హైదరాబాద్ నగరంలో మళ్లీ ‘ఫార్ములా ఈ రేసింగ్’

YouSay Short News App

 టికెట్ బుకింగ్స్ స్టార్ట్, ధర ఎంతంటే?

హైదరాబాద్ నగరంలో మళ్ళి రేసింగ్. ఇటీవల జరిగిన ఇండియన్ రేసింగ్ లీగ్, నేషనల్ రేసింగ్ చాంపియన్‌షిప్‌ ముగిసిన తర్వాత ‘ఫార్ములా  ఈ’ ఈవెంట్ రేసింగ్‌కి హైదరాబాద్ ముస్తాభైంది.

హుస్సేన్ సాగర్ సమీపంలో ఫార్ములా ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో విశిష్టత ఏమిటంటే ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ కార్ రేసింగ్.

‘ఫార్ములా ఈ’ ఈవెంట్ రేసింగ్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 10న ప్రాక్టీస్ రేసింగ్ నిర్వహించనున్నారు. ఈ మెగా ఈవెంట్‌లో మొత్తం 11 దేశాల నుంచి 22 మంది డ్రైవర్లు పోటీపడనున్నారు.

ఈవెంట్ వివరాలు 

క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉదయం 10:40 గంటల నుంచి 11:55 వరకు జరుగుతుంది. అసలు పోటీలను ఫిబ్రవరి 11న నిర్వహిస్తారు.

ఈసారి జరగబోయే పోటీల్లో ఇండియన్ రేసర్స్ ఎవరు లేరు.వచ్చేసారి జరిగే పోటీలో భారత్ పాల్గొనే అవకాశం ఉంది.

ఇండియన్ రేసర్ ఉన్నారా.....?

రేస్‌కు సంబంధించిన టిక్కెట్లు జనవరి 4న బుక్ మై షోలో రిలీజ్ చేయటం జరిగింది.

బుకింగ్స్‌ ఇలా..

టికెట్ల ధర రూ.1000 నుంచి రూ.10,000 వరకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంచారు. గ్రాండ్ స్టాండ్ ధర రూ.1000, చార్జ్‌ గ్రాండ్ స్టాండ్ రూ.3,500, ప్రీమియం గ్రాండ్ స్టాండ్ రూ.6,000, ఏస్ గ్రాండ్ స్టాండ్ రూ.10వేలుగా ఉంది.

టిక్కెట్ల ధర :

కర్బన ఉద్గారాలను తగ్గించి పునరుత్పాదక ఇంధన శక్తిని ప్రోత్సహించడమే ‘ఫార్ములా ఈ’ రేసింగ్ లక్ష్యం. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ‘ఫార్ములా ఈ’ రేసింగ్ ఆదర్శాలకు అనుగుణంగా ఉన్నాయి. దీంతో రేసింగ్‌కు హైదరాబాద్‌ను అంతర్జాతీయ ఆటోమొబైల్ ఫెడరేషన్(FIA) ఎంపిక చేసింది.

ఎందుకు హైదరాబాద్ లోనే....?

ఈ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా 17 రౌండ్లుంటాయి. ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలు ఒక్కో రౌండుకి ఆతిథ్యం ఇస్తున్నాయి. మన హైదరాబాద్‌ని నాలుగో రౌండ్ కోసం నిర్వహకులు ఎంపిక చేసుకున్నారు. 17 రేసుల్లో 4వ రౌండ్‌ను హైదరాబాద్ నిర్వహిస్తుంది.

4వ రౌండ్ మన హైదరాబాద్‌లో

‘ఫార్ములా ఈ ప్రిక్స్’ రేసింగ్ కోసం హుస్సేన్ సాగర్ తీరాన ‘హైదరాబాద్ స్ట్రీట్ సర్య్కూట్‌’ పేరిట  2.7కి.మీ మేర ట్రాక్ ఏర్పాటైంది. ఇందులో మొత్తం 17 మలుపులున్నాయి.

ఫార్ములా ఈ-రేసింగ్ నేపథ్యంలో ఫిబ్రవరి 10 నుంచి పోటీలు ముగిసే వరకు హుస్సేన్ సాగర్ చుట్టు పక్కల ట్రాఫిక్‌ను దారిమళ్లిస్తారు. ఆ రూట్లో రాకపోకలకు అనుమతి ఉండదు.

Ace Nxt Gen Formula E, తెలంగాణ ప్రభుత్వం మధ్య భాగస్వామ్యం నాలుగు సంవత్సరాల పాటు కొనసాగనుంది. ఛాంపియన్‌షిప్ 2026 భారతదేశంలో నిర్వహించనున్నట్లు సమాచారం.

భవిష్యత్తు ప్రణాళికలు..

– హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. – మరిన్ని గ్లోబల్ ఈవెంట్లు హైదరాబాద్‌పై ఆసక్తి చూపిస్తాయి.

రేస్ వల్ల హైదరాబాద్‌కు ఏం లాభం?

ఇటీవల జరిగిన ఇండియా vs ఆస్ట్రేలియా మ్యాచ్ టిక్కెట్ల ఎలాగైతే బ్లాక్ చేసారో ‘ఫార్ములా ఈ’ రూ. 1000 టిక్కెట్లను నిలిపివేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కేవలం 5 వేల రూపాయల టిక్కెట్లను మాత్రమే ఆన్‌లైన్‌లో చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టిక్కెట్ల వివాదాలు :