సమంత త్వరగా కోలుకో

మేమున్నాం అంటున్న టాలీవుడ్

మయోసైటిస్ వ్యాధితో సమంత విదేశాల్లో చికిత్స పొందుతోంది. సామ్‌కు అండగా సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

త్వరగా కోలుకో సామ్. నీకు ఆ దేవుడు ఆత్మస్థైర్యం కలిగించాలి.

జూనియర్ ఎన్టీఆర్

కాలానుగుణంగా వచ్చే సమస్యల్ని ఎదురిస్తేనే మన ధృడంగా మారగలం. మనోనిబ్బరం కలిగిన అద్భుతమైన వ్యక్తివి నువ్వు. త్వరగా కోలుకుంటావ్ సామ్.

చిరంజీవి

నువ్వు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. మరింత స్థైర్యంతో, రెట్టించిన ఉత్సాహంతో తిరిగి రావాలని ఆశీర్వదిస్తూ అమితమైన శక్తిని ప్రసాదిస్తున్నా.

రాఘవేంద్రరావు

నీతో ఎప్పుడూ మాట్లాడకపోయినప్పటికీ.. ఈ వార్త వినగానే నా మనసు ద్రవీభవించింది. నాకు తెలిసిన గొప్ప వ్యక్తుల్లో నువ్వు ఒకరు. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా.

నాగబాబు

అందరి ప్రేమాభిమానాలే నీకు బలాన్నిస్తాయి. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా.

అఖిల్

త్వరగా కోలుకుంటావ్ సామ్. మునపటి కన్నా మరింత ధృడంగా నువ్ మారబోతున్నావు.

కాజల్ అగర్వాల్

నీకు మరింత ఆత్మస్థైర్యం కలగాలి సామ్. నువ్ చెప్పినట్లు.. ఈ గడ్డుకాలం కూడా ముగిసిపోతుంది.

దుల్కర్ సల్మాన్

నువ్ త్వరలోనే మళ్లీ వస్తావ్. ఇంతకుముందు కన్నా మరింతగా ప్రకాశిస్తావ్. నీ కోసం మేం ప్రార్థిస్తున్నాం. మా ప్రేమాభిమానాలు ఎప్పుడూ నీపైనే.

సాయిపల్లవి

నీకు మరింత శక్తిని ప్రసాదించాలి. మునపటి కన్నా ధృడంగా నువ్వు అరంగేట్రం చేస్తావ్. ఆరోగ్యం జాగ్రత్త.

కీర్తి సురేష్

సెట్‌లో చాలా యాక్టివ్‌గా ఉండేదానివి. త్వరగానే కోలుకొని తిరిగొస్తావ్

వరలక్ష్మి శరత్ కుమార్

వీరిద్దరూ సామ్‌కు ధైర్యం నూరిపోసినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

నాగార్జున, నాగచైతన్య

సమంత ఈ వ్యాధి బారిన పడడానికి చై, సామ్ బ్రేకప్పే కారణమని కొందరు అంటున్నారు. సమంత కుంగుబాటుకు గురైందని.. తద్వారా ఈ వ్యాధి అటాక్ చేసినట్లు చెబుతున్నారు. నాగచైతన్యని కొందరు నిందిస్తున్నారు.

విడిపోవడమే కారణమా?