Snapinsta.app_1080_30076866_198674037577485_8527418632882356224_n

హైదరాబాద్‌లో తొలిసారి

LOGO 1

YouSay Short News App

ఎప్పుడు? ఎక్కడ? ఎలా?

Formula E రేసింగ్‌..

అత్యున్నతమైన రేసు..

మోటార్‌స్పోర్ట్స్‌లో అత్యున్నతమైనది ‘ఫార్ములా ఈ’ రేసు. ఇండియాలో తొలిసారిగా ‘ఫార్ములా-ఈ’ రేసింగ్‌కి హైదరాబాద్ ఎంపికైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరిగే ‘ఫార్ములా ఈ ప్రిక్స్’ రేసుకి భాగ్యనగరం ఆతిథ్యం ఇస్తోంది.

Snapinsta.app_1080_117727479_3529545047068582_787966869170868027_n

హైదరాబాదే ఎందుకు..?

కర్బన ఉద్గారాలను తగ్గించి పునరుత్పాదక ఇంధన శక్తిని ప్రోత్సహించడమే ‘ఫార్ములా ఈ’ రేసింగ్ లక్ష్యం. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ‘ఫార్ములా ఈ’ రేసింగ్ ఆదర్శాలకు అనుగుణంగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌ని రేసింగ్‌కి అంతర్జాతీయ ఆటోమొబైల్ ఫెడరేషన్(FIA) ఎంపిక చేసింది.

FOrmula Erace
Snapinsta.app_1080_117377699_1342612992601694_788622475692032077_n

‘ఫార్ములా ఈ ప్రిక్స్’ రేసు..

ఈ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా 17 రౌండ్లుంటాయి. ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలు ఒక్కో రౌండుకి ఆతిథ్యం ఇస్తున్నాయి. మన హైదరాబాద్‌ని నాలుగో రౌండ్ కోసం నిర్వహకులు ఎంపిక చేసుకున్నారు.

హైదరాబాద్ స్ట్రీట్ సర్య్కూట్‌

‘ఫార్ములా ఈ ప్రిక్స్’ రేసింగ్ కోసం హుస్సేన్ సాగర్ తీరాన ‘హైదరాబాద్ స్ట్రీట్ సర్య్కూట్‌’ పేరిట  2.7కి.మీ మేర ట్రాక్ ఏర్పాటైంది. ఇందులో మొత్తం 17 మలుపులున్నాయి. ట్రయల్ రన్ కోసం సిద్ధం చేసిన ఈ ట్రాక్‌లో ప్రయోగాత్మకంగా ఇండియన్ రేసింగ్ లీగ్(IRL) ఛాంపియన్‌షిప్‌ని నిర్వహించనున్నారు.

ఏమిటీ IRL..

మనదేశంలోని ప్రతిభావంతులను వెలికి తీసేందుకు ఏర్పాటు చేసిందే ఈ ఇండియన్ రేసింగ్ లీగ్(IRL). ఒక రకంగా క్రికెట్‌లో ఐపీఎల్ వంటిదన్నమాట. జపాన్, అమెరికాలోనూ దేశీయ రేసింగ్ లీగ్‌లు జరుగుతున్నాయి.

తొలి, మలి రౌండ్..

IRL స్థూలంగా నాలుగు రౌండ్లలో పూర్తికానుంది. మొదటి, నాలుగో రౌండ్‌ని హైదరాబాద్‌లో; రెండు, మూడు రౌండ్లని చెన్నైలో నిర్వహిస్తున్నారు. చెన్నై ట్రాక్ పొడవు 3.7కి.మీ(ఒక ల్యాప్) కాగా, మనది 2.7కి.మీ ల్యాప్.

ఎప్పుడంటే

నవంబరు 19,20న తొలి రౌండ్; నవంబరు 25-27వరకు రెండో రౌండ్, డిసెంబరు 2-4వరకు మూడో రౌండ్, డిసెంబరు 10, 11న నాలుగో రౌండ్ జరగనుంది.

6జట్లు.. 24మంది రేసర్లు..

మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ప్రతి జట్టులో నలుగురు సభ్యులుంటారు. మొత్తంగా 12మంది విదేశీ రేసర్లు పాల్గొంటున్నారు.. ప్రతి జట్టులో ఒక మహిళా రేసర్ ఉంటుంది. ప్రతి రౌండులో రెండు స్ప్రింట్, ఒక ఫ్యూచర్ రేసులుంటాయి.

స్ప్రింట్ రేసు..

స్ప్రింట్ రేసులో ఒక్క రేసర్ మాత్రమే పాల్గొంటాడు. 12 కార్లు ట్రాక్‌పై నడుస్తాయి. 20 నిమిషాల నిడివిలో పూర్తి చేసిన ల్యాప్‌ల ఆధారంగా పాయింట్లు లెక్కిస్తారు.

ఫ్యూచర్ రేసు..

ఫ్యూచర్ రేసులో ఇద్దరు డ్రైవర్లు పాల్గొంటారు. రేసు మధ్యలో డ్రైవర్‌ని మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ట్రాక్‌పై 12 కార్లు ఉంటాయి. 40 నిమిషాలు రేస్ నిడివి. వీటిల్లో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టును విజేతగా ప్రకటిస్తారు.

జట్లు..

హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్, గోవా ఏసెస్, చెన్నై టర్బో రైడర్స్, గాడ్ స్పీడ్ కొచ్చి, బెంగళూరు స్పీడ్‌స్టర్స్, స్పీడ్ డెమాన్స్ డిల్లీ జట్లు పాల్గొంటున్నాయి.

తెలుగు రేసర్..

హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ జట్టులో మన తెలుగు కుర్రాడు అనిందిత్ రెడ్డి ఉన్నాడు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అపోలో ఆసుపత్రి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డిల కుమారుడు ఇతను. 2016లో యూరో జేకే 16 ఛాంపియన్‌షిప్, 2017 యూరో జేకే ఛాంపియన్‌షిప్‌లను అనిందిత్ సొంతం చేసుకున్నాడు. రేసింగులో ఏడేళ్ల అనుభవం ఉంది.

ఇటలీ కార్లు..

ఇటలీకి చెందిన వోల్ఫ్ సంస్థ.. రేసింగ్ కార్లు, సాంకేతికతను పర్యవేక్షించనుంది. ఈ కార్లు గరిష్ఠంగా గంటకు 250కి.మీ వేగంతో ప్రయాణించగలవు. 380కిలోల బరువుతో 1.1లీటర్ ఇంజిన్ సామర్థ్యంతో నడుస్తాయి. పార్ములా ఈ రేసు కార్లు గంటకు 400కి.మీ వేగంతో దూసుకెళ్లగలవు.

ఇక్కడ చూడొచ్చు..

IRL  ఛాంపియన్‌షిప్‌ని స్టార్ స్పోర్ట్స్ 2లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఔత్సాహికులు నేరుగా చూడొచ్చు. బుక్ మై షో ద్వారా టికెట్‌ని కొనుక్కోవచ్చు. ధర. రెగ్యులర్ పాస్ రూ.749 కాగా, రెండు రోజులకు రూ.1249.

ఆ మార్గం బంద్‌

ఫార్ములా E రేసు దృష్ట్యా ట్యాంక్‌ బండ్‌ చుట్టూ ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయి. నవంబర్‌ 16 నుంచి 20 వరకు ఎన్టీఆర్‌ మార్గ్‌ పూర్తిగా మూసివేస్తున్నారు.