంగా ₹43,900 ఫోన్‌ ₹39,999కే వస్తుంది. దీంతో పాటు ₹17,500 ఎక్సేంజ్‌ ఆఫర్‌ ఇస్తున్నారు. బ్యాంక్‌ కార్డ్స్‌ ఆఫర్‌ కూడా ₹1500 వరకు ఉంటుంది.

స్పెసిఫికేషన్స్‌:

*4Gb ర్యామ్‌ *యాపిల్‌ A13 బయోనిక్‌ *6.1” డిస్‌ప్లే *12mp కెమెరా *3110mAh బ్యాటరీ

పెర్ఫార్మెన్స్‌ అద్భుతంగా ఉంటుంది. కెమెరా గురించి చెప్పనక్కర్లేదు.

వీవో V25 ప్రో 5G

₹39,999 వీవో వీ25 5జీ ₹35,999కే అందుబాటులో ఉంది. దీంతో పాటు ₹17,500 వరకు ఎక్సేంజ్‌ ఆఫర్‌ వస్తుంది. ఎంపిక చేసిన కార్డులతో ₹1500 వరకు బ్యాంక్‌ ఆఫర్లు కూడా ఉంటాయి.

స్పెసిఫికేషన్స్‌:

*8/12Gb ర్యామ్‌ *డైమెన్సిటీ 1300 *6.56” డిస్‌ప్లే *64mp కెమెరా *4830mAh బ్యాటరీ

కెమెరా, పెర్మార్మెన్స్‌, డిజైన్‌ బాగుటుంది. 3.5mm ఆడియో జాక్‌, స్టీరియో స్పీకర్స్‌, మెమోరీ కార్డ్‌ స్లాట్‌ లేకపోవడం మైనస్‌.

రియల్‌మీ GT Neo 3T

₹36,999 ధర ఉన్న ఈ ఫోన్‌ ₹31,999 లభిస్తోంది. దీంతో పాటు ₹17,500 వరకు ఎక్సేంజీ కూడా ఉంది. అలాగే బ్యాంక్‌ ఆఫర్స్‌ ₹1500 వరకు ఉంటాయి.

స్పెసిఫికేషన్స్‌:

*6/8Gb ర్యామ్‌ *స్నాప్‌డ్రాగన్‌ 870 5g *6.62” డిస్‌ప్లే *64mp కెమెరా *5000mAh బ్యాటరీ

డిజైన్‌, డిస్‌ప్లే, బ్యాటరీ బ్యాకప్‌ బాగుటుంది.కెమెరా పెర్ఫార్మెన్స్‌ అంత గొప్పగా ఉండదు.

మరికొన్ని బెస్ట్‌ డీల్స్‌

POCO X4 Pro 5G

అసలు ధర  ₹23,999, ఆఫర్‌ ధర ₹17000

Motorola Edge 20 Fusion 5G

అసలు ధర ₹24,999, ఆఫర్‌ ధర ₹18,999

Motorola g82 5G

అసలు ధర ₹23,999, ఆఫర్‌ ధర  ₹19,999

realme 9 5G SE

అసలు ధర ₹24,999, ఆఫర్‌ ధర ₹19,999 వీటన్నింటిపైనా ₹17,500 వరకు ఎక్సేంజి ఆఫర్‌ కూడా ఉంది.